breaking news
trible student
-
విశాఖలోని యోగా డేలో గిరిజన విద్యార్థుల ఆకలి కేకలు
-
మన గిరిజన విద్యార్థులకు అమెరికా పిలుపు
-
విలువైన శిక్షణ
బుట్టాయగూడెం : విలువిద్యలో గిరిజన విద్యార్థులు సంధించిన బాణంలా దూసుకుపోతున్నారు. టార్గెట్‌పై దృష్టిపెట్టి ముందుకు సాగిపోతున్నారు. పతకాలు సాధిస్తూ తద్వారా జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపును తీసుకువస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే ఈ విద్యకున్న విలువను తెలుసుకున్న కేఆర్‌పురం ఐటీడీఏ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. రూ.లక్షలు ఖర్చుతో క్రీడా సామగ్రి కొనుగోలు చేసి అందిస్తున్నారు. ఐటీడీఏ పరిధి ఏజెన్సీలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆసక్తి గల విద్యార్థులకు నిష్ణాతులైన గురువులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. ఐటీడీఏ 10 ఏళ్లుగా విలువిద్య క్రీడా వస్తువుల కొనుగోలుకు ఒక్క పైసా కూడా విదల్చలేదు. అయినా ఐటీడీఏ పీవో, డీడీ ఆధ్వర్యంలో ఆర్చరీ సామగ్రి కిట్లు రూ.10 లక్షలతో కొనుగోలు చేశారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఈ రూ.8,900 విలువైన కిట్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన ఆర్చరీ క్రీడాకారులతో పిల్లలకు శిక్షణ ఇప్పిస్తున్నారు. పలు చోట్ల వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా కొద్ది రోజుల పాటు శిక్షణలు ఇచ్చారు. ఈ శిక్షణ ఐటీడీఏ పీవో ఎస్.షన్మోçßæన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో శిక్షణ పొందిన విద్యార్థుల్లో నలుగురు గత ఏడాది రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైనట్టు డిప్యూటీ డైరెక్టర్ పి.మల్లికార్జునరెడ్డి తెలిపారు. సృజనాత్మకతను వెలికి తీయాలనే.. గిరిజన విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలనే ఉద్దేశంతో వివిధ క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నాం. కబడ్డీ, వాలీబాల్, కోకో వంటి క్రీడలతో పాటు విలువిద్యలోనూ శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే ఆరుగురు రాష్ట్రస్థాయిలో వారి ప్రతిభను చాటారు. విద్యార్థులు జాతీయస్థాయిలో కూడా రాణించాలన్నదే మా ఆశ.– పి.మల్లికార్జున రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్, కేఆర్‌పురం ఐటీడీఏ -
గిరిజన విద్యార్థిని మృతి
సీతంపేట : స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న సవర శిరీషా(11) అనే గిరిజన విద్యార్థిని మంగళవారం అనారోగ్యంతో బాధపడుతూ స్వగ్రామమైన బుడ్డడుగూడలో మృతి చెందింది. మృతిరాలి తల్లి, తమ్ముడుకు బాగోలేదని తండ్రి సురేష్ పాఠశాలకు వచ్చి ఈ నెల 19న విద్యార్థిని ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ విద్యార్థినికి ఒంట్లో బాగోలేదని, పచ్చకామెర్లు వచ్చాయని చెప్పి నాటు మందులు వాడడంతో విద్యార్థిని మృతి చెందినట్టు హెచ్ఎం కె.సుబ్బారావు, మేట్రిన్ పి.అమల తెలిపారు. బాలిక మృతి విషయమై ఐటీడీఏకు సమాచారమిచ్చారు. వెంటనే ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకటరావు, గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎంపీవీ నాయిక్, హెచ్ఎం,మేట్రిన్లు గ్రామానికి వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.5 వేలు అందజేశారు. -
గొంతు కోసుకున్న 'ఆశ్రమ' విద్యార్థిని..!
మందస(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా బుడబంబో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని యలమంచలి తేజ (14) సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం సోంపేట మండలం కర్తలపాలెం గ్రామానికి చెందిన తేజ అనే బాలిక ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం హాస్టల్లోని తన గదిలో తేజ బ్లేడ్‌తో గొంతు, చేతిపై గాయాలు చేసుకుంది. అపస్మారక స్థితిలో పడి ఉన్న తేజను తోటి విద్యార్థినులు చూసి.. ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వెంటనే వారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాలిక పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. తేజ తల్లి ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుందని, అప్పటినుంచి తేజ అన్యమనస్కంగా ఉంటోందని సహచర బాలికలు చెబుతున్నారు.