breaking news
Transfer Employee
-
ఎక్కడి వారు అక్కడికే!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఎన్నికల నేపథ్యంలో వేరే జిల్లాలకు బదిలీ అయిన మన జిల్లా తహసీల్దార్లు త్వరలోనే ఇక్కడకు రానున్నారు. అలాగే, జిల్లాకు వచ్చిన తహసీల్దార్లు వారి వారి సొంత జిల్లాలకు వెళ్లనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు తర్వాత వారు జిల్లాకు బదిలీ కానున్నారు. ఎనిమిది నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లా నుంచి 18 మంది తహసీల్దార్లను వేరే జిల్లాలకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు అనంతరం సొంత జిల్లాలకు పంపేందుకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఏల్ఏ) కార్యాలయం కసరత్తు చేస్తోంది. ఇటు తెలంగాణ స్టేట్ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా సీసీఎల్ఏ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శిని కలిసి ఈ విషయంపై వినతిపత్రం అందజేశారు. దీంతో పాత జిల్లాలకు తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ వారం, పది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు జిల్లాలో మూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న తహసీల్దార్లకు స్థాన చలనం కలగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో అక్టోబర్ 16న సీసీఎల్ఏ అధికారులు జిల్లాలో 18 మందిని బదిలీ చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే వారు పాత స్థానాలకు రావాల్సి ఉండగా, అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వెలువడింది. దీంతో వారి రాక మరింత ఆలస్యమైంది. కుటుంబ సభ్యులకు దూరంగా... ఎనిమిది నెలలుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం, పని ఒత్తిడితో చాలా తహసీల్దార్లు అనారోగ్యాలకు గురయ్యారు. వారి పిల్లల చదువులపై కూడా ప్రభావం చూపాయి. అయితే, ప్రస్తుతం అన్ని ఎన్నికలు ముగిసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు మాత్రమే ఉంది. ఈ ఓట్ల లెక్కింపు ఈ నెల 27న జరగా>ల్సి ఉండగా, ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. జూన్ మొదటి వారంలో ఓట్ల లెక్కింపు జరిగే అవకాశాలున్నాయి. దీంతో ఎన్నికల కోడ్ పూర్తిగా తొలగి పోనుంది. కోడ్ ఎత్తివేసిన అనంతరమే తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని సీసీఎల్ఏ భావిస్తోంది. బదిలీపై వెళ్లింది వీరే... జిల్లా నుంచి వేరే జిల్లాలకు బదిలీపై వెళ్లిన వారు మొత్తం 18 మంది తహసీల్దార్లు ఉన్నారు. వీరిలో ఆర్మూర్ మండలానికి చెందిన రాజేందర్, భీమ్‌గల్ భావయ్య, కమ్మర్పల్లి అర్చన, బాల్కొండ ప్రవీణ్‌కుమార్, మెండోరా జయంత్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ సుదర్శన్, సిరికొండ వీర్‌సింగ్, ధర్పల్లి రమేశ్, జక్రాన్‌పల్లి సతీశ్‌రెడ్డి, బోధన్ గంగాధర్, రెంజల్ రేణుక చవాన్, ఎడపల్లి లత, నవీపేట్ అనిల్‌కుమార్, వర్ని హరిబాబు, నస్రుల్లాబాద్ సంజయ్రావు, ఏర్గట్ల ముంతాజొద్దీన్, ముప్కాల్ విజయ్‌కుమార్, డిచ్పల్లి మండలం నుంచి శేఖర్ బదిలీపై వెళ్లారు. అయితే నిజామాబాద్ జిల్లా నుంచి బదిలైన వెళ్లిన వీరు కామారెడ్డితో పాటుగా మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో పని చేస్తున్నారు. అయితే, త్వరలో పాత జిల్లాకే రానున్న సందర్భంగా పలువురు తహసీల్దార్లు పాత మండలాల్లో కాకుండా తమకు అనుకూలంగా ఉన్న మండలాలకు బదిలీ అయ్యేలా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఇక్కడి వారు అక్కడకు.. మన జిల్లా నుంచి 18 మంది తహసీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేసిన సమయంలోనే హైదరాబాద్, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, ఇతర జిల్లాలకు చెందిన మొత్తం 20 మంది తహసీల్దార్లను మన జిల్లాకు కేటాయించారు. అయితే, సొంత జిల్లాలకు తహసీల్దార్లను పంనున్న సందర్భంగా మన జిల్లాకు వచ్చిన 20 మందిని వారి వారి పాత జిల్లాలకు పంపనున్నారు. -
ఇవ్వాల్సింది.. ఇచ్చేయండి...!
‘సార్! నేను... ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. సార్‌కు బదిలీ అవుతుందంటున్నారు. మీరు మాకు కారు పెట్టారు కదా! దానికి సంబంధించిన నాలుగు నెలల బిల్లు.. సార్ పెట్టేశారట! మీకు తరువాత అవుతాయంటున్నారు. దీనికి సంబంధించి సార్‌కు ఇవ్వాల్సిన పర్సంటే జీ ఇచ్చేస్తే బాగుంటుంది కదా! సార్‌కు బదిలీ అయిపోతే వచ్చే వారెవరో తీసుకుంటారు.. కానీ ఈయనకు అందదుగా! అందుకే మంగళవారం వచ్చి మిమ్మల్ని కలవమన్నారు. లేకుంటే నన్ను ఎక్కడికైనా రమ్మంటే వస్తాను... ఏమంటారు? సరేనా?’ అని ఒక కార్యాలయంలో కింది స్థాయి ఉద్యోగి నుంచి ఒక వ్యక్తికి వెళ్లిన ఫోన్ సమాచారం ఇది. జిల్లాలో ప్రస్తుతం పలు ప్రభుత్వ కార్యాలయూల కింది స్థాయి సిబ్బంది నుంచి వేర్వేరు వ్యక్తులకు వెళ్తున్న ఫోన్ల సమాచారం తంతు ఇది! వివరాల్లోకి వెళ్తే... విజయనగరం కంటోన్మెంట్ : ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలైన నేపథ్యంలో జిల్లాలో బదిలీలు తప్పవన్న అధికారుల్లో చాలా మంది పై విధంగా తమకు వివిధ పద్దుల కింద అందాల్సిన పర్సంటేజీల్లో ముందుగానే తమ వాటాలను తీసేసుకునేందుకు కింది స్థాయి సిబ్బందితో ఫోన్లు చేయిస్తున్నారు. ఈ విషయూన్ని జిల్లాలోని ఆయా పద్దులను చెల్లించే వారే చెబుతున్నారు. ముఖ్యంగా వివిధ బిల్లులను పెట్టేందుకు సంతకాలు చేయాలంటే నెలల తరబడి పెండింగ్ పెట్టే వారు కూడా బదిలీల జీఓ వచ్చేసరికి అప్రమత్తమయ్యూరు. ఎన్ని నెలల బిల్లులు పెండింగ్ ఉంది? ఎప్పటిలోగా చేయాలి? అన్న అంశాలను బేరీజు వేసుకుని వాటికి వెంటనే బిల్లు పెట్టేస్తున్నారంట! బిల్లులు చెల్లించేందుకు కొన్ని శాఖల్లో మాత్రమే ఇప్పుడు ఆన్లైన్ విధానం అందుబాటులో ఉంది. కొన్నింటికి ఇంకా పాత పద్ధతిలోనే చెక్కులు అందిస్తున్నారు. చెక్కులను కూడా కొంత మంది సిబ్బంది తమ వద్ద ఉంచుకుని రావాల్సిన పర్సంటేజీలను తమకు అందేలా దిగువ స్థాయి సిబ్బందితో చేయించుకుంటున్నారు. కొన్ని ఆన్లైన్ ఖాతాలైతే వారి వద్ద నుంచి ముందుగానే ఒప్పందాలు చేసుకుని నగదును అందుకున్న తరువాత వారికి బిల్లు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. పర్సంటేజీలో వాటా తగ్గించమంటే మాత్రం ససేమిరా అంటున్నారని ఒక కారు యజమాని పేర్కొన్నారు. జిల్లాలో బదిలీలకు మార్గదర్శకాలు విడుదలైన నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. పలు శాఖ ల్లో అధికారులు, ఇతర ఉద్యోగులు తమ వాటాలు తమకు దక్కాల్సిందేనంటున్నారనీ, ఇదేం బదిలీల గోలని కొందరు కింది స్థాయి ఉద్యోగు లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అధికారులు తనకు బదిలీ తప్పదని తెలిసిన తరువాత వేగంగా పర్సంటేజీల పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న పలు శాఖల అధికారులు, సిబ్బందికి కాసులే కాసులని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే నచ్చిన చోటుకు బదిలీ చేయించుకునేందుకు అయ్యే ఖర్చును ఈ పర్సంటేజీల ద్వారానే పొందాలని కొందరు అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో సాధారణంగా ఇచ్చే పర్సంటేజీల కంటే ఎక్కువ మొత్తం పొందాలని ఆశిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు జరిగేందుకు అవకాశం వస్తే ఎటువంటి ఖర్చు ఉండదు. అలా కాకుండా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం బదిలీలు చేస్తే కోరుకున్న ప్రదేశం కావాలంటే ఎక్కువ మొత్తంలోనే ఖర్చు చేయూల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పర్సంటేజీలు ముందుగానే వసూలు చేసుకుంటే కొంత ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారని సమాచారం.