breaking news
Tragedy King
-
‘ట్రాజెడీ కింగ్’ కన్నుమూత
ముంబై: విలక్షణ నటనతో భారతీయ సినీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్‌కుమార్ (98) తుది శ్వాస విడిచారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూసిన ఆయన.. అశేష అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచారు. పాత్రోచిత సహజ నటనకు, తనకే ప్రత్యేకమైన డైలాగ్ డిక్షన్ తోడై సినీ రంగంలో కొన్ని దశాబ్దాల పాటు యూసుఫ్ ఖాన్ అలియాస్ దిలీప్‌కుమార్ స్టార్‌గా వెలుగొందారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో కోవిడ్ ప్రొటోకాల్ నేపథ్యంలో కొద్దిమంది సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య, అధికారిక లాంఛనాలతో, శాంతాక్రుజ్‌లోని శ్మశానవాటికలో దిలీప్‌కుమార్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహంపై త్రివర్ణ పతాకం కప్పి, గన్ సెల్యూట్‌తో తుది వీడ్కోలు పలికారు. నాటి ప్రముఖ నటి సైరా బాను దిలీప్‌కుమార్ భార్య. దిలీప్‌కుమార్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ ‘నిషాన్ ఇ ఇంతియాజ్’కు ఘనంగా నివాళులర్పించారు. మొఘల్ ఇ ఆజమ్, దేవదాస్ వంటి క్లాసిక్ సినిమాలతో ‘ట్రాజెడీ కింగ్’గా, అత్యంత సహజంగా పాత్రలో ఒదిగిపోయే నట కౌశలంతో ‘మెథడ్ యాక్టర్’గా దిలీప్ కుమార్ ఖ్యాతిగాంచారు. బాలీవుడ్ నట శిఖరాలు రాజ్‌కపూర్, దేవానంద్‌లతో కలసి త్రిమూర్తుల్లో ఒకరిగా పేరుగాంచారు. వృద్ధాప్య సమస్యలతో గత మంగళవారం నుంచి దిలీప్ కుమార్ ముంబై ఉన్న హిందూజా ఆసుపత్రిలోని నాన్‌కోవిడ్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం 7.30 గంటలకు దిలీప్‌కుమార్ కన్నుమూశారని ఆయనకు వైద్యం అందించిన డాక్టర్ జలీల్ పార్కర్ ప్రకటించారు. ఆ తర్వాత దిలీప్‌కుమార్ సన్నిహితుడు ఫైజల్ ఫారూఖీ ఇదే విషయాన్ని ట్విటర్లో వెల్లడించారు. ఆసుపత్రి నుంచి దిలీప్ కుమార్ మృతదేహాన్ని పాలిహిల్‌లోని ఆయన స్వగృహానికి తీసుకువెళ్లారు. అక్కడ కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులు, సహచర నటులు ఆయనకు కన్నీటి నివాళులర్పించారు. వారిలో నటులు ధర్మేంద్ర, షబనా ఆజ్మీ, షారూఖ్ ఖాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తదితరులు ఉన్నారు. ‘చాలా బాధగా ఉంది. నా సోదరుడిని కోల్పోయాను’అని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘గొప్ప నట కౌశలం ఆయన సొంతం. తరాలకతీతంగా తనను ప్రేక్షకులు అభిమానించారు. సినీ దిగ్గజంగా ఆయన గుర్తుండిపోతారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం పెద్ద లోటు. ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, అశేష అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’అని ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. భారతీయ సినీ రంగానికి దిలీప్ కుమార్ చేసిన అసాధారణ సేవలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘భారతీయ సినీ చరిత్రను ఎప్పుడు రాసినా.. అది దిలీప్ కుమార్ ముందు.. దిలీప్‌కుమార్ తరువాతగానే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులు ఈ లోటును తట్టుకోనే శక్తి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని అమితాబ్ బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. దిలీప్ కుమార్ అంత్యక్రియలు జరిగిన తర్వాత అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ శాంతాక్రుజ్ శ్మశానవాటికకు వెళ్లి నివాళులర్పించారు. యూసుఫ్ భాయి చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకు సైరా బాను అన్నీ తానై సేవలు చేసిందని ప్రఖ్యాత గాయని లత మంగేష్కర్ పేర్కొన్నారు. ‘మా హీరోలకు దిలీప్‌కుమారే హీరో’అని నటుడు అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. తమ దేశంలో జన్మించిన దిలీప్ సాబ్‌కు పాకిస్తాన్ నాయకులు, ప్రజలు ఘన నివాళులర్పించారు. పాక్ ప్రభుత్వం గతంలో ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్ ఏ ఇంతియాజ్’ను కూడా బహూకరించింది. దిలీప్ కుమార్ అద్భుతమైన నటుడు, గొప్ప వ్యక్తి అని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ప్రశంసించారు. ‘దిలీప్ సాబ్ మృతి వార్త కలచివేసింది. ఆయన గొప్ప విలక్షణ నటుడు. ఎస్కేఎంటీహెచ్కు నిధులను సమీకరించడంలో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన విలువైన సమయం కేటాయించి, నిధుల సమీకరణకు ఎంతో తోడ్పడ్డారు’అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన తల్లి పేరుతో ఆసుపత్రిని నిర్మించిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. పాకిస్తాన్లో జననం 1922 డిసెంబర్ 11న నేటి పాకిస్తాన్లో ఉన్న పెషావర్‌లో యూసుఫ్ ఖాన్‌గా దిలీప్‌కుమార్ జన్మించారు. దిలీప్ కుమార్ తండ్రి లాలా గులామ్ సర్వర్ పండ్ల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత వారి కుటుంబం బొంబాయికి తరలివచ్చింది. పండ్ల వ్యాపారంలో తండ్రికి సహకరిస్తున్న యూసుఫ్ ఖాన్‌ను నాటి ప్రముఖ నటి దేవికా రాణి సినీ రంగానికి పరిచయం చేశారు. అప్పుడే ఆయన పేరును దిలీప్ కుమార్‌గా మార్చారు. 1944లో వచ్చిన ‘జ్వార్ భాటా’తో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది. 1988లో వచ్చిన ‘ఖిలా’ఆయన చివరి సినిమా. సామాజిక సేవా కార్యక్రమాల్లో, వరదలు, భూకంపం వంటి ప్రకృతి విపత్తుల సమయంలో సాయం అందించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. ఆరిఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ ‘నిషాన్ ఏ ఇంతియాజ్’కు ఘనంగా నివాళులర్పించారు. మొఘల్ ఇ ఆజమ్, దేవదాస్ వంటి క్లాసిక్ సినిమాలతో ‘ట్రాజెడీ కింగ్’గా, అత్యంత సహజంగా పాత్రలో ఒదిగిపోయే నట కౌశలంతో ‘మెథడ్ యాక్టర్’గా దిలీప్‌కుమార్ ఖ్యాతిగాంచారు. బాలీవుడ్ నట శిఖరాలు రాజ్‌కపూర్, దేవానంద్‌లతో కలసి త్రిమూర్తుల్లో ఒకరిగా పేరుగాంచారు. వృద్ధాప్య సమస్యలతో గత మంగళవారం నుంచి దిలీప్‌కుమార్ ముంబైలో ఉన్న హిందూజా ఆసుపత్రిలోని నాన్‌కోవిడ్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం 7.30 గంటలకు దిలీప్‌కుమార్ కన్నుమూశారని ఆయనకు వైద్యం అందించిన డాక్టర్ జలీల్ పార్కర్ ప్రకటించారు. ఆ తర్వాత దిలీప్‌కుమార్ సన్నిహితుడు ఫైజల్ ఫారూఖీ ఇదే విషయాన్ని ట్విటర్లో వెల్లడించారు. ఆసుపత్రి నుంచి దిలీప్ కుమార్ మృతదేహాన్ని పాలిహిల్‌లోని ఆయన స్వగృహానికి తీసుకువెళ్లారు. అక్కడ కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులు, సహచర నటులు ఆయనకు కన్నీటి నివాళులర్పించారు. వారిలో నటులు ధర్మేంద్ర, షబానా ఆజ్మీ, షారూక్ ఖాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తదితరులు ఉన్నారు. ‘చాలా బాధగా ఉంది. నా సోదరుడిని కోల్పోయాను’అని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘గొప్ప నట కౌశలం ఆయన సొంతం. తరాలకతీతంగా తనను ప్రేక్షకులు అభిమానించారు. సినీ దిగ్గజంగా ఆయన గుర్తుండిపోతారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం పెద్ద లోటు. ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, అశేష అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’అని ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. భారతీయ సినీ రంగానికి దిలీప్ కుమార్ చేసిన అసాధారణ సేవలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘భారతీయ సినీ చరిత్రను ఎప్పుడు రాసినా.. అది దిలీప్ కుమార్ ముందు.. దిలీప్‌కుమార్ తరువాతగానే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులు ఈ లోటును తట్టుకోనే శక్తి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని అమితాబ్ బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. దిలీప్ కుమార్ అంత్యక్రియలు జరిగిన తర్వాత అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ శాంతాక్రుజ్ శ్మశానవాటికకు వెళ్లి నివాళులర్పించారు. యూసుఫ్ భాయి చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకు సైరా బాను అన్నీ తానై సేవలు చేసిందని ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేర్కొన్నారు. ‘మా హీరోలకు దిలీప్‌కుమారే హీరో’అని నటుడు అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. తమ దేశంలో జన్మించిన దిలీప్ సాబ్‌కు పాకిస్తాన్ నాయకులు, ప్రజలు ఘన నివాళులర్పించారు. పాక్ ప్రభుత్వం గతంలో ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్ ఏ ఇంతియాజ్’ను కూడా బహూకరించింది. దిలీప్‌కుమార్ అద్భుతమైన నటుడు, గొప్ప వ్యక్తి అని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ప్రశంసించారు. ‘దిలీప్ సాబ్ మృతి వార్త కలచివేసింది. ఆయన గొప్ప విలక్షణ నటుడు. ఎస్కేఎంటీహెచ్కు నిధులను సమీకరించడంలో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన విలువైన సమయం కేటాయించి, నిధుల సమీకరణకు ఎంతో తోడ్పడ్డారు’అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన తల్లి పేరుతో ఆసుపత్రిని నిర్మిం చిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. పాకిస్తాన్లో జననం 1922 డిసెంబర్ 11న నేటి పాకిస్తాన్లో ఉన్న పెషావర్‌లో యూసుఫ్ ఖాన్‌గా దిలీప్‌కుమార్ జన్మించారు. దిలీప్‌కుమార్ తండ్రి లాలా గులామ్ సర్వర్ పండ్ల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత వారి కుటుంబం బొంబాయికి తరలివచ్చింది. పండ్ల వ్యాపారంలో తండ్రికి సహకరిస్తున్న యూసుఫ్ ఖాన్‌ను నాటి ప్రముఖ నటి దేవికా రాణి సినీ రంగానికి పరిచయం చేశారు. అప్పుడే ఆయన పేరును దిలీప్ కుమార్‌గా మార్చా రు. 1944లో వచ్చిన ‘జ్వార్ భాటా’తో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది. 1988లో వచ్చిన ‘ఖిలా’ చివరి సినిమా. సామాజిక సేవా కార్యక్రమాల్లో, వరదలు, భూకంపం వంటి ప్రకృతి విపత్తుల సమ యంలో సాయం అందించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సంతాపం దిలీప్ కుమార్ మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తంచేశారు. నటుడిగా దశాబ్దాల పాటు భారతీయ చలనచిత్ర రంగానికి దిలీప్‌కుమార్ చేసిన సుదీర్ఘ సేవను ఆయన గుర్తు చేసుకున్నారు. దిలీప్ మరణం దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, దిలీప్‌కుమార్ మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దిలీప్‌కుమార్ ప్రత్యేక స్థానం సంపాదించారని, ఆయన పాత్రను మరువలేమని కొనియాడారు. పలు చిత్రాల్లో ఆయన నటన అద్వితీయం అని పేర్కొన్నారు న్నాళ్లుగా దిలీప్‌కుమార్ ఆరోగ్యం బాగుండలేదు. తుది దశకు చేరిన ప్రొస్టేట్ కేన్సర్, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉండేవారు. పలుమార్లు ఆసుపత్రిలో చేరి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. చివరి రోజుల్లో ఎవరినీ గుర్తించలేని స్థితికి చేరుకున్నారు. కొన్నాళ్లుగా దిలీప్‌కుమార్ ఆరోగ్యం బాగుండలేదు. తుది దశకు చేరిన ప్రొస్టేట్ కేన్సర్, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉండేవారు. పలుమార్లు ఆసుపత్రిలో చేరి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. చివరి రోజుల్లో ఎవరినీ గుర్తించలేని స్థితికి చేరుకున్నారు. -
దిలీప్ కుమార్‌కు సీరియస్ ఆస్పత్రిలో చేరిక
-
దిలీప్‌కుమార్‌కు సీరియస్.. ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ (93) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. కుడి కాలు వాపు రావడం, బాగా జ్వరం కూడా రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇంతకుముందు కూడా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. కానీ ఆయన భార్య, అలనాటి ప్రముఖ హీరోయిన్ సైరా బాను వాటిని ఖండించారు. అప్పట్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన దిలీప్‌కుమార్ 1922 లో ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. ఆయన అసలుపేరు యూసుఫ్‌ఖాన్. ఆయన తండ్రి లాలా గులామ్ సర్వార్ పండ్ల వ్యాపారి. తండ్రితో పడకపోవపడంతో.. ఇంటినుంచి వచ్చేసి పుణేకు చేరుకున్న దిలీప్ కుమర్.. అక్కడ ఆర్మీ క్లబ్ వద్ద కొంత కాలం సాండ్విచ్ స్టాల్‌ను నిర్వహిచారు. అనంతరం బాంబేకు చేరుకున్న ఆయన.. 'బాంబే టాకీస్' ఓనర్ దేవికా రాణి సలహా మేరకు తన పేరును యూసుఫ్ ఖాన్ నుంచి దిలిప్ కుమార్‌గా మార్చుకొని జ్వర్ భట(1944) చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి సుమారు ఆరు దశాబ్దాల పాటు 60 చిత్రాల్లో తన నటనతో అభిమానులను అలరించారు. ఆయనకు ట్రాజెడీ కింగ్‌గా పేరుంది. చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే, 2015లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి. -
దిలీప్ కుమార్ మృతి
బాలీవుడ్ ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ అభిమానులను శోకంలో ముంచి వెళ్లిపోయారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1944లో బాంబే టాకీస్ నిర్మాణ సంస్థలో వచ్చిన జ్వర్ భట చిత్రం ద్వారా బాలీవుడ్ తెరకు పరిచయమైన దిలీప్ కుమార్ సుమారు ఆరు దశాబ్దాల పాటు 60 చిత్రాల్లో తన నటనతో అభిమానులను అలరించారు. 1922 లో ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించిన దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. ఆయన తండ్రి లాలా గులామ్ సర్వార్ పండ్ల వ్యాపారి. తండ్రితో పొసగకపోవటంతో ఇంటి నుంచి వచ్చేసి పూణేకు చేరుకున్న దిలీప్ కుమర్.. అక్కడ ఆర్మీ క్లబ్ వద్ద కొంత కాలం సాండ్విచ్ స్టాల్‌ను నిర్వహిచారు. అనంతరం బాంబేకు చేరుకున్న ఆయన.. 'బాంబే టాకీస్' ఓనర్ దేవికా రాణి సలహా మేరకు తన పేరును యూసుఫ్ ఖాన్ నుంచి దిలిప్ కుమార్‌గా మార్చుకొని జ్వర్ భట(1944) చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. అయితే తొలిచిత్రం దిలిప్ కుమార్‌కు అంతగా గుర్తింపు తీసుకురాకపోయినప్పటికీ అనంతరం నటించిన జుగ్ను(1947) బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి దిలీప్ కుమార్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం షహీద్, మెహబూబ్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్(1949) చిత్రాలతో దిలిప్ కుమార్‌కు ఇండస్ట్రీలో తిరుగులేకుండా పోయింది. అదే ఏడాది రిలీజైన షబ్నం చిత్రం కూడా భారీ హిట్ సాధించడం విశేషం. ఇక 1950 దశకంలో దిలీప్ కుమార్ నటించిన చిత్రాలు.. జోగన్, తరాణా, హల్చల్, దీదర్, దాగ్, దేవ్‌దాస్, యహుది, మధుమతి ఆయనకు ట్రాజెడీ కింగ్ ఇమేజ్ను కట్టబెట్టాయి. దాగ్(1952) చిత్రానికి గాను మొట్టమొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును దిలిప్ కుమార్ పొందారు. ఫుట్‌పాత్, నయా దౌర్, ముసాఫిర్, పైఘం లాంటి పలు సామాజిక నాటక చిత్రాలలో సైతం నటించి దిలీప్ కుమార్ మెప్పించారు. కోహినూర్, మొఘల్ ఏ ఆజమ్ చిత్రాలు దిలిప్ కుమార్‌కు మంచి విజయాన్నిచ్చాయి. గంగా జమునా చిత్రానికి దిలీప్ కుమార్ నిర్మాతగా కూడా వ్యవహరిచారు. దిలీప్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన ఏకైక చిత్రం గంగా జమునానే కావడం విశేషం. దిలిప్ కుమార్ తన కన్నా వయసులో 22 సంవత్సరాలు చిన్నవారైన నటీమణి సైరాభానును 1966లో వివాహమాడారు. అనంతరం 1980లో దిలిప్ కుమార్ సంతానం కోసమని ఆస్మాను వివాహం చేసుకున్నప్పటికీ అది ఎక్కువకాలం నిలువలేదు. 1970 దశకంలో దిలిప్ కుమార్ కెరీర్ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయింది. ఈ కాలంలో ఆయన నటించిన దస్తాన్(1972), బైరాగ్(1976) చిత్రాలు విజయం సాధించలేదు. దిలీప్ కుమార్ అవకాశాలను ఎక్కువగా రాజేష్ ఖన్నా, సంజీవ్ కుమార్‌లు దక్కించుకున్నారన్న వాదన సైతం ఉంది. 1976 నుంచి 1981 వరకు దిలీప్ కుమార్ సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. అనంతరం అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన 'శక్తి' చిత్రానికి గాను దిలీప్ కుమార్ మరోసారి బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. అత్యధికంగా ఎనిమిది సార్లు బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును దిలీప్ కుమార్ పొందారు. ఆయనతో సమానంగా షారుక్ ఖాన్ సైతం 8 ఫిల్మ్ఫేర్లు పొందారు. అత్యధిక అవార్డులు పొందిన నటుడిగా దిలీప్ కుమార్ గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కారు. చిత్రరంగంలో ఆయన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మ భూషణ్(1991), పద్మ విభూషణ్(2015) అవార్డులతో సత్కరించింది. 1994లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు దిలీప్ కుమార్‌ను వరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1997లో ఎన్టీఆర్ జాతీయ అవార్డుతో ఆయనను సత్కరించింది. దిలిప్ కుమార్ మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. భారత చలనచిత్ర రంగంలో దిలీప్ కుమార్ చేసిన సేవలు మరువలేనివని, ఆయన మరణం తీరని లోటని అన్నారు. భారత్‌లోనే కాదు పాకిస్థాన్‌లో సైతం దిలీప్ కుమార్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. -
బాలీవుడ్ 'ట్రాజెడీ కింగ్' బర్త్ డే
రొమాంటిక్, కామిక్, హిస్టారిక్, సోషల్, ట్రాజెడీ ఇలా పాత్ర ఏదైన తనదైన హావభావాలతో రక్తి కట్టించే బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్. దేవదాస్, మొగళ్ ఈ అజం, అందాజ్ లాంటి సినిమాలతో భారతీయ సినీ అభిమానుల మనసుల్లో నిలిచిపోయిన ఈ గ్రేట్ యాక్టర్ ఈ రోజు (శుక్రవారం) తన 93వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సౌత్ సినిమాతో కూడా విడదీయలేని అనుబందం ఉన్న ఆయన, చెన్నైలో సంభవించిన ప్రకృతి బీభత్సం కారణంగా ఈ సారి తన పుట్టినరోజు వేడకలకు దూరంగా ఉన్నారు. దిలీప్ కుమార్ 1922 డిసెంబర్ 11న ప్రస్తుత పాకిస్థాన్ లోని పెషావర్ లో జన్మించారు. చిన్ననాటి నుంచే నటన పట్ల ఆకర్షితులైన ఆయన 1944లో రిలీజ్ అయిన 'జ్వార్ భట' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే ఆ పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. 1949లో రిలీజ్ అయిన అందాజ్ దిలీప్ కుమార్‌కు స్టార్ స్టేటస్ తీసుకువచ్చింది. ఆ తరువాత వరుసగా ఆన్, దేవదాస్, ఆజాద్, మొగళ్ ఈ అజం, గంగా జయున సినిమాలతో బాలీవుడ్ టాప్ స్టార్‌గా ఎదిగారు. దాదాపు 60 ఏళ్ల పాటు బాలీవుడ్ వెండితెరను ఏళిన ఈ గ్రేట్ యాక్టర్ 1976లో ఐదేళ్ల పాటు నటనకు విరామం ఇచ్చారు. 1981లో క్రాంతి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి తన మార్క్ చూపించారు. 1998లో విడుదలైన క్విలా దిలీప్ కుమార్ చివరి సినిమా ఆ తరువాత వయోభారం కారణంగా ఆయన నటనకు దూరంగా ఉంటున్నారు. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన్ను వరించాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలింఫేర్ అవార్డ్‌ను తొలిసారిగా అందుకున్న నటుడు దిలీప్ కుమార్. అంతేకాదు అత్యధికంగా ఎనిమిది సార్లు ఈ అవార్డును అందుకున్న ఏకైక నటుడు ఆయన. భారత ప్రభుత్వం అందించే పద్మ భూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ లాంటి అవార్డులు సైతం ఆయన్ను వరించాయి. పాకిస్థాన్ లో జన్మించిన దిలీప్ కుమార్‌ను అక్కడి ప్రభుత్వం 'నిషాన్ ఈ ఇంతియాజ్' అవార్డ్‌తో గౌరవించింది. భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి కీర్తిని అందించిన లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు.