దిలీప్‌ కుమార్‌కు సీరియస్ ఆస్పత్రిలో చేరిక | Dilip kumar admitted to mumbai leelavathi hospital | Sakshi
Sakshi News home page

Dec 7 2016 10:14 AM | Updated on Mar 21 2024 6:42 PM

ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ (93) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. కుడి కాలు వాపు రావడం, బాగా జ్వరం కూడా రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇంతకుముందు కూడా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. కానీ ఆయన భార్య, అలనాటి ప్రముఖ హీరోయిన్ సైరా బాను వాటిని ఖండించారు. అప్పట్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement