breaking news
Traffic Rama Swamy
-
కోలీవుడ్‌లో బెంగాలీ బ్యూటీ ఉపాసన
తమిళసినిమా: ఇండియాలోని ఢిల్లీ, ముంబై, కేరళ, కన్నడం, తెలుగు, గుజరాతి, పంజాబి ఇలా పలు రాష్ట్రాల అందాలరాశుల దృష్టి అంతా కోలీవుడ్‌పైనే అన్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ భాషా భేషజాలకు పోకుండా ప్రతిభకు పట్టం కట్టడమే ఇందుకు కారణం అని చెప్పవచ్చు. అదేవిధంగా సినిమా తొలి రోజుల్లో నటీనటులను రంగస్థల నటనానుభవం సినిమాలకు దగ్గర చేసేది. ఈ ఆధునిక రంగంలో ట్రెండ్ మారింది. బుల్లితెర, అందాల పోటీలు, మోడలింగ్ రంగాలు వెండితెరకు వారధిగా మారుతున్నాయి. ముఖ్యంగా నటీమణులు అందాలపోటీల్లో కిరీటాలను గెలుచుకుని, మోడలింగ్ రంగంలో రాణిస్తూ సినీ కథానాయకిలుగా ప్రమోట్ అవుతున్నారు. అలా తాజాగా హీరోయిన్ చాన్స్ కొట్టేసిన బెంగాలీ బ్యూటీ ఉపాసన. ఆర్సీ.ఈ ముద్దుగుమ్మ ‘88’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయకిగా రంగప్రవేశం చేసింది. అయితే అంతకుంటే ముందే కన్నడ చిత్ర రంగప్రవేశం చేసింది. తమిళంలో ‘88’ చిత్రం కంటే ముందుగా ఉపాసన నటించిన మరో చిత్రం ట్రాఫిక్ రామస్వామి తెరపైకి రావడం విశేషం. అందుకే ఈ భామ నాకు ఎంట్రీ ఇచ్చింది ‘88’ చిత్రం అయితే గుర్తింపునిచ్చింది ట్రాఫిక్ రామస్వామి చిత్రం అని సంబరపడిపోతోంది. ఇంతకీ ఈ సుందరి పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం. అమ్మానాన్నల పుట్టిన ఊరు బెంగాల్. నేను పుట్టింది మాత్రం గుజరాత్లో. ఇప్పుడు ఉంటోంది తమిళనాడులో. ఇక ఇండియా మొత్తం ఒక రౌండ్ చుట్టిరావలన్నది నా ఆశ. నాన్న మెకానికల్ ఇంజినీర్.అమ్మ పాఠశాల ప్రధాన అధ్యాపకురాలగా విధులు నిర్వహించి ప్రస్తుతం నాకు తోడుగా ఉంటున్నారు. నాకు చిన్నతనం నుంచి నటన అంటే చాలా ఇష్టం. అందుకే భరతనాట్యం, క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. 2015లో ఆల్ ఇండియా స్థాయిలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా కిరీటాన్ని పొందాను. 80కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాను. విజయ్ టీవీలో ప్రసారం అయిన విల్లా టూ విలేజ్ కార్యక్రమం నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ కార్యక్రమం నాకు రియల్ ఫైటర్ అనే పట్టం ఇచ్చింది. అలా కన్నడ, తమిళ చిత్రాల్లో పరిచయం అయ్యాను. ట్రాఫిక్ రామస్వామి లాంటి మంచి కథా చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం నాకు చాలా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. మంచి కథానాయకిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. నటుడు సిద్ధార్థ్ అంటే చాలా ఇష్టం. నేను ఒక డాన్సర్‌ను కాబట్ట నటుడు విజయ్ డాన్స్ అంటే ఇంకా ఇష్టం. ప్రస్తుతం నటిస్తున్న కరుత్తుగళై పదివు సెయ్ చిత్రం నాకు మరింత గుర్తింపును తెచ్చి పెడుతుందనే నమ్మకం ఉంది. -
మద్దతివ్వండి
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థి జయలలితపై పోటీకి దిగుతున్న సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మద్దతు కూడగట్టే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. రోడ్లకు అడ్డంగా వెలిసిన బ్యానర్లు, ఫ్లెక్సీల తొలగింపు ద్వారా ప్రజల్లో పలుకుబడిని పెంచుకున్న ట్రాఫిక్ రామస్వామి ఆర్కేనగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా రంగంలో నాణ్యమైన నిర్మాణాలు ఎలాసాధ్యమని కిందిస్థాయి సిబ్బంది విమర్శిస్తున్నారు. ఉపేక్షిస్తే లాభం లేదని నిర్ణయించుకున్న సిబ్బంది సినిమా ఒరవడిని ఆశ్రయించారు. అవినీతిని విడనాడకుంటే పేర్లను బహిర్గతం చేస్తూ బ్యానర్లను పెడతామని ఠాగూర్ సినిమా తరహాలో హెచ్చరికలు జారీచేశారు. హెచ్చరించినట్లుగానే 30 మంది లంచావతారుల పేర్లతో నెలరోజుల క్రితం సచివాలయం ఎదురుగా బ్యానర్ పెట్టారు. అయితే పోలీసులు వెంటనే దానిని తొలగించారు. మరికొన్ని రోజుల తరువాత మరో బ్యానర్ పెట్టారు. అనేక పోస్టర్లు వెలిసాయి. మక్కల్ సైదిమయ్యం పేరుతో ఈ బ్యానర్ల వ్యవహారం క్రమేణా రాష్ట్రమంతా పాకడం లంచావతారులనేగాక సంబంధిత శాఖలను పర్యవేక్షిస్తున్న ఐఏఎస్ అధికారులను సైతం అప్రతిష్టపాలు చేసింది. కమిషనర్‌ను కలిసిన ఐఏఎస్ సంఘం: తమిళనాడు ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షులు డేవిదార్, కార్యదర్శి రాజారామన్ తదితరులు శుక్రవారం చెన్నై నగర పోలీస్ కమిషనర్ జార్జ్‌ను కలిసి విజ్ఞప్తి అందజేశారు. 12 మంది ఐఏఎస్ అధికారులను అవినీతి పరులుగా పేర్కొంటూ ఈనెల 14వ తేదీన నగరంలో అనేక ఫొటోలతో బ్యానర్లు, పోస్టర్లు వేశారని వారు చెప్పారు. అయితే అందులో పేర్కొన్న వివరాలు పూర్తిగా అవాస్తవాలని, ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతున్నారని వారు అన్నారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా అధికారులను రచ్చకీడుస్తున్న వారిపై కేసులు బనాయించి తగిన చర్య తీసుకోవాల్సిందిగా వారు కోరారు. ప్రభుత్వంలో కీలకబాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారులు నేరుగా కమిషనర్‌ను కలిసి వేడుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.