breaking news
Tourist buses
-
ఆ రాష్ట్రాల్లో వేధింపులు.. కేరళ బస్సులు బంద్
తిరువనంతపురం: ఇకపై కేరళ టూరిస్ట్ బస్సులు కర్ణాటక, తమిళనాడుకు వెళ్లవు. ఆ రెండు రాష్ట్రాలకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు కేరళ రాష్ట్ర కమిటీ లగ్జరీ బస్సు యజమానుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. దీని వెనుకగల కారణం ఏమిటి? ఆయా రాష్ట్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురువుతున్నాయా? అనే విషయంలోకి వెళితే..కేరళ నుండి తమిళనాడు, కర్ణాటకకు అంతర్రాష్ట్ర పర్యాటక బస్సు సర్వీసులను (నేడు)సోమవారం సాయంత్రం 6 గంటల నుండి నిలిపివేస్తున్నట్లు లగ్జరీ బస్సుల యజమానుల సంఘం, కేరళ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. పొరుగు రాష్ట్రాలు భారీ జరిమానాలు విధించడం, చట్టవిరుద్ధమైన రాష్ట్ర స్థాయి పన్నులు విధించడం, దీనికితోడు కేరళ ఆపరేటర్లకు చెందిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (ఏఐటీపీ) బస్సులను సీజ్ చేయడం తరచూ జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏజే రిజాస్ తెలిపారు.కేంద్ర ప్రభుత్వ మోటారు వాహనాల చట్టం కింద జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఏఐటీపీలు ఉన్నప్పటికీ, కేరళ నుండి వచ్చే పర్యాటక వాహనాలను తమిళనాడు, కర్ణాటకలో ఆపడం, జరిమానా విధించడం, నిర్బంధించడం జరుగుతున్నదని ప్రధాన కార్యదర్శి మనీష్ శశిధరన్ మీడియాకు తెలిపారు. ‘ఏడాదిగా తమిళనాడు అధికారులు కేరళలో రిజిస్టర్ అయిన వాహనాల నుండి ఇష్టారాజ్యంగా పన్ను వసూలు చేస్తున్నారు. ఫలితంగా ఆపరేటర్లకు, ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేరళ ప్రభుత్వం కూడా తమకు సహకరించడంలేదని అన్నారు.వాహనాలను స్వాధీనం చేసుకుంటున్న కారణంగా చాలా మంది ఆపరేటర్లు అంతర్రాష్ట్ర సేవలను నిర్వహించేందుకు వెనుకాడుతున్నారని తెలిపారు. ఈ సర్వీస్ సస్పెన్షన్ స్వచ్ఛంద నిరసన కాదని, వాహనాలు, డ్రైవర్లు, ప్రయాణికుల భద్రత కోసం తీసుకున్న చర్య అని అసోసియేషన్ తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు సమావేశం కావాలని అసోసియేషన్ అభ్యర్థించింది. అలాగే ఈ సమస్య పరిష్కారానికి అసోసియేషన్ కేరళ రవాణా మంత్రి కేబీ గణేష్ కుమార్‌కు కూడా ఒక లేఖ రాసింది.ఇది కూడా చదవండి: ‘శ్వాస చంపేస్తోంది’.. ఢిల్లీలో భారీ నిరసనలు -
వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతి
సాక్షి, అమరావతి: అన్ని జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల్లో వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతిస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. పర్యాటక ప్రాంతాలన్నిటినీ మళ్ళీ అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. టూరిజం హోటళ్లను కూడా తెరుస్తున్నామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సచివాలయం నుంచి మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుంచి అన్ని చోట్ల నుంచి బోట్లు తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. టూరిస్ట్ బస్సులను కూడా వారం రోజుల్లో సిద్ధం చేస్తామని తెలిపారు. త్వరలోనే జిమ్‌లను సైతం రాష్ట్రంలో ప్రారంభిస్తామన్నారు. టెంపుల్ టూరిజంను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. (రాష్ట్రంలో పెట్టుబడులపై అమెజాన్‌తో చర్చలు) 'ప్రసాద్' స్కీం ద్వారా సింహాచలం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే శ్రీశైలంలో 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. త్వరలోనే 4 క్రీడా వికాస కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. ప్రతిభ గల పేదల పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగా గతేడాది 3 కోట్లు పేద క్రీడాకారులకు అందించగా, ఈ ఏడాది మరో 3 కోట్లను కేటాయించారని తెలిపారు. పీవీ సింధు అకాడమీకి విశాఖపట్నంలో భూములు కేటాయిస్తామని అవంతి శ్రీనివాస్ తెలిపారు. (వైఎస్ జగన్ భిక్షతోనే మీరు ఎంపీ అయ్యారు..) -
ఏపీలో తెరుచుకోనున్న పర్యాటక ప్రాంతాలు
-
టూరిస్టు బస్సులకు నేషనల్ పర్మిట్!
- అమలుపై కేంద్ర ప్రభుత్వ యోచన - గుజరాత్‌లోని వడోదరలో నేడు కీలక సమావేశం సాక్షి, హైదరాబాద్: సరుకు రవాణా వాహనాల తరహాలో టూరిస్టు బస్సులకు కూడా నేషనల్ పర్మిట్ విధానాన్ని అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పన్ను చెల్లిస్తూ నడుస్తున్న బస్సులు.. కొత్త విధానంతో ఏదైనా ఓ రాష్ట్రంలో పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అక్కడ జారీ అయ్యే నేషనల్ పర్మిట్‌తో దేశంలో ఎక్కడికైనా వెళ్లి రావచ్చు. మధ్యలో మళ్లీ ఎక్కడా పన్ను చెల్లించాల్సిన పని ఉండదు. దీనికి సంబంధించి కొంతకాలంగా కసరత్తు చేస్తున్న కేంద్ర ఉపరితల రవాణా శాఖ నేడు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. మంగళవారం గుజరాత్‌లోని వడోదరలో జరిగే జాతీయ రవాణా అభివృద్ధి మండలి సమావేశంలో ప్రధాన ఎజెండాగా దీనిపై చర్చించనుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి పాల్గొననున్నారు. ఆర్టీసీలకు ఉరి.. అసలే దివాలా దిశలో ఉన్న ప్రభుత్వ రవాణా సంస్థలకు ఈ నిర్ణయం శరాఘాతం కాబోతోంది. చాలా రాష్ట్రాల్లో రవాణా సంస్థలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో కునారిల్లుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేని సంగతి తెలిసిందే. టూరిస్టు పర్మిట్లు పొంది అక్రమంగా స్టేజీ క్యారియర్లుగా తిరుగుతున్న బస్సుల వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతున్నా వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావటం లేదు. ఇప్పుడు కేంద్రం ఏకంగా టూరిస్టు బస్సులకు లారీల తరహాలో నేషనల్ పర్మిట్లు ఇస్తే ఆర్టీసీ మరింత సంక్షోభంలో పడిపోతోందని రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రైవేటుకు పండుగ.. ప్రమాదంలో భద్రత ఇప్పటికే ప్రైవేటు బస్సులు అక్రమంగా స్టేజీ క్యారియర్లుగా తిరుగుతూ ఆర్టీసీని దెబ్బకొడుతున్నాయి. బస్సుల్లో బెర్తులు వేసుకోవటానికి, పన్ను చెల్లించకుండా రాష్ట్రాల మధ్య తిరిగేందుకు నిబంధనలు అడ్డువస్తుండటంతో కొద్దోగొప్పో అవి తటపటాయిస్తున్నాయి. ఇప్పుడు నేషనల్ పర్మిట్ ఇచ్చి తలుపులు బార్లా తెరిస్తే వాటికి ఇక పట్టపగ్గాలు ఉండవు. ఏమాత్రం అనువుగా లేని డొక్కు బస్సులకు పర్మిట్లు పొంది దూరప్రాంతాలకు తిరిగి ప్రయాణికుల ప్రాణాలనూ పణంగా పెడతాయి. వాటిని పర్యవేక్షించటం రవాణా శాఖకు సాధ్యమయ్యే పనికాదు. కమీషన్లకు కక్కుర్తి పడి తనిఖీ లేకుండా వదిలేసే సిబ్బంది సంఖ్య ఆర్టీఏలో ఎక్కువగా ఉందన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. పైగా సిబ్బంది లేక తనిఖీలు కూడా సరిగా జరగటం లేదు. నిబంధనలను ఖాతరు చేయని బస్సులకు ప్రభుత్వమే స్వేచ్ఛ ఇస్తే ఇక అడ్డు అదుపు ఉండదు. ఫిట్నెస్ లేకున్నా రాష్ట్రాల మధ్య తిరిగితే ప్రమాదాల సంఖ్య ఎక్కువయ్యే వీలుంది. వడోదర బస్‌పోర్టును సందర్శించనున్న మహేందర్‌రెడ్డి జీఎస్టీ తర్వాత పెరిగిన పన్నుల ప్రభావం, జాతీయ స్థాయిలో లైసెన్సుల జారీ, ఆటోమే టెడ్ డ్రైవింగ్ ట్రాక్‌ల ఏర్పాటు తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. వడోదరలో అత్యాధునికంగా నిర్మించిన బస్‌పోర్టును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ సందర్శించనున్నారు. అదే తరహాలో తెలంగాణలో నిర్మించే అంశాన్ని పరిశీలించనున్నారు.


