Toli Parichayam
-
ఏం జరిగింది?
‘‘పెళ్లి అంటే ఇష్టంలేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి.. కొన్ని పరిస్థితుల వల్ల నాలుగు రోజులు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది అన్నది ఆసక్తికరం’’ అని దర్శకుడు ఎల్.రాధాకృష్ణ తెలిపారు. వెంకీ, లాస్య జంటగా ఎల్.రాధాకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ దీపక్ కృష్ణ నిర్మించిన చిత్రం ‘తొలి పరిచయం’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘యూత్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. పోలవరం పరిసరాల్లో షూటింగ్ జరిపాం. చిన్న చిత్రమైనా క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘ఫస్ట్ లుక్‌లాగే సినిమా కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అని వెంకీ చెప్పారు. సంగీత దర్శకుడు ఇంద్రగంటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శరవణ కుమార్ సి. -
వెంకీ, లాస్య జంటగా 'తొలి పరిచయం'
పియుకే ప్రొడక్షన్స్ పతాకంపై వెంకీ, లాస్య జంటగా ఎల్.రాధాకృష్ణను దర్శకుడుగా పరిచయం చేస్తూ దీపక్ కృష్ణ నిర్మిస్తున్న చిత్రం తొలి పరిచయం. సీనియర్ నటులు మురళీమోహన్, సుమన్, రాజీవ్ కనకాల, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత మల్కాపురం శివకుమార్ తొలి పరిచయం ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసి చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి అంటే ఇష్టం లేని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి నాలుగు రోజులపాటు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఆ తరుణంలో ఏం జరిగిందన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను పోలవరం పరిసర ప్రాంతాల్లో షూట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.