tiruparthi
-
Tirumala: తిరుమలలో మరో అపచారం
తిరుమల,సాక్షి: తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్‌తో భక్తులు షూట్ చేశారు. భక్తుల సమాచారంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్‌తో చిత్రీకరించిన మహారాష్ట్ర భక్తుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, పోలీసులకు అప్పగించారు.శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగుర వేయడంపై విచారణ చేపట్టారు. విచారణలో మహారాష్ట్ర భక్తుడు సుమారు 15 నిమిషాల పాటు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్లు తేలుస్తోంది. -
వైఎస్ జగన్ పాలనా విధానాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి
-
ఓటమి భయంతోనే చంద్రబాబు డ్రామాకు తేరతీశారు
-
తిరుపతిలో కిడ్నాప్ కలకలం
సాక్షి, తిరుపతి: చిన్నారి కిడ్నాప్ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. మూడేళ్ల చిన్నారిని శుక్రవారం రాత్రి కిడ్నాపర్లు ఎత్తుకెళ్ళారు. తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్‌ను గుర్తించి.. ఫొటోను సోషల్ మీడియాలో పెట్టారు. చిన్నారిని కిడ్నాపర్ చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వదిలివెళ్లాడు. స్థానికుల సహకారంతో పోలీసులు ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
‘వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయం’
సాక్షి, తిరుపతి: యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీకి వ్యతిరేకంగా బయటికి వచ్చి ఓ బలమైన నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదిగారని ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే సమూలమైన మార్పులు వస్తాయని, రాష్ట్రం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. తిరుపతి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డికి మద్దతు తెలుపుతూ.. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ వస్తే రౌడీయిజం పెరుగుతుందని చెప్పడం తప్పన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలని జొన్నవిత్తుల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ.. తెలుగు భాషా అభివృద్ధి చెందాలంటే భూమన తప్పకుండా గెలవాలన్నారు. బలమైన నాయకుడికి మద్దతు తెలపడానికే తిరుపతి వచ్చినట్టు తెలిపారు. భాష విషయంలో రాష్ట్రం బలహీనపడిపోయిందని, తెలుగుదేశం కాస్తా.. తెలుగులేశంగా మారిందని చెప్పారు. టీడీపీ పాలనలో ఇసుక, మట్టి మాఫీయా సృతిమించిపోయాయని, వైఎస్సార్ సీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తనలాంటి రచయితలకు, భక్తులకు మంచి నాయకుడి కావాలని, అది వైఎస్ జగన్‌తోనే సాధ్యమని జొన్నవిత్తుల స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగాప్రతి రాష్ట్రంలో వారి సొంత భాషను అభివృద్ధి చేసుకుంటుంటే ఏపీలో మాత్రం అశ్రద్ధ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయ పుష్కరిణిలో చేపల పెంపకం జరడం దారుణమన్నారు. -
మంత్రి అయ్యన్నపాత్రుడికి అస్వస్థత
తిరుపతి: ఏపీమంత్రి అయ్యన్నపాత్రుడు అస్వస్థతకు గురయ్యారు. తన మనవడి పుట్టెంట్రుకలు తీసే కార్యక్రమానికి ఆయన కుటుంబసభ్యులతో తిరుపతి వచ్చారు. గురువారం ఉదయం ఆయన శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. దీంతో మంత్రిని కుటుంబసభ్యులు హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం మంత్రి ఆస్పత్రిలో కోలుకుంటున్నారని సన్నిహితులు తెలిపారు.