breaking news
Tiredness officers
-
ఇక ఆఫీస్‌లో నిద్ర పోలేరు...
టోక్యో : తిన్న తర్వాత కాసేపు ఓ కునుకు తీయాలనిపించడం సహజం. కానీ ఆఫీస్‌లో కూడా ఇలా కునుకు తీయాలనిపిస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కారణం ఆఫీస్‌లో నిద్రపోతే ఊరుకోరు.. మరో విషయం ఏంటంటే అలా నిద్ర వస్తున్న భావన ఉన్నప్పుడు చేసే పని మీద సరిగ్గా దృష్టి కేంద్రికరించలేము. ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ సమస్య ఎక్కడైనా సాధారణమే. శ్రమ జీవులుగా పేరు తెచ్చుకొన్న జపాన్ వాసులను ఈ నిద్ర సమస్య మరింత వేధిస్తోందంట. దాంతో ఉద్యోగులను మెలకువగా ఉంచడం ఎలా అంటూ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు ఆ దేశ శాస్త్రవేత్తలు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తుల మీద పరిశోధనలు నిర్వహించారు. దానిలో భాగంగా ప్రయోగంలో పాల్గొన్న వారికి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటిని పరిష్కరించమని చెప్పారు. అలానే వారు ఉన్న గదిలో వేర్వేరు వాతావరణ పరిస్థితులు కల్పించారు. దీనిలో భాగంగా ఒకసారి గదిలో ఉష్ణోగ్రతను తగ్గించడం బాగా చల్లగా ఉండేలా చూడటం, మరోసారి వెలుతురు బాగా వచ్చేలా చేయడం.. గదిలో వివిధ పరిమళాలు వ్యాపించేలా చేశారు. అయితే వీటన్నింటిలో.. గదిలో ఉష్ణోగ్రతలు తగ్గించినప్పుడు మెరుగైన ఫలితాలు కనిపించాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఉద్యోగులకు నిద్ర మత్తుగా అనిపించినప్పుడు గదిలో ఉష్ణోగ్రతలు తగ్గించి, చల్లగా ఉండేలా చేస్తే వారు మళ్లీ చురుగ్గా మారుతున్నారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఈ ప్రయోగం ఆధారంగా జపాన్‌కు చెందిన రెండు దిగ్గజ తయారీ కంపెనీలు డైకిన్(ఏసీల తయారీ కంపెనీ), ఎలాక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీ ఎన్‌ఈసీలు ఒక నూతన సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోన్నాయి. దీనిలో భాగంగా వీరు ఉద్యోగుల కంప్యూటర్‌కు కెమరాలను అమర్చారు. అవి ఉద్యోగుల కంటి కదలికలను గమినిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వారి కళ్లు నిద్రలోకి జారుకున్నట్లు మత్తుగా అనిపిస్తాయో అప్పుడు వెంటనే గది ఉష్ణోగ్రతను తగ్గించి, చల్లగా ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో ఉద్యోగులు మళ్లీ చురుగ్గా తయారవుతున్నారు. ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న ఈ పద్ధతిని పూర్తిగా అభివృద్ధి చేసి 2020 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. జపాన్ శ్రామిక చట్టాల ప్రకారం అక్కడి ఉద్యోగులు ఎవరైనా వారంలో ఐదు రోజులు కేవలం నాలుగు గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ ఈ నియమాలను అక్కడి యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే జపాన్ వాసులు సగటున వారానికి 60 గంటలు పనిచేస్తున్నారు. ఈ అధిక పని గంటల వల్ల వారు త్వరగా మృత్యువాత పడుతున్నట్లు అక్కడి నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. -
సం‘క్షామం’
నీలగిరి : అధికారుల అలసత్వం వల్ల లబ్ధిదారుల కు పథకాలు అందకుండాపోతున్నాయి. ప్రభు త్వ మంజూరు చేసిన సబ్సిడీ బ్యాంకుల్లో మూ లుగుతున్నా రుణాలు మాత్రం అందలేదు. సంక్షేమ శాఖల ద్వారా అర్హులైన వారికి లబ్ధిచేకూర్చేందుకు ప్రతి ఏడాది వార్షిక ప్రణాళికను ఖరారు చేస్తారు. ఆ తరువాత లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అర్హులైన వారికి బ్యాంకర్లు రుణాల మంజూరుకు అంగీకార పత్రం అందజేస్తారు. ఆ విధంగా బ్యాంకర్ల నుంచి కాన్సెంట్ తెచ్చుకున్న వారికి మాత్రమే సంక్షేమ శాఖల నుంచి సబ్సిడీ విడుదల చేస్తారు. సంక్షేమ శాఖల నుంచి నేరుగా ఆన్లైన్లోనే లబ్ధిదారుల ఖాతాలకు సబ్సిడీ చేరుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమాచారం పంపిస్తారు. అనంతరం సబ్సిడీ విడుదలైన లబ్ధిదారులకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసి పథకాలను గ్రౌండింగ్ చేస్తారు. ఏ బ్యాంకు ద్వారా ఎంతమంది లబ్ధిదారులకు సబ్సిడీ విడుదలైంది? ఎంత మంది లబ్ధి పొందారు ? అనే దానికి సంబంధించి బ్యాంకర్ల నుంచి సంక్షేమ శాఖల అధికారులు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) తెప్పించుకోవాల్సి ఉంటుంది. కానీ రెండేళ్ల నుంచి ఈ విధానానికి అధికారులు స్వస్తి చెప్పారు. పథకాల గ్రౌండింగ్ గురించే పట్టించుకోవడమే మానేశారు. దీంతో లక్షల రూపాయల సబ్సిడీ సొమ్ము బ్యాంకుల్లోనే మూలుగుతోంది. రూ.1.12 కోట్ల సబ్సిడీ.. 2012-13కు గాను బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు సంబంధిం చి సుమారు రూ.1. 12 కోట్ల సబ్సిడీ బ్యాంకుల్లోనే మూలుగుతోంది. లబ్ధిదారుల పేరు మీద వారి ఖాతాల్లోనే ఈ సబ్సిడీ మొత్తం ఉండిపోయింది. సబ్సిడీ విడుదలైనప్పటికీ రుణాలు మంజూరుగాక లబ్ధిదారులు సంక్షేమ శాఖల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కనీసం సంబంధిత బ్యాంకుల నుంచి యూసీలు తెప్పించుకుని ఎంత మందికి రుణాలు మంజూరు చేశారన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. లబ్ధిదారులు మాత్రం ఇంకా రుణాలు వస్తాయన్న ఆశతో ఎదురుచూడాల్సి వస్తోంది. కాగితాలకే పరిమితం... 2013-14కు గాను ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్ల వార్షిక ప్రణాళిక బుట్టదాఖలైంది. ఈ ఏడాదికి సంబంధించి నిర్ధారించిన లక్ష్యం కంటే మంజూరు ఇచ్చిన యూనిట్లు చాల స్వల్పం గానే ఉన్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం నయాపైసా కూడా సబ్సిడీ విడుదల చేయలేదు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 93 యూనిట్లకుగాను రూ.78 లక్షల సబ్సిడీ బ్యాంకులకు విడుదలైంది. దీంట్లో కేవలం 39 మందికి మాత్రమే రూ.20 లక్షల సబ్సిడీ అందించారు. మిగిలిన రూ.58 లక్షలు బ్యాంకుల్లోనే మూలుగుతోంది. ప్రభుత్వం పైనే ఆశలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది వార్షిక ప్రణాళిక ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ కొత్త ప్రణాళికను ప్రకటించాల్సి వస్తే గతేడాది మంజూరు ఇచ్చిన ప్రతిపాదనలు ఉంటాయా? రద్దు చేస్తారా? అన్నది అధికారులకు కూడా అంతుపట్టడం లేదు. ఎస్సీ వార్షిక ప్రణాళికను రూపొందించామని అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. కానీ మిగతా శాఖల ప్రణాళికలపై ఎలాంటి స్పష్టత లేదు. వాస్తవానికి జిల్లా కలెక్టర్ ఆమోదంతో గతేడాది మంజూరు చేసిన యూనిట్లకు తప్పనిసరిగా సబ్సిడీ విడుదల చేసి పథకాలను గ్రౌండింగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయం పైనే లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు. బ్యాంకులో డిపాజిట్ చేశా - ఎం.విఠల్, పుట్టగూడెం, రాజాపేట మండలం నేను పాడిపశువుల కోసమని ఎస్టీ కార్పొరేషన్‌కు గతేడాది దరఖాస్తు చేశా. బ్యాంకర్లు రుణం ఇప్పిస్తామని చెప్పి నా నుంచి రూ.30 వేలు డిపాజిట్ కట్టించుకున్నారు. కానీ ఇంకా కార్పొరేషన్ నుంచి సబ్సిడీ విడుదల కాలేదు. దీంతో బ్యాంకర్లు సబ్సిడీ వస్తే తప్ప రుణం ఇవ్వమని చెబుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ నుంచి 1769 యూనిట్లకు గాను పాత వాటితో కలిపి 1789 యూనిట్లకు మంజూరు ఇచ్చారు. దీంట్లో 1069 మంది లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు ఇచ్చారు.