breaking news
Tiger protection
-
అదిగో పులి!
-
పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
అభయారణ్యం సమీపంలో పులి మరణంతో ప్రభుత్వం అప్రమత్తం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పులుల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అభయారణ్యం సమీపంలోని చింతలపల్లి బీట్ చెన్నూరు రేంజ్‌లోని కంపార్ట్మెంట్ నంబర్ 51లో కరెంట్ ఫెన్సింగ్ బారిన పడి పులి చనిపోరుున విషయం తెలిసిందే. ఈ ఘటనపై వివిధ పత్రికల్లో వార్తలు, కథనాలు వచ్చిన నేపథ్యంలో సోమవారం అటవీశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, పీసీసీఎఫ్ పీకే ఝా తదితర అధికారులతో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటన జరిగిన వెంటనే వైల్డ్‌లైఫ్ క్రై మ్ రికార్డ్ బ్యూరోకు, సంబంధిత సంస్థలకు నివేదికలను పంపినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కిందిస్థారుు అధికారులను ఉన్నతాధికారులు ఆదేశిం చారు. అడవిపందుల బారి నుంచి తమ పం టలను కాపాడుకునేందుకు గిరిజన రైతులు ఏర్పాటు చేసుకున్న కరెంట్ ఫెన్సింగ్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అటవీశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అం దింది. జంతువుల వేట, వాటి అక్రమ స్మగ్లింగ్, విలువైన శరీరభాగాల కోసం ఈ విద్యుత్ కంచెను ఏర్పాటు చేయలేదని నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం. నలుగురు రైతుల రిమాండ్ విద్యుత్ షాక్‌కు గురై పులి మరణించడంతో భయపడిన రైతులు దానిని పూడ్చివేసి ఉంటారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇం దుకు కారణమైన ఆత్రం ఎర్రయ్య, ఆత్రం లస్మయ్య, ఆత్రం రాజన్న అనే రైతులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పులి శంకర్‌ను ఆదిలాబాద్‌లోని జువెనెల్ హోంకు తరలిస్తున్నట్లు తెలిపారు. మళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులను అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉం డేందుకు ‘ఏనిమల్ ట్రాకర్స్’సంఖ్యను గణనీ యంగా పెంచుకోవాలని ప్రభుత్వం యోచి స్తోంది. ఆ ప్రాంతంలో పులి సంచరిస్తున్న దృశ్యాలు దాదాపు నెలన్నర క్రితమే కెమెరాల్లో రికార్డు అరుునా, దాని సంరక్షణకు సంబంధి త అధికారులు చర్యలు తీసుకోలేదు. దీని పైనా దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. -
పులులను కాపాడుకుందాం
ఆసియా దేశాల సదస్సులో ప్రధాని మోదీ పిలుపు న్యూఢిల్లీ: పులుల సంరక్షణకు అన్ని దేశాలు ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రకృతి, పులుల సంరక్షణకు తీసుకునే చర్యలు అభివృద్ధికి ఏమాత్రం విఘాతం కాకూడదని, ఈ రెండు సమాంతరంగా ముందుకుసాగాలని అన్నారు. పులుల అవయవాల స్మగ్లింగ్‌కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలన్నీ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ పులుల సంరక్షణపై 3వ ఆసియా దేశాల మంత్రుల స్థాయి సదస్సును మోదీ ప్రారంభించారు. ‘ప్రకృతి, పులులను సంరక్షణకు తీసుకునే చర్యలు అభివృద్ధిని కుంటుపరుస్తాయన్న దురభిప్రాయం ఉంది. ఈ రెండింటిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేలా వ్యూహాలు రచించాలి. వన్య ప్రాణులు లేకుండా అడవి, అడవి లేకుండా వన్యప్రాణులు మనలేవు. ఈ రెండింటినీ వేరు చేయలేం. ఒకదాన్ని ధ్వంసం చేస్తే మరొకటి ధ్వంసమవుతుంది. ప్రస్తుతం అన్ని దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న వాతావరణ మార్పు అంశాన్ని ఈ కోణంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. పులుల వేట, వాటి అవయవాలతో అక్రమ వ్యాపారం కారణంగా పలు దేశాల్లో పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాల స్థాయిలో చర్యలు చేపట్టేందుకు ముందుకు రావాలన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. భారత్‌లో పులుల సంరక్షణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఫలితంగా 2014లో 2,226గా ఉన్న పులుల సంఖ్య 2,500కు పెరిగిందన్నారు. 14న ఆన్లైన్ అగ్రి మార్కెట్ షురూ ఆన్లైన్ వ్యవసాయ మార్కెట్‌ను ఈ నెల 14న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ ‘ప్లాట్‌ఫామ్’కు 585 హోల్‌సేల్ మార్కెట్లను అనుసంధానం చేయనున్నారు. రైతు తాను పండించిన పంటను దేశంలోని ఏ మార్కెట్లో అయినా అమ్ముకునేలా ఈ ‘ఈ-ప్లాట్‌ఫామ్’ ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది. 2022లోగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం దీని ఉద్దేశమంది.