breaking news
Thynala Vijaya Kumar
-
వారి పదవులు పోవడం ఖాయం.. విప్ ధిక్కరించిన వారిపై YSRCP ఫిర్యాదు
-
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఝలక్!
కేంద్ర మంత్రివర్గం తెలంగాణ బిల్లును ఆమోదించిన మర్నాడే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై కొట్టారు. రాష్ట్ర విభజన విషయంలో పార్టీ, కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సమైక్య ఉద్యమాన్ని కాంగ్రెస్ అవమానపరిచిందని, సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని తాను నిర్ణయించుకున్నానని ఆయన ప్రకటించారు. వాస్తవానికి తాను జూలై 30నే కాంగ్రెస్‌ను వీడిపోవాలని నిర్ణయించుకున్నానని, అయితే బాధ్యతాయుత ప్రజాప్రతినిధిగా ప్రజల వెనుక ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్నాళ్లూ ఆగానని ఆయన అన్నారు. ఆదివారం నాడు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్సీపీలో చేరనున్నారు.