breaking news
thotakura jangaiah yadav
-
కాంగ్రెస్‌లో టికెట్ లొల్లి!
సాక్షి మేడ్చల్ జిల్లా: మేడ్చల్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ రాజుకుంది. కేఎల్ఆర్కు అధిష్టానం టికెట్ కేటాయించడంపై కాంగ్రెస్‌లోని అసమ్మతి నాయకులు భగ్గుమంటున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ ఓబీసీ వైస్ చైర్మన్ తోటకూరి జంగయ్య యాదవ్‌కు అధిష్టానం టికెట్ నిరాకరించటంతో శుక్రవారం బోడుప్పల్లో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ అసమ్మతి వర్గం నిర్ణయించింది. ఇందులో, నాయకులు,కార్యకర్తలు వెల్లడించే అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేయడమా? లేదా రెబల్‌గా మేడ్చల్ నుంచి బరిలోకి దిగడమా అన్న విషయంపై అసమ్మతి వర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డితో కలిసి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు జంగయ్య యాదవ్‌కు మేడ్చల్ టికెట్ కేటాయించి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ను పార్లమెంట్‌కు పంపించాలని గతంలో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా అధిష్టానం టికెట్ ఇవ్వటంపై అసమ్మతి వర్గం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా కేఎల్ఆర్ స్వచ్ఛందంగా పోటీ నుంచి విరమించుకుని, బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగయ్య యాదవ్‌కు అవకాశం కల్పించాలని కోరుతోంది. స్థానికేతరుడైన కేఎల్ఆర్ కంటే స్థానికుడైన జంగయ్య యాదవ్‌కు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని అసమ్మతి వర్గం పేర్కొంటోంది. బోడుప్పల్ సమావేశం తర్వాత నియోజక వర్గంలోని వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులతో చర్చించి తన భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించుకోవాలని జంగయ్య యాదవ్ భావిస్తున్నారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు వారి అనుచర వర్గం కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నట్టు సమాచారం. మరో పక్క మేడ్చల్ టికెట్ పొందిన కేఎల్ఆర్ అధిష్టానం, రాష్ట్ర నేతల సహకారంతో అసమ్మతి వర్గాన్ని బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టు సమాచారం. పార్టీ పెద్దలతో జంగయ్య యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తానని కేఎల్ఆర్ అసమ్మతి వర్గం వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీలో భగ్గుమన్న అసమ్మతి ఎక్కడికి దారి తీస్తుందోనని కేడర్ ఆవేదన చెందుతుండగా, రాజకీయ పరిశీలకులు మాత్రం కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న పరిణామాలను క్షణ్ణంగా విశ్లేషిస్తున్నారు. -
బలహీనవర్గాల అభివృద్ధి టీడీపీకే సాధ్యం
మేడ్చల్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తోటకూర జంగయ్య యాదవ్ ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్: బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని టీడీపీ మేడ్చల్ అసెంబ్లీ అభ్యర్థి తోటకూర జంగయ్యయాదవ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్‌టెర్మినల్ ఆవరణలో మాట్లాడుతూ టీడీపీ హయూంలోనే మండలం అభివృద్ధి చెందిందన్నారు. మండల ప్రజాపరిషత్, తహసీల్దార్ కార్యాలయాలు, సంసృ్కతి టౌన్షిప్ తదితర నిర్మాణాలు చేపట్టారన్నారు. స్థానికేతరుడిగా ఓటు అడిగే హక్కు ఎమ్మెల్యే కేఎల్లార్‌కు లేదన్నారు. బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిగా ఇతర అభ్యర్థులతో బేరీజు వేసుకొని ఓటేసి తనను గెలిపించాలన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని టీడీపీ ప్రకటించిందని, ఇతర పార్టీలకు దమ్ముంటే సీఎం అభ్యర్థులను ప్రకటించాలని సవాల్ విసిరారు. మేడ్చల్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అన్నారు. టీడీపీ అభ్యర్థుల విజయానికి సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. పిలిస్తే పలికే.. మండలానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాంరెడ్డి, స్థానిక పంచాయతీ సభ్యులు రాంపల్లి జగదీష్‌గౌడ్, మీసాల సుధాకర్, నాయకులు బండారి శ్రీనివాస్‌గౌడ్, రాజబోయిన యాదగిరియాదవ్, బీజేపీ నాయకులు ఆ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి కంభం లక్ష్మారెడ్డి, గుండ్ల బాల్‌రాజ్, పసులాది చంద్రశేఖర్, బిక్కునాథ్‌నాయక్, కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా మండలంలోని యంనంపేట్‌లో శనివా రం సాయంత్రం టీడీపీ నాయకుడు పొలగోని శ్రవణ్‌కుమార్ ఆధ్వర్యంలో యుువకులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జంగయ్య యాదవ్ మాట్లాడుతూ యంనంపేట్ ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామన్నారు. రోడ్డు వెడల్పు కార్యక్రమం, బ్రిడ్జి నిర్మాణంలో స్థలాలు కోల్పోయిన వారికి స్థలాలు అందచేస్తామన్నారు. తోటకూర జంగయ్య యాదవ్‌ను గొంగడితో సన్మానించి, గొర్రెపిల్లను టీడీపీ నాయకుడు శ్రవణ్‌కుమార్ బహుకరించారు. పొలగోని శంకర్, ప్రభాకర్‌గౌడ్, పొలగోని నర్సింహ, వెంకటేష్, చంద్రశేఖర్‌గౌడ్, మెట్టు కుమార్, బాషగళ్ల సుదర్శన్, సురేష్, చంద్రయ్యతో పలువురు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోని ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పత్తెపు రాములు, శ్రీహరి, శంకర్, పోశెట్టి పాల్గొన్నారు. అలాగే మండలంలోని ఏదులాబాద్, అవుశాపూర్, అంకుశాపూర్, ఎన్ఎఫ్సీ నగర్ గ్రామాల్లో శనివారం నిర్వహించిన రోడ్‌షోలలో జంగయ్య యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాలేరు రామోజీ, బిక్కునాథ్ నాయక్, టీడీపీ నాయకులు రఘుపతి, పన్నాల ప్రభాకర్‌రెడ్డి, వెంకటేష్, డీవీ.రావు, రమాదేవి, మహిపాల్, భిక్షపతి, మహేష్, రాజు, రామలింగం, నడిమింటి వెంకటేష్, సాయిలు, రమేష్, సత్తయ్య తదితరులున్నారు.