-
హద్దులు చెరిపేస్తున్న అమలాపాల్
తమిళసినిమా: నటి అమలాపాల్ అందాలారబోతలో హద్దులు చెరిపేస్తోంది. దీని గురించి కోలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. మైనా చిత్రంలో పక్కింటి అమ్మాయిగా నటించిన అమలాపాల్ ఆ తరువాత కూడా దైవతిరుమగళ్, తలైవా వంటి చిత్రాల్లో గ్లామర్ విషయంలో హద్దుల్లోనే ఉంది. ఎప్పుడైతే దర్శకుడు విజయ్ను ప్రేమ వివాహం చేసుకుని ఆ తరువాత ఆయన నుంచి విడిపోయిందో అప్పటి నుంచి గ్లామర్ విషయంతో ఎల్లలు దాటుతోందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఈ జాణ ధనుష్‌తో నటించిన వీఐపీ–2 చిత్రం ఈ మధ్య విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా తిరుట్టుప్పయలే–2 చిత్రంలో నటిస్తోంది. సుశీగణేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్ అందాలారబోతలో శ్రుతి మించిందంటున్నారు. ఈ చిత్రంలోని ఆమె నటించిన గ్లామరస్ సన్నివేశాలతో కూడిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో నటి అమలాపాల్ అరకొర దుస్తులు ధరించి సిగరెట్ దమ్మును గట్టిగా పీల్చి ముక్కు ద్వారా పొగను వదిలే దృశ్యాలు సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇవేవీ పట్టించుకోని అమలాపాల్ ఇకపై తనది గ్లామర్ పయనమే అంటూ నిర్ణయించుకుందట. తమిళంలో పాటు మలయాళంలోనూ నటిస్తున్న ఈ అమ్మడు ముందుముందు ఇంకెంత సంచలనాలకు కేంద్రబిందువు అవుతుందో చూడాలి. అదే విధంగా తిరుట్టుప్పయలే–2 చిత్రంలో అమలాపాల్ దమ్ము కొట్టే సన్నివేశాలకు సెన్సార్ సభ్యులు తమ కత్తెరకు ఏ మేరకు పని చెబుతారోనన్న చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. -
తిరుట్టుప్పయలే–2 ఫస్ట్‌లుక్ విడుదల
తిమిళసినిమా: తిరుట్టుప్పయలే–2 చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. సుశీగణేశన్ దర్శకత్వంలో తెరకెక్కిన తిరుట్టుప్పయలే సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా తిరుట్టుప్పయలే–2 రూపొందుతున్న విషయం తెలిసిందే. సుశీగణేశన్ చిన్న గ్యాప్ తరువాత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాబీసింహా, ప్రసన్న, అమలాపాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో ఆడియోను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. నటుడు విజయ్‌సేతుపతి ఆవిష్కరించిన ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని దర్శకుడు తెలిపారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ చిల్లర దొంగతనాలు చేసుకుంటూ తిరిగే అబ్బాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే స్థాయికి ఎదిగితే ఎలా ఉంటుందనే తిరుట్టుప్పయలే–2 చిత్రం అని తెలిపారు. ఇది తన ఊహకన్నా సమాజంలో జరుగుతున్న సంఘటనలతో సహజత్వంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
క్రేజ్ కా బాప్ వైఎస్ జగన్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం
సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం
గుండెపోటుతో కన్నుమూసిన బీజేపీ కీలక నేత
జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్
ఆ విషయంలో నిరూపించుకోవాల్సిన పనిలేదు: సమంత
కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
తప్పక చదవండి
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్‌కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్‌పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement