breaking news
theme park design
-
kolkata: దుర్గాపూజలో వినూత్న థీమ్‌లు.. చూసి తీరాల్సిందే!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో 2026 దుర్గాపూజ వేడుకలు ఈసారి ప్రత్యేకమైన థీమ్‌లతో ఆకట్టుకోనున్నాయి. గతంలో సామాజిక, రాజకీయ అంశాలను ప్రతిబింబించే మండపాలకు పేరుగాంచిన కోల్‌కతాలో.. ఈ ఏడాది పలు ప్రముఖ పూజా కమిటీలు హిందూ, సనాతన, జాతీయవాద అంశాలకు ప్రాధాన్యం ఇచ్చాయి. కమల పుష్పం, వందేమాతరం, శ్యామ ప్రసాద్ ముఖర్జీ, దేశ విభజన, రామాయణం వంటి అంశాలతో మండపాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు.న్యూ అలీపూర్ సురుచి సంఘ్(కమలం)దక్షిణ కోల్‌కతాలోని ప్రముఖ సురుచి సంఘ్ ఈసారి ‘లోటస్’ థీమ్‌ను ఎంచుకుంది. మండపంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం, రాజకీయ ప్రస్థానాన్ని ప్రతిబింబించనున్నారు. బెంగాల్ హిందూ హోమ్‌ల్యాండ్ ఉద్యమంలో ఆయన పాత్ర, పశ్చిమ బెంగాల్ ఏర్పాటులో ఆయన పాత్రను చూపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖర్జీ విగ్రహాలు, చిత్రాలు, ఆయన వ్యాఖ్యలు, కుటుంబ సభ్యుల చిత్రాలు మండపంలొ కనిపించనున్నాయి. దుర్గాదేవి విగ్రహాన్ని సంప్రదాయ రూపంలో ఏర్పాటు చేస్తున్నారు.సంతోష్ మిత్ర స్క్వేర్ (వందేమాతరం)కోల్‌కతాలోని సంతోష్ మిత్ర స్క్వేర్ ఈసారి ‘సనాతనీ చేతనాయ్ వందేమాతరం’ అనే థీమ్‌ను ఎంచుకుంది. వందేమాతరం 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య పోరాటం, దేశ విభజన జ్ఞాపకాలను ప్రతిబింబించేలా పండల్‌ను తీర్చిదిద్దుతున్నారు. భారతదేశ ఆకారంలో మండపం, ఎర్రకోట ప్రతిరూపం, 1947లో జరిగిన వలసలను చూపించే రైలు నమూనా ఇందులో ఉంటాయి. ఖుదీరామ్ బోస్, మాతంగిని హజ్రా వంటి స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. తొలిసారి లైట్ అండ్ సౌండ్ ప్రదర్శనను కూడా నిర్వహించనున్నారు.అలీపూర్ సార్వజనీనం (రామాయణం)దక్షిణ కోల్‌కతాలోని అలీపూర్ సార్వజనీన దుర్గోత్సవం ఈ ఏడాది ‘రామాయణ కాలంతో అల్లుకున్న ఇతిహాసం’ అనే థీమ్‌ను ఎంచుకుంది. శ్రీరాముడి వనవాసం నుంచి రావణుడితో యుద్ధానికి ముందు దుర్గాదేవిని పూజించిన ఘటన వరకు రామాయణ ఘట్టాలను కాలక్రమంలో చూపించనున్నారు. మండపం గోడలపై రామాయణ దృశ్యాలను చిత్రాల రూపంలో ప్రదర్శిస్తున్నారు. భారీ పడవ నమూనాను ఏర్పాటు చేసి, దానిపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.చల్తాబాగాన్ లోహపట్టి (రామనామి సమాజం)ఉత్తర కోల్‌కతాలోని చల్తాబాగాన్ లోహపట్టి దుర్గాపూజ ‘నిశాన్ – ది మార్క్’ అనే థీమ్‌తో ముందుకొస్తోంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రామనామి సమాజం వారి చరిత్రక సంస్కృతిని కళాత్మకంగా చూపించనున్నారు. రాముడి పేరును శరీరంపై పచ్చబొట్లుగా వేసుకునే ఆ సమాజం సంప్రదాయాన్ని పండల్లో ప్రతిబింబించనున్నారు. గ్రామీణ, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబించేందుకు వారి సంగీతాన్ని కూడా వినిపిస్తున్నారు.శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ – హవా మహల్కోల్కతాలో భారీ దుర్గావిగ్రహాలు, వైభవమైన అలంకరణలకు ప్రసిద్ధి చెందిన శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ ఈసారి రాజస్థాన్‌లోని ప్రముఖ హవా మహల్‌ను థీమ్‌గా ఎంచుకుంది. 953 కిటికీలతో ప్రసిద్ధి చెందిన ఎరుపు, గులాబీ ఇసుకరాతి నిర్మాణాన్ని పోలిన మండపాన్ని నిర్మిస్తున్నారు. జైపూర్‌లోని అసలు కట్టడాన్ని పరిశీలించిన తర్వాత అలంకరణ పనులు చేపట్టారు. చెక్కిన స్తంభాలు, రంగురంగుల కిటికీలతో హవా మహల్ రూపం క్రమంగా సిద్ధమవుతోంది.ఏక్డాలియా ఎవర్గ్రీన్(సోమనాథ్ ఆలయం)దక్షిణ కోల్‌కతాలోని ఏక్డాలియా ఎవర్గ్రీన్ క్లబ్ ఈసారి గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని పునఃసృష్టిస్తోంది. సంప్రదాయ దుర్గాదేవి విగ్రహం, భారీ బడ్జెట్ థీమ్‌లకు పేరుగాంచిన ఈ పూజా కమిటీ గతేడాది అరుణాచలేశ్వర ఆలయాన్ని ప్రతిరూపంగా నిర్మించింది. ఈసారి శివుడి పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన సోమనాథ్ ఆలయాన్ని కోల్‌కతాలో చూపించనున్నారు.బాలిగంజ్ సమాజ్ సేవా సంఘ్ (ఉత్తమ్ కుమార్)బెంగాలీ సినీ దిగ్గజం ఉత్తమ్ కుమార్ శతజయంతి సందర్భంగా బాలిగంజ్ సమాజ్ సేవా సంఘ్ ఈ ఏడాది ఆయనకు అంకితంగా వేదికను ఏర్పాటు చేస్తున్నది. ‘మహాపూజాయ్ మహానాయక్’ పేరుతో ఆయన సినీ ప్రయాణాన్ని ప్రదర్శించనున్నారు. పాత సినిమా పోస్టర్లు, అరుదైన ఫొటోలు, ప్రసిద్ధ సన్నివేశాలు, ఆయన నటించిన ‘సప్తపది’, ‘నాయక్’, ‘అగ్నీశ్వర్’, ‘దేయా నేయా’ వంటి చిత్రాల జ్ఞాపకాలు ఇందులో ఉంటాయి. 1960–70 దశకాల్లో కనిపించిన దుర్గాదేవి విగ్రహ రూపాన్ని కూడా పునఃసృష్టించనున్నారు.కుమార్టులి పార్క్(గంగా ప్రయాణం)కోల్‌కతాలో విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందిన కుమార్టులి పార్క్ ఈసారి గంగానదిని ప్రధాన థీమ్‌గా ఎంచుకుంది. హిమాలయాల్లోని గంగోత్రి హిమానీనదం నుంచి సముద్రంలో కలిసే వరకు గంగా సాగించే ప్రయాణాన్ని పండల్లో చూపించనున్నారు. పర్వతాలు, మైదానాలు, మానవ నివాసాల మధ్య గంగా ప్రవాహాన్ని అలంకరణలు, వెలుగులు, సంగీతంతో ఆవిష్కరించనున్నారు. జీవితం, ఆధ్యాత్మికత, విముక్తికి ప్రతీకగా గంగకు ఉన్న ప్రాధాన్యాన్ని కూడా ఈ థీమ్‌లో చూపించనున్నారు.జగత్ ముఖర్జీ పార్క్(ఉదయ్ శంకర్)90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న జగత్ ముఖర్జీ పార్క్ ఈసారి ప్రముఖ నృత్య కళాకారుడు పండిట్ ఉదయ్ శంకర్‌కు నివాళిగా మండపాన్ని రూపొందిస్తోంది. భారతీయ సంప్రదాయ నృత్యాన్ని పాశ్చాత్య రంగస్థల శైలులతో మేళవించి, ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన కళా ప్రయాణాన్ని ఇందులో చూపించనున్నారు. ఆయన 1948లో రూపొందించిన ‘కల్పనా’ చిత్ర స్ఫూర్తితో మండపాన్ని నిర్మిస్తున్నారు.శివమందిర్ సార్వజనీనం (గంగౌర్)దక్షిణ కోల్‌కతాలోని శివమందిర్ సార్వజనిన దుర్గోత్సవం 90వ వార్షికోత్సవం సందర్భంగా ‘పోరోబ్: ది సెలబ్రేషన్ ఆఫ్ టుగెదర్‌నెస్’ అనే థీమ్‌ను ఎంచుకుంది. రాజస్థాన్ సంప్రదాయ గంగౌర్ జానపద పండుగ నుంచి స్ఫూర్తి పొందిన పండల్‌ను రూపొందిస్తున్నారు. గౌరీదేవి ఆరాధన, రాజస్థానీ జానపద కళలు, చెక్క అలంకరణలు, సంప్రదాయ ఊరేగింపుల శైలిని ప్రతిబింబించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు.ఇదీ చదవండి: దుర్గాష్టమి, మహానవమిపై గందరగోళం?.. పండితుల క్లారిటీ ఇదే.. -
రోబోల ప్రపంచం..
ఇది ప్రపంచంలోనే తొలి రోబోటిక్ థీమ్ పార్క్ డిజైన్. రోబోల ప్రపంచమన్నమాట. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో దీన్ని నిర్మించనున్నారు. ఇక్కడ ఉండే రోలర్‌కోస్టర్, వాటర్ పార్క్, నైట్ క్లబ్‌లు, సినిమా హాళ్లు, మోనో రైలు అన్నీ రోబో థీమ్‌తోనే ఉంటాయి. అంతేకాదు.. అక్వేరియంలో తిరిగేవి కూడా రోబో చేపలే. ఈ థీమ్ పార్క్‌లో ఉండే షాపుల్లో అత్యాధునిక రోబోలను అమ్ముతారు. రోబోటిక్ ఇంజనీరింగ్‌లో శిక్షణ పొందేవారి కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ రోబోటిక్స్ స్కూల్ కూడా ఉంటుంది. ఇక పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో రోబోల తయారీని మనం చూడొచ్చు. 13 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మితమయ్యే ఈ రోబోటిక్ పార్క్ 2016లో ప్రారంభమవనుంది. దీనికయ్యే వ్యయం రూ.4,000 కోట్లు! దక్షిణ కొరియా ప్రభుత్వంతోపాటు మరికొన్ని ప్రైవేటు సంస్థలు నిధులను సమకూరుస్తున్నాయి.


