breaking news
Thar desert
-
ఆరావళి: కొండల్ని తవ్వితే వాళ్లకు చేటు కాదా?
ప్రపంచంలోనే పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణులపై వివాదం రాజుకుంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న విచ్చలవిడి మైనింగ్ , ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు ఈ పర్వతాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ‘సేవ్ ఆరావళి’ అనే నినాదం మార్మోగుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఆరావళి పర్వత శ్రేణులకు దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇవి వాయవ్య భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో దాదాపు 700 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణుల్లోని అత్యధిక ఎత్తు 1,722 మీటర్లు. ఇవి ముడత పర్వతాలు. భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నప్పుడు, వాటి మధ్య ఉన్న భూభాగంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి వల్ల ఆ భూభాగం పైకి లేచి ముడతలు పడుతుంది. ఆరావళి పర్వత శ్రేణులు ఇలాగే ఏర్పడ్డాయి.రాజస్థాన్‌లోని మౌంట్ అబూ సమీపంలో 5,650 అడుగుల ఎత్తులో ఉండే గురుశిఖర్ ఆరావళి పర్వత శ్రేణులలోనిదే. రాజస్థాన్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు నియంత్రణలో ఉండేందుకు, జల భద్రతకు ఈ పర్వతాలు అత్యంత కీలకమైనవి. ఇవి రాజస్థాన్‌లోని థార్ ఎడారి వేగంగా వ్యాప్తి చెందకుండా నిలువరిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని నేలలో భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం కనీసం అప్పుడప్పుడు అయినా తగ్గుతోందంటే అందుకు కారణం ఆరావళి పర్వతాలే. ఈ శ్రేణులు, కేవలం రాళ్లతో నిండిన గుట్టలు మాత్రమే కావు. అవి ఉత్తర భారత దేశపు పర్యావరణ వ్యవస్థకు ఊపిరితిత్తుల వంటివి. ఇవి లేకపోతే ఉత్తర భారతదేశంలోని సారవంతమైన భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. అయితే, గడచిన కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న విచ్చలవిడి మైనింగ్ , ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు ఈ పర్వతాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ, ఈ పర్వత శ్రేణులలో దాగి ఉన్న విలువైన ఖనిజ సంపద ఇప్పుడు వాటి పాలిట శాపంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ‘సేవ్ ఆరావళి’ అనే నినాదం మార్మోగుతోంది.अरावली सिर्फ़ पहाड़ नहीं, राजस्थान की सांस है। हज़ारों सालों से ये पर्वतमाला हमारी ज़मीन, पानी और जीवन की रक्षा करती आ रही है। इसे बचाना मतलब आने वाली पीढ़ियों को बचाना। #SaveAravalli pic.twitter.com/Yf0RAdPzW5— Tribal Army (@TribalArmy) December 19, 2025సుప్రీంకోర్టు ఏం చెప్పింది?ఆరావళి పర్వత శ్రేణుల పరిరక్షణ, మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది నవంబరు 20న కీలక తీర్పు ఇచ్చింది. ఆరావళి పర్వతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిర్వచనాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. దీని ప్రకారం, ఆరావళి పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో స్థానిక భూమట్టం నుంచి 100 మీటర్లు (328 అడుగులు) లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారు. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఒకటికిపైగా ఆరావళి పర్వతాలు, పక్కపక్కనే సగటున 500 మీటర్ల దూరంలో ఉంటే వాటి మధ్యనున్న భూమిని కూడా ఆరావళి పర్వతశ్రేణిగానే పరిగణిస్తారు. ఈ పర్వతశ్రేణుల పరిధిలో పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో మైనింగ్‌ను సుప్రీం కోర్టు పూర్తిగా నిషేధించింది. సుస్థిర మైనింగ్ నిర్వహణ ప్రణాళిక (ఎంపీఎస్ఎం) సిద్ధమయ్యే వరకు ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతీయ అటవీ పరిశోధన, విద్యా మండలి (ఐసీఎఫ్ఆర్ఈ) ద్వారా మొత్తం ఆరావళి శ్రేణికి సంబంధించి ఒక సమగ్ర సుస్థిర మైనింగ్ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆర్డర్ ఇచ్చింది. ఆరావళి శ్రేణులు థార్ ఎడారి విస్తరించకుండా అడ్డుకునే సహజ రక్షణ కవచమని, భూగర్భ జలాల రీఛార్జ్, వాతావరణ సమతుల్యతకు ఇవి అత్యంత అవసరమని కోర్టు నొక్కి చెప్పింది.కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదేంటి? ఆరావళి పర్వత శ్రేణుల భౌగోళిక స్వరూపంపై స్పష్టత కోసమే, వాటికి ఒక నిర్దిష్ట నిర్వచనాన్ని ఇచ్చాం. ఆ పర్వతాల్లో అక్రమ మైనింగ్ జరగకుండా నిలువరించడానికే ఈ చర్యను చేపట్టాం. ఆరావళి పర్వతాలను రక్షించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ పర్వత శ్రేణుల్లో క్షీణించిన ప్రాంతాలను పునరుద్ధరించడానికి మేం ఇప్పటికే 'గ్రీన్ ఆరావళి వాల్' ప్రాజెక్టును మొదలుపెట్టాం. సుప్రీంకోర్టు ఇటీవలే ఆమోదించిన నిర్వచనం ప్రకారం ముందుకు సాగుతాం. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఆరావళి పర్వత శ్రేణులను రక్షిస్తాం. ఆరావళి పర్వత ప్రాంతాల్లో 0.19 శాతం మాత్రమే మైనింగ్‌కు అనుమతి ఉంటుంది. వాటిలో కొత్త గనులకు మేం అనుమతులు ఇవ్వలేదు. దాదాపు 90 శాతం ఆరావళి పర్వత శ్రేణులకు రక్షణ కొనసాగుతోంది. ఈవిషయంలో ఎలాంటి సడలింపును మేం ఇవ్వలేదు. దీనిపై కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు'' అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టత ఇచ్చారు. जब अरावली बचेगी ..तभी जल, जंगल और जीवन बचेगा !!⛰️#SaveAravalli pic.twitter.com/BYG2bM0IdP— Ronak Choudhary (@Ronak_choudhry) December 19, 2025పర్యావరణవేత్తల ఆందోళన.. ఆరావళి పర్వత శ్రేణుల కొత్త నిర్వచనంలోని 100 మీటర్ల ఎత్తు నిబంధనపై పలువురు పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరావళి శ్రేణులలోని దాదాపు 91 శాతం పర్వతాలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయని చెబుతున్నారు. ఈ కొత్త నిబంధన వల్ల దాదాపు 91 శాతం ఆరావళి పర్వత శ్రేణులు చట్టపరమైన రక్షణను కోల్పోయే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎత్తులు, కొలతల ప్రాతిపదికన పర్వత శ్రేణుల లాంటి భారీ పర్యావరణ వ్యవస్థలను నిర్వచించలేమని పర్యావరణవేత్తలు అంటున్నారు. కొండలు, అడవులు, పరీవాహక ప్రాంతాలు అనేవి ఒకదానితో ఒకటి పరస్పరం అనుసంధానితమై ఉంటాయని, వాటిని వేరుచేసి చూడలేమని గుర్తు చేస్తున్నారు. అన్ని ఎత్తుల ఆరావళి పర్వతశ్రేణులతో పాటు వాటి పరిసర ప్రాంతాలను రక్షిత జోన్లుగా పరిగణించాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. 100 మీటర్ల ఎత్తు నిబంధన మైనింగ్, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల నిర్మాణ కంపెనీలకు వెసులుబాటును కల్పించేలా ఉందని ఆరోపిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ వల్ల ఇప్పటికే ఆరావళి పర్వత శ్రేణులు దెబ్బతిన్నాయని అంటున్నారు.గుజరాత్లో నిరసనలుప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలోనూ ఆరావళి పర్వత శ్రేణులు ఉన్నాయి. 100 మీటర్ల ఎత్తు నిబంధనపై ఈ జిల్లాలోని విజయనగర్‌లో ఉన్న దద్వావ్ ఏరియా ప్రజలు మండిపడ్డారు. పెద్దసంఖ్యలో స్థానికులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. తమ ప్రాణాలను త్యాగం చేసైనా ఆరావళిని కాపాడుకుంటామని వారు ప్రకటించారు. తమ సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక వారసత్వంలో కీలక భాగమైన ఆరావళి పర్వత శ్రేణులను పరిరక్షించుకుంటామని తేల్చి చెప్పారు. సబర్కాంత జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భావి తరాలు ఆరావళి శ్రేణులను పోస్టర్లలో చూసుకోవాల్సిన పరిస్థితిని తేకూడదని సూచిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర సర్కారుకు విన్నవిస్తున్నారు.అధ్యయనాలు ఇలా.. ఇక, తాజా విశ్లేషణ ప్రకారం గత ఎనిమిది సంవత్సరాలలో ఆరావళిలో పచ్చదనం క్రమంగా కోతకు గురైంది. వృక్షసంపద దాదాపు మూడింట ఒక వంతు తగ్గింది. దశాబ్దం కంటే తక్కువ కాలంలోనే దాదాపు 11,392 చదరపు కిలోమీటర్ల నుండి 7,521 చదరపు కిలోమీటర్లకు అటవీ ప్రాంతం తగ్గిపోయింది. మరోవైపు.. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ (CURaj) పరిశోధకులు 1975, 2019 మధ్య ఉపగ్రహ చిత్రాలు అధ్యయనం చేసి అంచనాలను రూపొందించారు. వారు విశ్లేషించిన డేటా ప్రకారం 44 సంవత్సరాల కాలంలో 5772.7 చదరపు కిలోమీటర్లు లేదా ఆరావళి శ్రేణులు దాదాపు 8 శాతం చదును చేయబడ్డాయని పేర్కొంది.సోషల్ మీడియాలో ట్రెండింగ్ #సేవ్ఆరావళిఆరావళి పర్వతశ్రేణుల భద్రతపై భారత ప్రజల ఆందోళన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎంతోమంది పర్యావరణ వేత్తలు, పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, న్యాయవాదులు, పర్యావరణ సంస్థలు #సేవ్ఆరావళి హ్యాష్‌ట్యాగ్‌తో 'ఎక్స్' వేదికగా ట్వీట్లు చేస్తున్నాయి. శ్రేణుల భద్రతను బలహీనపర్చొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఆరావళికి ఏదైనా జరిగితే తిరిగి పొందలేమని, ఇప్పుడే ఆ పర్వతశ్రేణుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.ఆరావళికి గండం వస్తే నష్టాలివే.. ఆరావళి పర్వతశ్రేణుల భద్రతకు భంగం కలిగితే, వాటిలోని జీవరాశులు, గిరిజన, ఆదివాసీ జాతుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రత్యేకించి ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాలలో గాలి నాణ్యత మరింత తగ్గుతుంది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలలో భూగర్భ జలాలు అడుగంటి నీటి ఎద్దడి ఏర్పడుతుంది. రాజస్థాన్‌లోని థార్ ఎడారి వేగంగా విస్తరిస్తుంది.All eyes on Aravali …Reminder - Nature belong to everyone #SaveAravalli pic.twitter.com/g5LcSdfQSH— Tsering Gaphel ༅༎ཚིི་ཪིང་དགའ་འཕེལ།། (@Tsering_gaphel) December 24, 2025 -
థార్‌తో విసిగిపోయిన యజమాని చేసిన పని సోషల్ మీడియాలో వైరల్
పూణే:ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా థార్ ఎస్‌యూవీతో విసిగిపోయిన కారు యజమాని వినూత్నంగా నిరసన తెలిపాడు. థార్ కారుని ఇంటి నుంచి షోరూం వరకు గాడిదలతో తరలించారు. అలా అయినా మహీంద్రా ప్రతినిధులు స్పందించి తన సమస్యను పరిష్కరిస్తారేమోనని ఆశగా ఎదురు చూశాడు. ఆ తర్వాత ఏమైందంటే?థార్‌తో రోజుకో పుట్టుకొస్తున్న సమస్యలతో విసిగిపోయిన వ్యక్తి.. గాడిదలతో షోరూమ్‌కు లాగించిన ఘటన పూణేలో జరిగింది. అక్బర్ ఖాన్ మహీంద్రా థార్ (2023 మోడల్)ను కొనుగోలు చేశాడు. లక్షలు వెచ్చించి కారును కొనుగోలు చేశాడన్న మాటేగాని నిత్యం ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. నాటి నుంచి ఇంజిన్ సమస్యలు, బ్రేక్‌డౌన్ ఫెయిలవ్వడం షోరూంకి తీసుకుపోయి బాగు చేయించుకోవడం, వేలవేలకు వేలు ఖర్చు చేయడం. ఇలా పరిపాటిగా మారింది. అలా అని థార్ సమస్యలు తీరాయా? అంటే అదీ లేదు. కారులోని సమస్యలతో ఇబ్బంది పడుతున్నా బాగుచేయండి మహాప్రభూ అంటూ షోరూం ప్రతినిధులకు కారు యజమాని మొరపెట్టుకున్నా.. ఫలితం శూన్యం. ఈ క్రమంలో ఇంజిన్ సమస్యలు, బ్రేక్డౌన్లు తరచూ ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ థార్ యజమాని కారును గాడిదలతో లాగించి షోరూమ్ ముందు ఉంచి తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. దీంతో ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ సందర్భంగా థార్ ఓనర్ అక్బర్ ఖాన్ మాట్లాడుతూ.. “థార్ వాహనం కొనుగోలు చేసిన తర్వాత ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. షోరూమ్‌కు ఎన్నిసార్లు తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. చివరికి గాడిదలతో లాగించి షోరూమ్ ముందు ఉంచి నా బాధను వెళ్లగక్కానని చెప్పుకొచ్చాడు. వీడియో వైరల్ కావడంపై షోరూమ్ ప్రతినిధులు స్పందిస్తూ, “వాహన యజమానిని సంప్రదించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు.ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది యజమాని వినూత్న నిరసనను ప్రశంసిస్తుండగా, మరికొందరు కంపెనీపై విమర్శలు చేస్తున్నారు. Pune: Frustrated Mahindra Thar Owner Ties Donkeys To SUV, Drags It To Wakad Showroom In Protest pic.twitter.com/3s2LizjBhF— Pune First (@Pune_First) November 13, 2025 -
Operation Smiling Buddha: బుద్ధుడు నవ్విన వేళ
51 ఏళ్ల క్రితం. 1974 మే 18. ఆ రోజు థార్ ఎడారిలోని ఇసుక మేటల్లో పుట్టిన ‘భూకంపం’ యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ’ పేరుతో రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో భారత్ తొలి అణుపరీక్ష నిర్వహించింది. శాస్త్ర సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటింది. ఐరాస భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల తర్వాత అణుపరీక్ష చేసిన తొలి దేశంగా అవతరించింది. పోఖ్రాన్–1 న్యూక్లియర్ టెస్ట్‌గా పిలిచే ఈ ప్రయోగాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ సారథ్యంలో అత్యంత రహస్యంగా చేపట్టారు.ఏ దేశాలు వ్యతిరేకించాయి? అణుబాంబుల బాధిత దేశమైన జపాన్ మొట్టమొదట ఈ పరీక్షలను తీవ్రంగా ఖండించింది. భారత్‌పై కఠిన ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఆ్రస్టేలియా సైతం ఇదే పాట పాడింది. రెండ్రోజుల తర్వాత జరిగిన ఐరాస నిరాయుదీకరణ సమావేశంలో ఆ్రస్టేలియా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ అణుబాంబురహిత అవని కోసం అంతా ఎదురుచూస్తుంటే పేలుళ్లతో అందరి ముఖం మీద భారత్ చెంప వాచిపోయేలా కొట్టింది’’ అని ఆ్రస్టేలియా ప్రతినిధి జాన్ క్యాంప్‌బెల్ వ్యాఖ్యానించారు. ద.కొరియా, మలేసియా, న్యూజిలాండ్ సైతం ఇలాగే స్పందించాయి.అమెరికా కన్నుగప్పి...1974 ప్రయోగంలో అణు విచ్చిత్తి సిద్ధాంతంతో తయారైన అణుబాంబును పరీక్షించారు. అత్యధిక పీడనం, ఒత్తిడితో అత్యల్ప పరిమాణంలోకి ఇమిడ్చిన ప్లుటోనియంను పేలేలా చేశారు. కేంద్రక విచ్చిత్తిలో బరువైన ఫ్లుటోనియం అణువులోని కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక ఉష్ణశక్తి వెలువడుతుంది. ఆ క్రమంలో జరిగే భారీ విస్ఫోటం పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన అణుబాంబులు ఈ రకానివే. ఈ ప్రయోగం కోసం కోసం ముంబై సమీపంలోని కెనడా ఇండియా రియాక్టర్ యుటిలిటీ సర్వీసెస్ (సిరస్) నుంచి తెప్పించిన ఆరు కిలోల ప్లుటోనియం వాడారు. అది పేలడానికి పొలోనియం–బేరియం పేలుడు పదార్థాన్ని జతచేశారు. దాన్ని పేల్చే వ్యవస్థను చండీగఢ్, పుణెల్లో అభివృద్ధిచేశారు. షట్కోణాకృతిలోని 1,400 కిలో బాంబు అమెరికా నిఘా కంటికి చిక్కకుండా ఇసుకతో కప్పేసి రైలు మార్గాన థార్‌కు తరలించారు!చాన్నాళ్ల క్రితమే బీజం అణుబాంబు తయారీ కోసం భారత్ 1967 నుంచే విస్తృత పరిశోధనలు మొదలు పెట్టింది. ప్రఖ్యాత అణు భౌతిక శాస్త్రవేత్త రాజా రామన్న సారథ్యంలో పీకే అయ్యంగార్, రాజగోపాల చిదంబరం వంటి 75 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అణుబాంబు తయారీలో తలమునకలయ్యారు. 1972 సెపె్టంబర్ 7న ప్రధాని ఇందిర బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)ను సందర్శించారు. అణుపరీక్షపై ముందుకెళ్లాలని శాస్త్రవేత్తల బృందానికి దిశానిర్దేశం చేశారు. ప్రయోగానికి ఒక రోజు ముందు, అంటే 1974 మే 17న రాజా రామన్నకు ఇందిర ఫోన్ చేశారు. ‘‘డాక్టర్ రామన్నా! ఇక మనమేంటో చూపిద్దాం. మనం చేసే పని దేశానికి ఎంతో మేలు చేకూరుస్తుంది’’ అన్నారు. ఆ మర్నాడు జరిగిన అణుపరీక్షకు పోఖ్రాన్ టెస్ట్ రేంజ్‌లోని ఇండియన్ ఆర్మీ బేస్ వేదికైంది. అణుపరీక్ష అత్యంత శాంతియుతంగా జరిగిందని విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రపంచదేశాలు మాత్రం భారత్ అణ్వస్త్ర వ్యాప్తికి పాల్పడుతోందని కుతకుతలాడాయి. మనపై ఆంక్షల కత్తి దూశాయి.ఆ మీట నొక్కిందెవరు?మే 18 ఉదయం 8.05 గంటలకు శాస్త్రవేత్త ప్రణబ్ రేబతిరంజన్ దస్తీదార్ ఫైరింగ్ బటన్ నొక్కారు. ‘‘బటన్‌ను నొక్కేందుకు అంతా ఆసక్తి చూపారు. దాంతో ట్రిగ్గర్ తయారీలో కీలకపాత్ర పోషించిన ప్రణబ్‌కే చాన్సివ్వాలని నిర్ణయించాం’’ అని రాజా రామన్న తన ‘ఇయర్స్ ఆఫ్ పిల్గ్రిమేజ్’ పుస్తకంలో వెల్లడించారు. నాడు బార్క్ గ్రూప్ డైరెక్టర్‌గా ఉన్న ప్రణబ్ తర్వాత ఐరాస అణుఇంధన సంస్థ డైరెక్టర్‌గా చేశారు. భారత తొలి దేశీయ అణుఇంధన జలాంతర్గామి తయారీలో కీలకపాత్ర పోషించారు.‘స్మైలింగ్ బుద్ధ’ ఎందుకు? 1974లో బుద్ధ పూరి్ణమ మే 18న వచి్చంది. అందుకే ప్రయోగానికి ఇందిర ఆ పేరు పెట్టారు. ఆ మేరకు సైంటిస్ట్ రాజా రామన్నకు రహస్య సందేశం పంపారు. ప్రయోగం విజయవంతం అయ్యాక ‘ఎట్టకేలకు బుద్ధుడు నవ్వాడు’ అంటూ ఆయన ఇందిరకు మెసేజ్ పంపారు.1998లో పోఖ్రాన్–2 అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో రెండు దశాబ్దాల పాటు భారత్ అణుపరీక్షలకు దూరంగా ఉంది. ఆ సమయంలో పుష్కలంగా కూడగట్టుకున్న అణు సాంకేతికతను జోడించి 1998లో ‘ఆపరేషన్ శక్తి’ పేరిట మళ్లీ అణుపరీక్షలకు దిగింది. దీన్నే పోఖ్రాన్–2 అని కూడా అంటారు. అప్పుడూ మే లోనే ప్రయోగం జరగడం విశేషం. అమెరికా నిఘా సంస్థ సీఐఏ కళ్లుగప్పి మే 11న థార్ ఎడారిలో మరోసారి దిగి్వజయంగా ప్రయోగం నిర్వహించింది. అణు, హైడ్రోజన్ బాంబులను ఏకకాలంలో పేలి్చంది. రెండు రోజులకు మే 13న మరో రెండు అణుబాంబులను పేల్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న థార్, మహీంద్రా ఎక్స్‌యూవీ 700
దేశంలోని ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా 2022 ఫిబ్రవరిలో మొత్తం 54,455 వాహనాలను విక్రయించినట్లు సంస్థ నేడు(మార్చి 1) తెలిపింది. యుటిలిటీ వేహికల్స్ సెగ్మెంట్'లో మహీంద్రా 27,551 వాహనాలను విక్రయించింది. అలాగే, ప్యాసింజర్ వేహికల్స్ సెగ్మెంట్'లో 27,663 వాహనాలను విక్రయించింది. ముంబైకి చెందిన ఈ ఆటో మేజర్ గత నెల 2,814 వాహనాలను ఎగుమతి చేసింది. గత నెలలో థార్, ఎక్స్‌యూవీ 700 సిరీస్ వంటి వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు సంస్థ పేర్కొంది. కేవలం ఎస్యూవీ సెగ్మెంట్ వాహనాల విక్రయాలు 79 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కమర్షియల్ వేహికల్స్ సెగ్మెంట్'లో మహీంద్రా ఫిబ్రవరి 2022లో 119% వృద్ధిని నమోదు చేసింది. భారీ వాణిజ్య వాహనాల అన్ని లైట్ కమర్షియల్ వాహనాలు కూడా మంచి వృద్దిని కనబరిచాయి. ఎమ్ అండ్ ఎమ్ లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. "మొత్తం మీద 54,455 వాహనాల అమ్మకాలతో ఫిబ్రవరి 2022లో 89 శాతం వృద్ధిని సాధించాం. అన్ని విభాగాలు ఎస్‌యూవీలతో సహా ఇతర వాహనాలు మంచి వృద్దిని కనబరిచాయి. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తగ్గడంతో డిమాండ్ పేరిగిందని మేము భావిస్తున్నాము. సెమీ కండక్టర్ కొరత ఉన్న కూడా ఆ విధంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాము" అని అన్నారు. (చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి అదిరిపోయే శుభవార్త.. సింగిల్ ఛార్జ్ @ 300కిమీ!) -
1,72,000 క్రితం నాటి నది ఆనవాళ్లు గుర్తింపు
జైపూర్: లక్షా డెభ్బై రెండు వేల(1,72,000) సంవత్సరాల క్రితం రాజస్తాన్‌లోని బికనీర్ సమీపంలో ఉన్న సెంట్రల్ థార్ ఎడారి గుండా ప్రవహించి కాల ప్రవాహంలో కనుమరుగైన “నది”ఆనవాళ్లను పరిశోధకులు తాజాగా ఆధారాలతో సహా కనుగొన్నారు. ఈ ప్రాంతంలో మానవులు నివసించేందుకు.. నాగరికత అభివృద్ధి చెందేందుకు ఈ నది ఒక జీవనరేఖగా ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. జర్మనీలోని ది మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, తమిళనాడులోని అన్నా విశ్వవిద్యాలయం, ఐఐఎస్ఈఆర్ కోల్‌కతా పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం చేశారు. పరిశోధన వివరాలు క్వాటర్నరీ సైన్స్ రివ్యూస్ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. సెంట్రల్ థార్ ఎడారిలోని నల్ క్వారీలో అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిపిన పరిశోధనలు నది కార్యకలాపాల దశను సూచించాయి. ఇక ఈ అధ్యాయన ప్రకారం రాతియుగం నాటి మానవులు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న దానికంటే భిన్నమైన థార్ ఎడారి ప్రకృతిలో నివసించినట్లు తెలుస్తోంది. కనుమరుగైన నది సమీప ఆధునిక నదికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా పరిశోధనలో తేలింది. (చదవండి: వర్షం.. పర్వతాలను సైతం కదిలిస్తుందట!) ‘లుమినిసెన్స్ డేటింగ్’ ద్వారా ఇక కనుమరుగైన నదీ సమాచారం గురించి నల్ గ్రామానికి సమీపంలోని క్వారీ నుండి వెల్లడైన ఇసుక, కంకరల లోతైన నిక్షేపాన్ని ఈ బృందం అధ్యయనం చేసింది. అదేవిధంగా పరిశోధకులు వివిధ నిక్షేపాలను అధ్యయనం చేయడం ద్వారా వివిధ దశల నది కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయగలిగారు. నది ఇసుకలోని క్వార్ట్జ్ గ్రేయిన్స్ ఎప్పుడు ఖననం అయ్యాయో తెలుసుకునేందుకు పరిశోధకులు ‘లుమినిసెన్స్ డేటింగ్’ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించి ఫ్లూవియల్ నిక్షేపాల దిగువన చాలా చురుకైన నది వ్యవస్థకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు అచ్యుతన్ చెప్పారు. సుమారు 172 వేల సంవత్సరాల క్రితం నల్ వద్ద బలమైన నది కార్యకలాపాలు జరిగాయని ఫలితాలు సూచించాయన్నారు. సెంట్రల్ థార్ ఎడారి గుండా ప్రవహించే నది పాలియోలిథిక్ జనాభాకు లైఫ్ లైన్‌గా ఉందని.. వలసలకు ముఖ్యమైన కారిడార్‌గా ఉండేదని వారు తెలిపారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల అధ్యయనం కూడా థార్ ఎడారి గుండా ప్రవహించిన నది మార్గాల నెట్‌వర్క్‌ను చూపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనాలు గతంలో నదులు, ప్రవాహాలు ఎక్కడ ప్రవహించాయో సూచించగలవే కానీ అవి ఎప్పటివి అన్న విషయం మాత్రం చెప్పలేవని అన్నా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హేమా అచ్యుతన్ అన్నారు. (చదవండి: గులాబీ రంగులోకి మంచు.. కారణం!) థార్ ఎడారికి గొప్ప చరిత్ర ఉందని పరిశోధకులు తెలిపారు. రాతియుగ జనాభా ఈ అర్ధ-శుష్క ప్రకృతిలో మనుగడ సాగించడమే కాకుండా ఎలా అభివృద్ధి చెందిందో చూపించే అనేక రకాల సాక్ష్యాలను తాము వెలికితీస్తున్నట్లు ది మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ శాస్ర్తవేత్త జింబోబ్ బ్లింక్‌హార్న్ తెలిపారు. చరిత్ర పూర్వంలోని కీలక కాలంలో నదీ వ్యవస్థలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మనకు చాలా తక్కువ వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ఆఫ్రికా నుంచి భారతదేశానికి హోమో సేపియన్ల ప్రారంభ విస్తరణలతో ఈ నది ముడిపడి ఉన్నట్లుగా తెలిపారు. -
ఈ ఎడారిలో నీటికి కొదవ లేదు!
జైసల్మీర్: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తోంటే.. రాజస్థాన్ లోని థార్ ఎడారిలో మాత్రం 2 నుంచి 3 అడుగుల లోతు గుంటను తవ్వితే నీరు బయటకు వస్తోంది. జైసల్మీర్ కు సమీపంలోని షాఘర్ బల్జ్ ప్రాంతంలో ఈ పరిస్థితే కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న ఒయాసిసలో ఎక్కడ తవ్విన 2 నుంచి 3 అడుగుల్లోపే నీరు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నీరు అంతరించిపోయిన సరస్వతి నదివేనని అంటున్నారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్లకు ఈ నీరు కొన్ని సంవత్సరాలుగా దాహార్తి తీరుస్తోందని చెప్తున్నారు. ఏ సీజన్ లోనైనా ఇక్కడ నీరు లభిస్తోందనీ, ఉదయం ఒకసారి గుంటను తవ్వి నీరు తొడుకుంటే సాయంతానికి తిరిగి నీరు ఊరుతోందని తెలిపారు. ఎంతో శుభ్రతతో లభ్యమయ్యే ఈ నీరు మినరల్ వాటర్ కంటే బావుంటాయని చెప్పారు. నీరు లభించే ప్రాంతమంతా వృక్షసంపదతో కళకళలాడుతుంటుందని తెలిపారు. ఒయాసిస్ కింద ఏదో జీవనది ప్రయాణిస్తుండటం మూలానే ఇలా జరుగుతోందని అంటున్నారు. బోర్డర్ లో ఉండే ఖారా, నల్కా, ఝలారియా, రోహ్ తోష్, వీర్ హిల్, కిర్వాలీ, సొంగమ్ లకు పైపులైన్ల ద్వారా ఇక్కడి నుంచి నీటి సరఫరా జరుగుతుందని బీఎస్ఎఫ్ అధికారి దిల్ బాగ్ సింగ్ తెలిపారు. సీనియర్ గ్రౌండ్ వాటర్ సైంటిస్ట్ డా.నారాయణ్ దాస్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో భూమి కింద నీటి వనరులు అధికంగా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ఇక్కడ నీటి వినియోగం చాలా తక్కువగా ఉండటం కూడా ఇక్కడి వాసులకు కలిసి వస్తోందని అన్నారు. -
అత్యధిక జన సాంద్రత ఉన్న ఎడారి.. థార్!
హైదరాబాద్: ప్రపంచంలో వాతావరణ వైవిధ్యం ఉన్న ప్రాంతాల్లో ఎడారులు ప్రత్యేకమైనవి. ఒక పక్క అత్యధిక ఉష్ణోగ్రతలు, మరో పక్క ఎముకలు కొరికే చలితో ఎడారి ప్రాంతాలు విభిన్నంగా ఉంటాయి. ఇక వర్షాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఏడాదిలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఈ ప్రాంతాల్లో వర్షం చూడగలం. అయినప్పటికీ ఇక్కడ కూడా అత్యధిక సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు. మన దేశంలో అత్యధిక భాగంలో విస్తరించి ఉన్న ‘థార్ ఎడారి’లో ఉండే పరిస్థితుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..! ఎక్కడ ఉంది? థార్ ఎడారి భారత్, పాక్ సరిహద్దుల్లో ఉంది. దీన్నే ‘గ్రేట్ ఇండియన్ డెసెర్ట్’ అని పిలుస్తారు. ఇది రాజస్థాన్, హరియాణా, పంజాబ్, పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. పాకిస్తాన్ ఉన్న భూ భాగాన్ని ‘ఖలిస్తాన్ ఎడారి’ అని పిలుస్తారు. ఇది భారత్‌లో మొదటి, ప్రపంచంలో ఏడో అతి పెద్ద ఎడారి. పుట్టుక: దీని పుట్టుక మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ ఎడారి 4-10 వేల ఏళ్ల పూర్వం నాటిది మాత్రమే అని చెబుతారు. క్రీ.పూ 2000-1500 సంవత్సరాలలో ఇక్కడ ప్రవహించే షుగ్గర్ నది ఇంకిపోవడం వల్లే ఈ ఎడారి ఏర్పడిందని కొంత మంది భావిస్తున్నారు. అత్యధిక శాతం మంది పరిశోధకులు ప్రస్తుతం ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు మొహంజదారో కేంద్రంగా ఉంటూ, సింధులోయ నాగరికత ప్రజలకు ప్రధాన నీటివనరుగా ఉండేదని.. ఆకస్మికంగా భౌగోళిక సమతుల్యం లోపించి పెనుమార్పులు చోటుచేసుకుని ఇలా ఎడారిగా మార్పు చెందిందని వాదిస్తున్నారు. అయితే ‘సరస్వతి’ నది ఇంకిపోయిన ప్రాంతమే థార్ ఎడారి అనే వాదనను మాత్రం పరిశోధకులు అంగీకరించడం లేదు. సహజ వృక్షాలు: ఇక్కడి పొడి వాతావరణంలో జీవించగల్గిన ముళ్ల చెట్లు అధికంగా ఉన్నాయి. వీటిలో కీకర్, వేవంజా, ఖేర్, దిరిశన, వేప, సంగ్రి, జాల్కి, రొహిడా, ఫరాశ్ వంటి ఎడారి మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. థార్ ఎడారిలో సందూర్, దుర్వ, బంచ్ గ్రాస్, ఘమూర్, కాస్, బఫెల్ గ్రాస్, దర్భ, ఘోకోరూ, జినస్, గవాక్షీ.. వంటి ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఉప్పునీటి సరస్సులు: థార్ ఎడారిలో అనేక ఉప్పునీటి సరస్సులు ఉన్నాయి. సంభర్, పచ్చద్రా, తాల్ చాపర్, ఫాలౌడి, లంకన్సర్ వద్ద ఉన్న ఉప్పునీటి సరస్సుల నుంచి సోడియం క్లోరైడ్(ఉప్పు)ను ఉత్పత్తి చేస్తున్నారు. నీటి వనరులు: సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో నీరు లభ్యం కావడం చాలా అరుదు. కనుక ఎడారి ప్రాంత ప్రజల జీవితాల్లో నీరు ప్రధాన భూమిక పోషిస్తుంది. సహజ నీటి వనరులు (ఒయాసిసులు), మానవ నిర్మిత ‘జోహాడ్’ అనే చిన్న తరహా నీటి గుంటలు మానవులకు, జంతువులకు ఈ ప్రాంతంలో తాగునీటిని అందిస్తున్నాయి. నీటి వనరులు లభ్యమయ్యే ప్రాంతాన్ని బట్టి ఎడారి వాసులు వలస జీవనం సాగిస్తారు. విస్తీర్ణం: ‘వరల్డ్ వైడ్ ఫండ్’ సంస్థ నిర్వచనం ప్రకారం దీని విస్తీర్ణం 2,38,700 చ.కిమీ. భారతదేశంలో ఉన్న భూభాగంలో ఈ ఎడారి 61 శాతం రాజస్థాన్, 20 శాతం గుజరాత్, 9 శాతం హరియాణ, పంజాబ్‌లలో విస్తరించి ఉంది. జీవవైవిధ్యం: థార్ ఎడారిలో ప్రపంచంలోని మిగిలిన ఎడారుల్లో కంటే ఎక్కువ జీవులు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతంలో 23 రకాల పాకే జీవులు, 25 జాతుల సర్పాలు ఉన్నాయి. వీటిలో పలు జాతులు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ప్రాంతీయ, వలస పక్షులు కలిపి సుమారు 141 పక్షి జాతులు ఉన్నాయి. ప్రజలు: థార్ ఎడారిలో ప్రధానంగా హిందువులు, ముస్లింలు, సిక్కులు నివసిస్తున్నారు. పాకిస్తాన్ భూ భాగంలో సింధీలు, కొల్హీలు జీవిస్తున్నారు. రాజస్థాన్‌లో 40 శాతం ప్రజలు ఎడారిలోనే నివసిస్తున్నారు. ఇక్కడి ప్రజలు జీవనాధారం కోసం వ్యవసాయం, జంతువుల పెంపకం మీద ఆధారపడుతుంటారు. ఎడారి ప్రజల ఆర్థిక స్థితి చాలా త క్కువగా ఉంటుంది. థార్ ఎడారి ప్రపంచంలోనే అత్యధిక జన సాంద్రత కలిగిన ఎడారి ప్రదేశం. ఇక్కడ చదరపు కిలోమీటరుకు 83 మంది నివసిస్తున్నారు. ఇతర ఎడారుల్లో ఈ సంఖ్య 7 మంది మాత్రమే. పర్యటనలు: జైసల్మీర్ వద్ద ఒంటెల సవారీ ప్రజాదరణ పొందడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. విదేశీ, స్వదేశీ పర్యాటకులు ఒంటెల మీద ఎడారిలో సవారీ చేసేందుకు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పర్యటనలో తక్కువ ధరలో అరేబియన్ శైలి విందులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు జైసల్మీర్, దాని చుట్టుపక్కన ఉన్న గ్రామాలలో ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయి. పర్యాటక నిర్వాహకులకు, ఒంటెల యజమానులకు ఇవి చక్కని ఆదాయాన్ని అందిస్తున్నాయి. (స్కూల్ ఎడిషన్ ప్రత్యేకం). -
ఎడారి జిల్లాలో రెండే సీట్లు
రాజస్థాన్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన థార్ ఎడారి... దూరంగా విసిరేసినట్లు ఉండే గ్రామాలు... ఆయా గ్రామాల్లో కేవలం వందల సంఖ్యలోనే ఓటర్లు. ఇదీ రాజస్థాన్‌లో గోల్డెన్ సిటీగా పేరుగాంచిన జైసల్మేర్ జిల్లా పరిస్థితి. జిల్లా విస్తీర్ణం 38,401 చదరపు కిలోమీటర్లు ఉన్నప్పటికీ అందులో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతమే. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 6.72 లక్షలు. అందుకే ఈ జిల్లాలో జైసల్మేర్, పోఖ్రాన్ శాసనసభా నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. జైసల్మేర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చోటూసింగ్‌తోపాటు కాంగ్రెస్ నుంచి రూపారాం పోటీ పడుతుండగా; పోఖ్రాన్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాలేహ్ మహమ్మద్, బీజేపీ నుంచి షేతా సింగ్ పోటీలో ఉన్నారు. రాజస్థాన్‌లో బీజేపీ గెలుపు: సర్వే న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు ఏబీపీ న్యూస్-దైనిక్ భాస్కర్-నీల్సేన్ సర్వే వెల్లడించింది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 105 స్థానాల్లో గెలుపొందే అవకాశాలున్నట్లు తె లిపింది. కాంగ్రెస్‌కు 77 సీట్లు లభించవచ్చని పేర్కొంది.


