breaking news
Texas airport
-
‘మా అమ్మాయి పేరు ఏబీసీడీఈ.. అయితే మీకేంటి?!’
వాషింగ్టన్ : నా కూతురికి నాకు నచ్చిన పేరు పెట్టుకుంటాను. ఎగతాళి చేయడానికి మీరు ఎవరు..? అంటూ ప్రశ్నిస్తున్నారు ఓ ప్రయాణికురాలు. టెక్సాస్‌లో జరిగింది ఈ సంఘటన. వివరాలు.. ఓ ప్రయాణికురాలు తన కూతురుతో కలిసి టెక్సాస్‌లోని సౌత్‌వెస్ట్ విమానాశ్రయానికి వచ్చారు. చెకింగ్ సమయంలో విమానాశ్రయ ఉద్యోగి ఒకరు తన కూమార్తెను ఎగతాళి చేశారని తెలిపింది. సదరు ప్రయాణికురాలి కుమార్తె పేరు ‘ఏబీసీడీఈ’. దాంతో ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఆ బాలిక పేరును ‘ఎబ్సిడీ’ అని ఎగతాళిగా పలకడమే కాక పక్కనే ఉన్న మిగతా సిబ్బందికి కూడా చెప్పి కామెంట్ చేయడం ప్రారంభించారు. అంతేకాక ఆ బాలిక బోర్డింగ్ పాస్‌ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్నేహితుల ద్వారా ఈ విషయం బాలిక తల్లికి తెలిసింది. దాంతో సదరు మహిళ ఈ విషయం గురించి ఎయిర్‌లైన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. దాంతో ఆగ్రహించిన సదరు మహిళ ఈ విషయం గురించి స్థానిక మీడియాతో మాట్లాడింది. ‘నా కూతురికి నాకు నచ్చిన పేరు పెట్టుకుంటాను. కామెంట్ చేయడానికి వారికేం హక్కుంది. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించిడం సిబ్బంది కనీస బాధ్యత. కానీ వారు నా కుమార్తె పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు. తన పేరును ఎగతాళి చేయడమే కాక.. తన బోర్డింగ్ పాస్‌ను మా అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు’ అంటూ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఈ విషయం కాస్తా వైరల్‌గా మారటంతో సదరు విమానాశ్రయ అధికారులు ప్రయాణికురాలికి క్షమాపణలు తెలిపారు. -
విమానాన్నే దొంగిలించబోయాడు
టెక్సాస్: చిన్నా చితకా కాదు ...ఏకంగా విమానాన్ని దొంగిలించబోయి పోలీసులకు చిక్కాడో ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే..అమెరికాలోని టెక్సాస్‌లో సెక్యురిటీ గేట్‌ను బద్దలు కొట్టి విమానాశ్రయంలోకి శుక్రవారం ఓ వ్యక్తి ప్రవేశించాడు. అక్కడ విమానాలు నిలిపే ప్రదేశం దగ్గరకు వెళ్లాడు. ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థకు చెందిన లియర్ జెట్ విమానం దగ్గరకు చేరుకున్నాడు. టైర్ల కింద కదలకుండా ఉండడానికి పెట్టే టైర్ చాక్స్ని తీసేసి విమానంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. దీన్ని గమనించిన టెక్సాస్ విమానయాన సిబ్బంది అక్కడ ఉన్న పోలీస్ అధికారిని అప్రమత్తం చేశారు. ఆ పోలీసు అధికారి అక్కడకు చేరుకొని సదరు వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేయగా అతను సహకరించలేదు. దీంతో అధికారి తన దగ్గర ఉన్న స్టెన్ గన్‌తో అతనికి షాక్ ఇచ్చాడు. అయినా అతనిలో ఎలాంటి స్పందన లేదు. దీంతో అక్కడున్న వారి సహాయంతో ఎట్టకేలకు అతడిని బంధించారు. అయితే ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు. దీంతో అతని ప్రస్తుత పరిస్థితిని పరిశీలించేందుకు మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.