breaking news
tempels
-
నైవేద్యం ఆలస్యమైతే కరిగిపోయే విగ్రహం!.. ఈ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?
ఆకలి.. జీవులకు ఓ గొప్ప వరం.. ఒక్కోసారి అదే పెద్ద శాపం! ‘క్షుధాతురాణాం న రుచి న పక్వమ్’ అన్నారు పెద్దలు. అంటే ఆకలి వేసినప్పుడు రుచులు, పక్వాలు చూడరని అర్థం. ఉదర నిమిత్తం బహుకృత వేషం అని శంకరుల వారే చెప్పారు. కానీ.. ఈ ఆకలికి ఆ దేవుడు అతీతుడా? అసలు దేవుడికి కూడా తీవ్రమైన ఆకలి వేస్తుందా? గ్రహణం పడితే ప్రపంచంలో ఏ గుడైనా మూసేస్తారు.. కానీ, గ్రహణ సమయంలో కూడా ఆకలి తట్టుకోలేక, నైవేద్యం స్వీకరించే వింత దేవుళ్లు ఎక్కడైనా ఉన్నారా?మన దేశంలోని కొన్ని పురాణ క్షేత్రాలు... 'అవును.. దేవుడికి కూడా ఆకలి వేస్తుంది!' అని నిరూపిస్తున్నాయి. ఒక్క 10 నిమిషాలు నైవేద్యం ఆలస్యమైతే చాలు.. అక్కడ దేవుడి విగ్రహం ఆకలితో చిక్కిపోతుంది! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం! ఆ అద్భుత క్షేత్రాల రహస్యాలు ఏంటో తెలుసా?గ్రహణం అనగానే అందరికీ గుర్తొచ్చేది.. దేవాలయాల తలుపులను మూసివేయడం.. గ్రహణం విడుపు తర్వాత శుద్ధి కార్యక్రమాలు జరిపి, నిత్య సేవలను ప్రారంభించడమే..! కానీ, కొన్ని ఆలయాల్లో దేవుడి ఆకలి కారణంగా.. గ్రహణ సమయంలోనూ ఆలయాల తలుపులు తెరుచుకునే ఉంటాయి. కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం ఈ కోవలో ముందంజలో ఉంటుంది. ఇక్కడ కొలువుదీరిన కన్నయ్యకు ఆకలి చాలా ఎక్కువ. రోజుకు 10 సార్లు నైవేద్యం పెడతారు. అంతేకాదు.. ఈ ఆలయంలోని గర్భగుడి వెలుపల పెద్ద గొడ్డలి ఉంటుంది. ఉదయం ఆలయం తెరవడానికి తాళం మొరాయిస్తే.. దాన్ని ఈ గొడ్డలితో పగులగొట్టి మరీ.. దేవుడి ఆకలిని తీర్చేలా వెనువెంటనే నైవేద్యాలు పెడతారు. ఈ ఆలయంలో 10 నైవేద్యాల్లో ఏ ఒక్కటి తగ్గినా.. స్వామివారు సన్నబడతారట..! సైన్స్‌కు కూడా ఈ వింత అంతుచిక్కలేదట..! అందుకే.. ఇక్కడి పూజారులు గ్రహణ సమయంలో కూడా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. స్వామివారు ఆకలిని తట్టుకోలేరనే ఉద్దేశంతో.. గ్రహణ పట్టు.. విడుపులతో సంబంధం లేకుండా నైవేద్యం సమర్పిస్తారు.రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఉన్న లక్ష్మీనాథ్ ఆలయాన్ని కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంచుతారు. ఓసారి ఇక్కడి ఆలయాన్ని గ్రహణ సమయంలో మూసివేస్తే.. స్వామివారు ఆ పక్కనే ఉన్న మిఠాయి దుకాణం వ్యాపారి కలలోకి వచ్చి.. ‘‘నాకు చాలా ఆకలిగా ఉంది’’ అని చెప్పారట. అప్పటి నుంచి గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి క్షేత్రంలో శివలింగం స్వయంభూ. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుడు నవగ్రహాలను, 27 నక్షత్రాలను కవచంగా ధరించి ఉంటాడు. ఆయనకు గ్రహాలను శాసించే స్వామిగా పేరుంది. అలాంటి స్వామికి గ్రహణ దోషం ఎందుకుంటుంది? అందుకే.. ఇక్కడ గ్రహణ సమయంలో రాహు-కేతులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. ఉజ్జయినిలోని మహాకాళుడికి కాలాతీతుడు.. అంటే కాలానికి అతీతుడు అనే పేరుంది. అందుకే.. ఈ స్వామివారికి గ్రహణ ప్రభావం అంటదు. గ్రహణ సమయంలో ఈ జ్యోతిర్లింగ దర్శన సమయాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఇక దివి నుంచి భువికి గంగాప్రవాహం వచ్చేప్పుడు.. ఆ ఉధృతిని తన జటాజూటంతో నిర్బంధించిన శివుడు ఉత్తరాఖండ్‌లోని కల్పేశ్వర్ ఆలయంలో కొలువుదీరాడు. ఈయనకు కూడా గ్రహణ సమయంలో పూజలు ఆగవు. ఇక ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో అమ్మవారు కల్కాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆమె సాక్షాత్తూ కాలచక్రానికే అధిపతి. అంటే.. గ్రహాలు, నక్షత్రాలు ఆమె కనుసన్నల్లోనే కదులుతాయి. అందుకే.. గ్రహణ ప్రభావం అమ్మవారిపై ఉండదనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. నిత్య కైంకర్యాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇక గయలోని విష్ణుపాద ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. ఇక్కడ గ్రహణ సమయంలో పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. -
దొంగలు బాబోయ్..దొంగలు!
మర్రిపూడి: ప్రకాశం జిల్లాలో దొంగతనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గ్రామ శివారు పురాతన ఆలయాలు, నూతనంగా నిర్మించిన ఆలయాలను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు దొంగతనం చేసినా పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకోవడంలో దొంగలు డిగ్రీ పొందారేమోనని ఆయా గ్రామాల ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. చైన్‌స్నాచర్లు, గుప్త నిధుల కోసం తవ్వకాలు, హుండీ, విగ్రహాల దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసు శాఖను ముప్పుతిప్పలు పెడతున్నారు. దొంగల ఆచూకీ తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నిర్మాపురం గ్రామ శివారులో ఈ ఏడాది ఏప్రిల్ 5న అభయాంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న సిమెంట్ కిటికీ తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించి హుండీ పగులగొట్టి అందులో ఉన్న రూ.15 వేలు అపహరించుకెళ్లారు. గతేడాది అంకేపల్లి గ్రామ శివారులో ఉన్న అమ్మవారి గుడి తాళాలు పగులగొట్టి హుండీలోని నగదు మాయం చేశారు. మర్రిపూడి పురాతన శివాలంలో ఈ నెల 26వ తేదీ రాత్రి దొంగలు పడి సుమారు రూ.20 లక్షల విలువ చేసే 5 పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారు. తంగెళ్ల శివాలయం, పృధులగిరి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం విగ్రహాల కింద తవ్వకాలు జరిపారు. గుండ్లసముద్రం పంచాయతీ పరిధిలోని కొష్టాలపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో దొంగలు పడటంతో నగదు చోరీకి గురైంది. తాజాగా కూచిపూడి అండ్ర రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపారు. రూ.లక్షలకు లక్షలు వెచ్చించి ఆలయాలు నిర్మించుకున్న భక్తులు స్వాముల వారికి కానుకలు వేసేందుకు హుండీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆలయాల్లో ఉండే హుండీలపై దొంగల కన్నుపడుతోంది. సులవుగా ధనార్జన చేయాలని దొంగలు ఏదో ఒక ప్రదేశంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. కేసులు ఛేదించడంలో పోలీసులు విఫలమవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఏడాది వ్యవధిలో దాదాపు 17 దొంగతనాలు జరిగాయని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. స్వాముల వారి సొమ్ము కాజేస్తున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని భక్తులు వాపోతున్నారు. ఆయా గ్రామాల భక్తులు ఏం చేయాలో అర్థంగాక ఆందోళన చెందుతున్నారు. స్వాముల వారి సొత్తు కాపాడే నాథుడేలేరా? అని వాసులు ప్రశ్నిస్తున్నారు. దేవుని సొమ్ము తిన్నోళ్లు నాశనమైపోతారని మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. సీసీ కెమెరాలు అమర్చాలి మర్రిపూడి పంచాయతీ పరిధిలోని రాజుపాలెంలో అభయాంజనేయస్వామి ఆలయం హుండీ పగులగొట్టి నగదు తీసుకెళ్లారు. గార్లపేటలో కూడా ఇలాగే జరిగింది. ఇన్ని దొంగతనాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు విమర్మిస్తున్నారు. పలు ముఖ్య ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అమర్చి దొంగల భరతం పట్టాలని కోరుతున్నారు. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఘనంగా హనుమాన్ జయంతి
హనుమాన్ జయంతిని గురువారం కొత్తగూడెం, పాల్వంచ, జూలూరుపాడులో ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి పూజలు చేశారు. ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీలు, హనుమాన్æ సేవా సమితీల ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు కొత్తగూడెంటౌన్ : జిల్లా కేంద్రంలోని రామవరం సీఆర్పీ క్యాంప్‌లోని ఆంజనేయస్వామి ఆలయం, రుద్రంపూర్‌లోని హనుమాన్ దేవాలయం, రైటర్‌బస్తీలోని మాస్టర్ ఈకే విద్యాలయం హనుమాత్ సేవా సమితి ఆధ్వర్యంలో, బస్టాండ్ సెంటర్లోని హనుమాత్ సేవా సమితి ఆధ్వర్యంలో, ఇల్లెందు క్రాస్ రోడ్డులోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, విద్యానగర్ కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయం, పాలకేంద్రంలోని హనుమాన్ ఆలయంలో స్వామివారి జయంతిని నిర్వహించారు. జూలూరుపాడులో.. జూలూరుపాడు: మండలంలోని వెంగన్నపాలెం, జూలూరుపాడు, గుండెపుడి, పాపకొల్లు, భేతాళపాడు, కాకర్ల, పడమటనర్సాపురం, సురారం, బచ్చలకోయగూడెం తదితర గ్రామాల్లోని శ్రీఆంజనేయస్వామి ఆలయాల్లో స్వామివారి జయంతిని జరుపుకున్నారు. కొన్నిచోట్ల ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాలు జరిగాయి. -
పుష్కర ఘాట్లకు ఆధ్యాత్మిక శోభ


