breaking news
Telugu Thalli Flyover
-
పూటకో మాట.. రోజుకో తీరు
సాక్షి, హైదరబాద్: తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ బోర్డుకు సంబంధించి జీహెచ్ఎంసీ తీరు ప్రజలకు అంతుచిక్కడం లేదు. ఫ్లై ఓవర్ ఒకవైపు (పాత సచివాలయం వైపు) ప్రవేశ మార్గంలో గత మంగళవారం ప్రజలకు దర్శనమిచ్చిన బోర్డును సాయంత్రానికి అక్షరాలు కనిపించకుండా తెర వేశారు. తెలుగుతల్లిగా ఉన్న పేరును తెలంగాణ తల్లిగా మార్చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో జీహెచ్ఎంసీ చేసిన ఆ పనితో పలు సంశయాలు వెల్లువెత్తాయి. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ఫ్లై ఓవర్ రెండో వైపు(లోయర్‌ట్యాంక్‌బండ్) ప్రవేశమార్గంలో కూడా బోర్డు ఏర్పాటు చేశాక రెండింటినీ కలిపి ఒకేసారి ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు రోజుల్లో రెండింటినీ కలిపి ఒకేసారి ప్రారంభిస్తామని పేర్కొంది. కానీ.. రెండో వైపు బోర్డు ఏర్పాటు కాకుండానే సచివాలయం వైపు బోర్డుకు వేసిన తెరను తొలగించి, తిరిగి అక్షరాలు కనిపించేలా చేసింది. ఇంతమాత్రానికి ఈ తతంగమంతా ఎందుకు? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత ఒకవైపు మాత్రమే ఏర్పాటు చేస్తే ఎవరైనా కాదన్నారా? ఎందుకు మూసేశారు? రెండోవైపు ఏర్పాటు కాకున్నా మళ్లీ ఎందుకు తెర తీశారు? రెండూ ఒకేసారి ప్రారంభిస్తామని ఎందుకు ప్రకటించారు? అంటూ పలువురు జీహెచ్ఎంసీ చర్యల్ని తప్పుపడుతున్నారు. -
ట్యాంక్ బండ్ లో నిమజ్జనానికి తరలివస్తున్న గణనాధులు
-
E-Car Racing: ఓరి నాయనో ఇదేంటి! వాహనాలు రేసింగ్ ట్రాక్‌పైకి ఎలా వచ్చాయ్?
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ- రేసింగ్ వద్ద గందరగోళం నెలకొంది. రేసింగ్ ట్రాక్‌పైకి ఒక్కసారిగా ప్రైవేట్ వాహనాలు దూసుకురావడంతో ప్రాక్టీస్ రేస్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఫార్ములా-ఈరేస్ కారణంగా తెలుగుతల్లి ఫైఓవర్ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గంగలు గంటలు ట్రాఫిక్ ఆగిపోవడంతో వాహనదారులు అసహనంతో ట్రాక్‌పైకి వచ్చారు. దీంతో ట్రాక్‌పైకి వాహనాలు ఎలా వచ్చాయని నిర్వాహకులు షాక్‌కు గురయ్యారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు.. మరోవైపు ఈ-ఫార్ములా రేసుతో హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. రేస్ కారణంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్, లక్డీకాపూల్, అసెంబ్లీ, ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రేసింగ్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేసులు ముఖ్యమా? తాము ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం మరోవైపు ఫార్ములా ఈ రేసింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. మలుపు వద్ద కారు గోడను ఢీకొట్టింది. క్రేన్ సాయంతో ట్రాక్‌పై నుంచి కారును తొలగించారు. -
తెలుగు తల్లి ఫ్లైఓవర్ పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : సచివాలయ కూల్చివేతలో భాగంగా దాదాపు 40 రోజుల పాటు మూసివేసి ఉంచిన తెలుగుతల్లి, ఖైరతాబాద్ ప్లైఓవర్లపై మంగళవారం రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేటి నుంచి సింగిల్ వేలో వాహనదారులకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జూలై 7న ప్రారంభమైన సచివాలయ కూల్చివేత 40 రోజుల పాటు జరిగింది. భవనాలు కూల్చివేసే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతోనే ఫ్లై ఓవర్లతో పాటు పరిసర ప్రాంతాల రహదారులను మూసివేశామని అధికారులు పేర్కొన్నారు. అయితే సచివాలయ కూల్చివేతకు సంబంధించి మీడియాతో పాటు ఇతరులెవ్వరిని తెలంగాణ ప్రభుత్వం అనుమతించలేదు. సచివాలయ భవనం కింద గుప్త నిధులు ఉన్నాయని, అందుకే అనుమతి ఇవ్వలేదని కొందరు చేసిన ప్రచారం అలజడి రేపింది. ఇదే విషయమై ఒక మీడియా సంస్థ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు కూడా ప్రభుత్వ తీరుపై అభ్యంతరాలు తెలపడంతో మీడియాను అనుమతిచ్చారు. -
తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై.. రయ్ రయ్!
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై సమస్యను పరిష్కరించామని, ప్రస్తుతం వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేదని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం పేర్కొంది. ఈ మేరకు తమ అధికారిక ట్వీటర్లో వివరాలు వెల్లడించారు. తెలుగు తల్లి ఫై ఓవర్- లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఆయిల్ ప్రభావం కారణంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దాదాపు 30 బైకుల వరకు ఫ్లై ఓవర్ ప్రాంతంలో బైకులు స్కిడ్ అయి (జారిపోయి) పడటంతో కొందరు ద్విచక్ర వాహనదారులకు గాయాలయ్యాయి. దీంతో కొన్ని గంటలపాటు ఫ్లై ఓవర్ పైకి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. చిరు జల్లులు పడటంతో దుమ్ము, దూళి అంతా కలిసి నూనే వ్యర్థాలుగా మారడంతో వాహనదారులు బైక్‌తో సహా కింద పడిపోయారు. సోషల్ మీడియాలో ఇంకా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయని, కానీ ప్రస్తుం ఫ్లై ఓవర్‌పై వాహనాలు తిరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి వీడియోను పోస్ట్ చేశారు.