breaking news
telangana women university
-
కోఠి ఉమెన్స్ కాలేజ్ ఇక ‘తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం’
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలో కొత్తగా స్థాపించిన మహిళా వర్సిటీకి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసినట్లు కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.విజ్జులత బుధవారం తెలిపారు. ఓయూకు అనుబంధంగా 98 సంవత్సరాలు కొనసాగిన కోఠి మహిళా కాలేజీ ఈ విద్యా సంవత్సరం (2022–23) తెలంగాణ మహిళా యూనివర్సిటీ(టీఎంయూ)గా మారడం తో పాలన వ్యవహారాలు బదిలీ కానున్నాయి. కోఠి మహిళా కాలేజీలో కొనసాగుతున్న బోధన, బోధనేతర సిబ్బంది ఓయూకు వచ్చేందుకు వీలుగా ఇటీవల జరిగన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి వీసీని నియమించాల్సి ఉంది. వీసీని నియమించనందున వర్సిటీలో చేపట్టాల్సిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక మహిళా వర్సిటీ పరిధిలోని కాలేజీల సంఖ్య, కోర్సుల వివరాలు ఇంతవరకు ప్రకటించలేదు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించే దోస్తు ద్వారా డిగ్రీ, ఓయూ నిర్వహించే టీఎస్సీపీజీఈటీ ద్వారా వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు జరగ నున్నాయి. టీఎస్సీపీజీఈటీ–2022 పీజీ అడ్మిషన్ల జాబితాలో తెలంగాణ మహిళా వర్సిటీని కూడా చేర్చారు. కానీ మహిళా వర్సిటీ నుంచి వివరాలు రానందున జూన్ 1న విడుదల కావాల్సిన టీఎస్ సీపీజీఈటీ–2022 నోటిఫికేషన్ నిలిచిపోయింది. -
'తెలంగాణలో మహిళా యూనివర్సిటి ఏర్పాటు చేయాలి'
హైదరాబాద్: ఉన్నత విద్యలో మహిళల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీని స్థాపించాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సత్య డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు అందుబాటులో లేకుండా తిరుపతిలో మహిళ వర్సిటీని స్థాపించి సీమాంధ్రపాలకులు ఈ ప్రాంత మహిళలను ఉన్నత విద్యకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయాలన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఈ విద్య సంవత్సరం మహిళా వర్సిటీని కూడా స్థాపించాలని కోరారు.