breaking news
telangana state committee
-
లీడర్ రాస్తే రీడర్ చదివినట్టు... : లక్ష్మణ్
బడ్జెట్‌పై బీజేఎల్పీ నేత లక్ష్మణ్ తెలంగాణ రాష్ర్ట సమితి (టీఆర్ఎస్) నిర్మాణం, పటిష్టత, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను వారి పార్టీలో చేర్పించడంలాంటి వాటిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చూపిస్తున్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై చూపడం లేదు. తాజా బడ్జెట్ కూడా ప్రజావసరాలను, సమస్యల పరిష్కారానికి ఊతమిచ్చే కోణాలను చూపటం లేదు. అయితే ఐదు నెలల స్వల్ప పాలనాకాలాన్ని ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా భావించలేం, కానీ, ఈ కాలంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మాత్రం సరిగా లేదు. ఇప్పటివరకు వేసిన తప్పటడుగులను వెంటనే సరిదిద్దుకోని పక్షంలో ప్రజలు వాతపెట్టడం ఖాయం. ప్రగతిశీల ధృక్పథంతో ఉండే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ బడ్జెట్ విషయంలో మాత్రం సరిగా వ్యవహరించలేదు, లీడర్ రాస్తే రీడర్ చదివాడన్నట్టుగా.. ఆయన రీడర్ పాత్రనే పోషించారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’ను మన పార్టీ-మన ప్రణాళికలాగా మార్చారు. బంగరు తెలంగాణలో ఉద్యోగాలకు కొదువ ఉండదని ఆశించిన విద్యార్థులు ఇప్పుడు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ కమిషన్, డీఎస్సీల నోటిఫికేషన్లు లేవు, రూ.1,300 కోట్ల మేర ఫీజు బకాయిలు పేరుకుపోయి పేద విద్యార్థుల ఉన్నత చదువులు డోలాయమానంలో పడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు లేక బాలికలు చదువుకు దూరమవుతున్నారు. 330 మండలాల్లో తీవ్ర కరువు నెలకొన్న పరిస్థితిలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టకపోవటం దారుణం. రైతుల ఆత్మహత్యలు లేకుండా ఉండాలంటే ఛత్తీస్‌గఢ్ తరహాలో గిట్టుబాటు ధర అందే పరిస్థితి కల్పించాలి. స్కానింగ్ యంత్రాలకు కూడా సరిపోని నిధులను ఆస్పత్రులకు కేటాయించటమేంటి?. సురేశ్‌ప్రభు విషయంలో మీరు చేసిందేంటి?: హరీశ్‌రావు పార్టీ ఫిరాయింపులను టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని లక్ష్మణ్ ఆరోపించినప్పుడు ‘మరి శివసేన నేత సురేశ్‌ప్రభు విషయంలో మీరు చేసిందేంటి?’ అని మంత్రి హరీశ్‌రావు ఎదురు ప్రశ్నించారు. అవసరమైతే ఆ పార్టీలకు రాజీనామా చేసిన తర్వాత చేర్చుకోండి, సురేశ్‌ప్రభు అలా రాజీనామా చేసే బీజేపీలో చేరారని లక్ష్మణ్ ముక్తాయించారు. -
కాంగ్రెస్ ఓటమి సంపూర్ణం
టీడీపీతో చేతులు కలిపినా ఫలితం శూన్యం సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ‘ఆపరేషన్ ఆకర్ష్’ అస్త్రంతో కాంగ్రెస్ పార్టీ ఓటమి సంపూర్ణమైంది. సాధారణ ఎన్నికల్లో మొదలైన హస్త పరాభవం స్థానిక పీఠాల పోరుతో ముగిసింది. అధికార పార్టీ అనుకూలత, సొంత పార్టీలోని నాయకత్వ లోపం, స్థానిక ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ప్రయోజనాల ముందు కాంగ్రెస్ వ్యూహాలేవీ ఫలించలేదు. చివరకు ఆగర్భ శత్రువు తెలుగుదేశంతో జతకట్టి లబ్ధిపొందాలని చేసిన ప్రయత్నమూ బెడిసికొట్టింది. ఫలితంగా అత్యధిక స్థానాలు సాధించి సుమారు 50కి పైగా స్థానిక పీఠాలనూ కాంగ్రెస్ చేజార్చుకుంది. అధికారపార్టీకి ఉన్న అనుకూలతలతో ఆయా పీఠాలన్నీ దాదాపుగా గులాబీ వశం కావడం గమనార్హం. రంగారెడ్డిలోనూ ఫలించని వ్యూహం తాజాగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది. జెడ్పీ చైర్మన్ పీఠాన్ని పంచుకునేలా తెలుగుదేశం పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ మంత్రి మహేందర్‌రెడ్డి ఎత్తుగడల ముందు కాంగ్రెస్ ప్లాన్ ఫలించలేదు. టీడీపీ సభ్యులు టీఆర్ఎస్ వైపు వెళ్లడంతో జెడ్పీ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లు, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్ జెడ్పీలు సహా మరో 10 మున్సిపాలిటీలు, 41 మండల పరిషత్తుల్లో అధిక స్థానాలు సాధించి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ఆయా పీఠాలను సాధించడంలో పూర్తిగా విఫలమైంది. సాధారణ, స్థానిక ఎన్నికల్లోనే కాకుండా ఇటీవల జరిగిన శాసనమండలి చైర్మన్ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే.