breaking news
Telangana Skating Association
-
ప్రపంచ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌కు తెలంగాణ యువకుడి ఎంపిక
నవంబర్ 7 నుంచి 15 వరకు ఖజకిస్తాన్‌లో జరగనున్న జూనియర్ వరల్డ్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌కు తెలంగాణ యువకుడు ప్రణవ్ మాదవ్ సురపనేని ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISAI) అధికారికంగా ప్రకటించింది. ISAI అధ్యక్షుడు అమితాబ్ శర్మ ఓ లేఖ ద్వారా ప్రణవ్ ఎంపికను ధృవీకరించారు.ఆ లేఖలో అమితాబ్ ప్రణవ్ ఇటీవలి ప్రదర్శనలను కొనియాడాడు. ప్రణవ్ వరల్డ్ చాంపియన్‌షిప్ అర్హతకు అవసరమైన టైమింగ్‌ను క్లాక్ చేసి, దేశానికి గర్వకారణంగా నిలిచాడని ప్రశంసించారు. తెలంగాణ నుంచి వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన ఏకైక అథ్లెట్ ప్రణవ్ అని తెలిపారు.ప్రణవ్ ఎంపికను పురస్కరించుకుని, అతనికి ప్రోత్సాహం అందించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీని కోరారు. వింటర్ స్పోర్ట్స్‌ను ప్రోత్సహిస్తూ, ప్రతిభావంతులైన అథ్లెట్లను పెంపొందించడంలో మీ సహకారం అమూల్యమైందని లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్న ప్రణవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
‘టి’ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడిగా సైమన్
సుధాకర్‌రెడ్డికి ఏపీఆర్ఎస్ఏ బాధ్యతలు ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ రోలర్ స్కేటింగ్ సంఘం రెండుగా విడిపోయింది. వేర్వేరు సంఘాల కార్యవర్గం కోసం గురువారం ఇక్కడి ఒలింపిక్ భవన్లో ఎన్నికలు జరిగాయి. తెలంగాణ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడిగా ఎఫ్.జె.సైమన్, ప్రధాన కార్యదర్శిగా శ్రీరాంప్రసాద్ శ్రీవాస్తవ ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా జె. సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా భగీరథ్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. కోశాధికారులుగా తెలంగాణకు కేఆర్ మహేంద్ర, శశిధర్, ఏపీకి అచ్యుతరామ్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి పని చేస్తారు. తెలంగాణ కార్యవర్గం సీనియర్ ఉపాధ్యక్షుడు: వీరేశ్ కుమార్ యామా, ఉపాధ్యక్షులు: ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్, ఇక్బాల్ లసానియా, కె. సాంబయ్య. అదనపు కార్యదర్శి: నిర్మలా సింగ్, సంయుక్త కార్యదర్శులు: డాక్టర్ నవీన్ కుమార్, నూర్ మొహమ్మద్, నర్సింహ. ఆంధ్రప్రదేశ్ కార్యవర్గం సీనియర్ ఉపాధ్యక్షుడు: రఘుపతి రాజు, ఉపాధ్యక్షులు: ప్రసన్న కుమార్, శ్యామ్‌బాబు, రామకృష్ణ, అదనపు కార్యదర్శి: దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శులు: వెంకటేశ్వర్లు, ఆర్.వి.వి. నాయుడు, షేక్ మస్తాన్, కార్యవర్గ సభ్యులు: మోహన్‌రావు, సునీల్ కుమార్, పురుషోత్తం, ఈశ్వర్, పీటర్సన్