breaking news
Telangana Medical
-
TG: వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల్లో 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 స్టాఫ్ ఫార్మాసిస్ట్ పోస్టులున్నాయి.కాగా గత నెలలో 2,050 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ 2050 పోస్టులకు అదనంగా 272 పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో మొత్తంగా 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్టు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు అయింది. అర్హులైన వారు ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిచ్చింది.. నవంబర్ 17న ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. -
నకిలీ మందులను అరికట్టాలి
వినాయక్‌నగర్ : ఫార్మారంగంలో నకిలీ మందులను అరికట్టి, పేటెంట్ చట్టాన్ని సవరిస్తూ బహుళజాతి కంపెనీల పెట్టుబడులను నిలిపివేయాలని తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటీవ్స్ (సీఐటీయూ) యూని యన్ జిల్లా ఉపాధ్యక్షులు మోహన్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. సోమవారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నేషనల్ ప్రొటెస్ట్‌డే(నిరసన దినం)ను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ సుంకం అమ్మకందార్లపై కాకుండా ఉత్పత్తిధరలపై విధించాలన్నా రు. ప్రభుత్వ రంగ మందుల కంపెనీలను పునరుద్ధరించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలన్నారు.సమావేశంలో చేసిన తీర్మానాలు ఇలా ఉన్నాయి. భారతదేశ మందుల రంగంపై బహుళజాతి సంస్థల పెత్తనాన్ని నిరోధించాలి. పేటెంట్ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాన్ని విరమించాలి. మందుల ధరలు తగ్గించాలి. ప్రభుత్వ రంగ మందుల సంస్థల్ని, వ్యాక్సిన్ ప్లాంట్లని పునరుద్ధరించాలి. కేంద్ర ప్రభుత్వం బహుళజాతి సంస్థలకు మోకాలొడ్డే విధానాలు విడనాడాలి. కేంద్ర ప్రభుత్వం ప్రజలకనుకూలమైన మందుల పాలసీ, ఆరోగ్యపాలసీలు చేయాలి. ఉత్పత్తి ధరల మీద కాకుండా అమ్మకం ధర మీద సుంకం వేసే విధానాన్ని ఆపి వేయాలి. నిఘా పటిష్ట పరిచి తనిఖీ యంత్రాంగాన్ని బలోపేతం చేసి కల్తీమందులని అరికట్టాలి. తీర్మానాల కాపీని ప్రధానమంత్రి మోడీకి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సం పత్, జిల్లా సహాయ కార్యదర్శి నరేశ్, పవన్, శ్రీనివాస్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.