breaking news
Tejinder singh
-
గోమతి, తేజిందర్‌లకు స్వర్ణాలు
దోహా: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గోమతి మరిముత్తు... తనపై పెట్టుకున్న ఆశలను నిజం చేస్తూ తేజిందర్ పాల్ సింగ్ తూర్ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మెరిశారు. మహిళల 800 మీటర్ల రేసులో 30 ఏళ్ల గోమతి... పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో 24 ఏళ్ల తేజిందర్ స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. చెన్నైకు చెందిన గోమతి 800 మీటర్ల రేసును 2 నిమిషాల 02.70 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో పసిడి పతకం నెగ్గిన తేజిందర్ అదే జోరును ఇక్కడ కూడా కనబరిచి విజేతగా నిలిచాడు. పంజాబ్‌కు చెందిన తేజిందర్ ఇనుప గుండును 20.22 మీటర్ల దూరం విసిరి స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు. ఓవరాల్‌గా రెండో రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు, రజతం, రెండు కాంస్యాలతో కలిపి ఐదు పతకాలు వచ్చాయి. మహిళల 100 మీటర్ల రేసును భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ 11.44 సెకన్లలో ముగించి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల జావెలిన్ త్రోలో బరిలోకి దిగిన శివ్‌పాల్ సింగ్ రజతం దక్కించుకున్నాడు. శివ్‌పాల్ జావెలిన్‌ను 86.23 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో సరితాబెన్ గైక్వాడ్ 57.22 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో జాబిర్ 49.13 సెకన్లతో కాంస్య పతకాన్ని నెగ్గాడు. తొలి రోజు ఆలస్యంగా జరిగిన పురుషుల 10,000 మీటర్ల రేసులో మురళీ కుమార్ (28ని:38.34 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. -
‘మోదీకి అల్లుడు.. సోనియాకు కోడలు దొరికారు’
సాంకేతిక అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు కూడా ప్రచారం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నాయి. అధికార ప్రతినిధులు, బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు సైతం ఇతర పార్టీలపై బురద జల్లేందుకు సోషల్ మీడియాలో చౌకబారు విమర్శలకు దిగడం సర్వసాధారణమైపోయింది. తాజాగా కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్స్ చీఫ్ దివ్యా స్పందన, ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తేజీందర్ పాల్ సింగ్ బగ్గాలు పరస్పరం టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టుల ద్వారా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు. బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌కు సంబంధించిన పాత వీడియోను పోస్ట్ చేసిన దివ్యా స్పందన... ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి...‘మోదీజీ... మీకు అల్లుడు దొరికాడు’ అంటూ ట్వీట్ చేశారు. దివ్య ట్వీట్‌కు కౌంటర్‌గా తేజీందర్ పాల్ సింగ్... అలహాబాద్‌కు చెందిన ఒక గుర్తు తెలియని మహిళ వీడియోను పోస్ట్ చేసి.. ‘ సోనియా గాంధీ గారు మీ కోడలు దొరికారు’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియోల్లో ఏముందంటే... న్యూయార్క్ ట్రిప్‌లో ఉన్నరాఖీ సావంత్ తనకు కాబోయే భర్త దొరికాడంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘ఫ్రెండ్స్.. నాకు కాబోయే భర్త ఎవరా అంటూ అడుగుతూ ఉంటారు కదా. ఇదిగో ఇతడిని కలవండి. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. అతడితో పాటు న్యూయార్క్‌లో విహరిస్తున్నాను. నా ఈ వీడియోను ప్రధాని మోదీతో సహా భారతీయులంతా చూస్తూ ఉంటారు. బాలీవుడ్ నటిని అయిన కారణంగా మోదీ నాకు పెద్ద అభిమాని. ఇదిగోండి ఈయనే మీ అల్లుడు’ అంటూ రాఖీ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను జూలై 9న దివ్యా స్పందన తన ట్విటర్లో పోస్ట్ చేశారు. తేజీందర్ సింగ్ పోస్ట్ చేసిన వీడియోలో... అలహాబాద్‌కు చెందిన ఒక మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన భర్త అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పెళ్లి చేసుకుని భార్య హోదా కల్పిస్తానని రాహుల్ చెప్పారంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయన రోజూ తన కలలోకి వచ్చి ఎన్నో వాగ్దానాలు చేస్తారని, కానీ వాటిని నిలబెట్టుకోకుండా తనను మోసం చేశారంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. దళితులంటే ఎంతో ప్రేమ కలిగి ఉండే రాహుల్ ఓబీసీ మహిళనైన తనను పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా రాహుల్ గాంధీపై పలు సంచలన ఆరోపణలు చేశారు. “मोदी जी आपका दामाद मिल गया है” @narendramodi @rakhisawant7 pic.twitter.com/RhSRLSxpIR — Divya Spandana/Ramya (@divyaspandana) July 9, 2018 “सोनिया जी आपकी बहु मिल गई है” @RahulGandhi pic.twitter.com/DDKhmrm9RY — Tajinder Pal Singh Bagga (@TajinderBagga) July 9, 2018 -
తేజిందర్ సింగ్ అరెస్ట్‌కు రంగం సిద్ధం
న్యూఢిల్లీ: భారత మాజీ సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ తేజిందర్ సింగ్‌కు కోర్టులో చుక్కెదురైంది. టట్రా ట్రక్ కొనుగోలు కుంభకోణంలో తేజిందర్ సింగ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. టట్రా ట్రక్ కొనుగోలు ఒప్పందంలో మాజీ సైనికాధికారి జనరల్ వీకే సింగ్‌కు తేజిందర్ లంచ ఇవ్వచూపారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో తేజిందర్ సింగ్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.