breaking news
teachers fedaration
-
క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరించిన సీఎం జగన్
అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల క్యాలెండర్లను, డైరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీపీఆర్టీయూ(ఆంధ్రప్రదేశ్ ప్రొగ్రసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్) అధ్యక్షుడు ఎం కృష్ణయ్య, ఇతర సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
అసెంబ్లీలో టీచర్స్ సమస్యలపై చర్చిస్తాం: వైఎస్ జగన్
పులివెందుల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ వైఎస్ఆర్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి కలిశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. కాగా ఓబులపతితో పాటు వైఎస్ జగన్ను కలిసినవారిలో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఉన్నారు. జీవో 53 ద్వారా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సక్సెస్ స్కూళ్లను ఎత్తివేసేలా ప్రభుత్వం కుట్ర జరుగుతోందని టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చిస్తామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.