breaking news
Teachers dharna
-
వేతనాలు చెల్లించండి మహాప్రభో.!
తిరుపతి అర్బన్, పార్వతీపురం టౌన్, ఆరిలోవ(విశాఖ): తమకు జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. శనివారం ఆయా కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాల విషయంలో కేడర్ స్ట్రెంగ్త్ వివరాలు, పొజిషన్ ఐడీలు లేకపోవడంతో జూన్, జూలై జీతాలకు ఆటంకం ఏర్పడిందని ఆవేదన చెందారు.యుద్ధ ప్రాతిపదికన బదిలీలు చేసిన ప్రభుత్వానికి జీతాన్ని చెల్లించడం కష్టమేమీ కాదన్నారు. ఈ నెలాఖరులోగా సమస్యను పరిష్కరించాలని, లేదంటే ఉపాధ్యాయులు న్యాయపోరాటం చేయాల్సి వస్తుందని, డీఈఓ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయా కలెక్టరేట్లు, డీఈఓ కార్యాలయాల్లో వినతి పత్రాలను సమర్పించారు. యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. -
గిరిజన టీచర్లపై కత్తిగట్టిన సర్కారు
సాక్షి, అమరావతి: బతుకుపై భరోసా కోసం సమ్మెబాట పట్టిన గిరిజన గురుకుల విద్యాలయాల్లోని ఔట్ సోర్సింగ్ టీచర్లపై కూటమి సర్కారు కత్తిగట్టింది. వారి సమస్యను అర్థం చేసుకుని సకాలంలో పరిష్కరించాల్నిన ప్రభుత్వం... కక్ష సాధింపునకు పాల్పడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దీంతో గిరిజన టీచర్లు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. వారికి మద్దతుగా విద్యార్థులు సైతం ఆందోళనబాట పట్టారు. డీఎస్సీ నుంచి గురుకులాల్లోని ఔట్ సోర్సింగ్ పోస్టులను మినహాయించాలని, తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ (సీఆరీ్ట)గా పరిగణించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మరికొన్ని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 15 రోజులుగా రాష్ట్రంలోని 199 గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన 1,656 మంది ఔట్ సోర్సింగ్ గిరిజన టీచర్లు సమ్మె చేస్తున్నారు.వారితో చర్చలు జరిపి సానుకూల పరిష్కారమార్గం చూపించి సమ్మెను విరమింపజేయాల్నిన ప్రభుత్వం... ఇందుకు విరుద్ధంగా మరింత రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తోంది. గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వర్తించాలని 371 గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన 550 మందికిపైగా టీచర్లకు శనివారం తాత్కాలిక(డిప్యూటేషన్) బాధ్యతలు అప్పగించింది. వారు వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే 15 రోజులుగా గిరిజన సంక్షేమ గురుకులాల్లో బోధన నిలిచిపోయింది. తాత్కాలిక సర్దుబాటు వల్ల సుమారు 51వేల మంది ఉన్న గిరిజన గురుకులాల్లో పెద్దగా బోధన జరిగే అవకాశం లేదు. అదేసమయంలో ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు డిప్యూటేషన్పై వెళ్లడంతో అక్కడి విద్యార్థులకు బోధన సక్రమంగా జరిగే అవకాశం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల గిరిజన సంక్షేమ గురుకులాలతోపాటు ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.అమలుకు నోచుకోని హామీలు...సమ్మె చేస్తున్న గిరిజన గురుకుల విద్యాలయాల్లోని ఔట్ సోర్సింగ్ టీచర్లతో గతంలో ఒకసారి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చర్యలు జరిపి పలు హామీలు ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఓఎస్డీ వరప్రసాద్ వచ్చి కొన్ని హామీలు ఇచ్చారు. అవేమీ అమల్లోకి రాకపోవడంతో ఔట్ సోర్సింగ్ టీచర్ల సమ్మె కొనసాగుతోంది. పాడేరు ఐటీడీఏ వద్ద వర్షంలోను రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. పార్వతీపురం ఐటీడీఏ వద్ద గిరిజన ఔట్ సోర్సింగ్ టీచర్లు భిక్షాటన చేసి నిరసన తెలిపారు.విజయవాడ ధర్నా చౌక్లోను ధర్నాను కొనసాగించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జాతీయ, రాష్ట్ర ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఔట్ సోర్సింగ్ టీచర్లకు మద్దతుగా పార్వతీపురం మన్యం జిల్లాలోని పి.కోనవలస గ్రామంలో శనివారం విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘తమ బడిలో ఉండే ఔట్ సోర్సింగ్ టీచర్లే తమకు కావాలి...’ అని ప్రభుత్వాన్ని విద్యార్థులు డిమాండ్ చేశారు. -
కడియం వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా
హత్నూర: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తాలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే మహిళా టీచర్లు ఇంట్లో వంట వండుకోవడం, యూనియన్లకు డైరీలు పట్టుకుని తిరగడం తప్ప ఏమీ చేయటం లేదని కడియం మంగళవారం ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. దీనికి నిరసనగా ఉపాధ్యాయులు దౌల్తాబాద్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. తెలంగాణ తల్లి విగ్రహానికి విజ్ఞాపన పత్రం సమర్పించారు. వెంటనే కడియం శ్రీహరి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
పోలవరం ముంపు మండలాల ఉపాధ్యాయుల ధర్నా
ఖమ్మం (భద్రాచలం) : తెలంగాణ స్థానికత కలిగిన ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా జాప్యం ప్రదర్శిస్తోందని ముంపు మండలాల ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పోలవరం ఏడు ముంపు మండలాల్లోని ఉపాధ్యాయులు గురువారం విధులకు గైర్హాజరై మండల విద్యాధికారి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వం కాలాయాపన చేయడంతో గిరిజన విద్యార్థులు నష్టపోయే అవకాశముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 19వ తేదీన ఖమ్మం జిల్లా డీఈఓ ఆఫీస్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముంపు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.