breaking news
TB board meeting
-
ఆగని కర్ణాటక జల దోపిడీ
కర్నూలు సిటీ: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం. దీని నుంచి జల చౌర్యానికి అలవాటు పడిన కర్ణాటక ఇబ్బడిముబ్బడిగా ఎత్తిపోతల పథకాలు, భారీ మోటార్లతో నీటి దోపిడీకి పాల్పడుతోంది. ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టుగా ఉన్నటువంటి తుంగభద్ర (టీబీ) డ్యాం నీటిని కేటాయించిన మేరకు అందించేందుకు బోర్డున్నా కూడా జల దోపిడీని అరికట్టలేకపోతోంది. ప్రాజెక్టు తమ భూభాగంలో ఉందనే ధీమాతో డ్యాం ఎగువన, దిగువన, నది పరీవాహక ప్రాంతాల్లో నుంచి ఇష్టానుసారంగా కర్ణాటక నీటిని దోపిడీ చేస్తోంది. ఈ దోపిడీపై గతేడాది అక్టోబర్ 22న టీబీ బోర్డు సమావేశంలో ఉమ్మడిగా తనిఖీలు చేయాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్లు చేసిన సూచన మేరకు జాయింట్ కమిటీ ఏర్పాటుచేశారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2 వరకు జాయింట్ కమిటీ తనిఖీలు నిర్వహించింది. ఈ కమిటీ విచారణలో కన్నడిగుల గుట్టురట్టు అయ్యింది. దీంతో కమిటీ ఇచ్చిన నివేదికను ఈ నెల 29న బెంగళూరులో జరుగనున్న టీబీ బోర్డు సమావేశంలో ప్రధాన అజెండాగా ప్రవేశ పెట్టనున్నారు. సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. నిర్మాణంలో ఉన్న చిలవరబండి లిఫ్ట్ అక్రమంగా లిఫ్ట్లు ఏర్పాటు తుంగభద్ర డ్యాం నీటిని దొంగచాటుగా కాజేసేందుకు టీబీ డ్యాం కుడి, ఎడమ వైపున మొత్తం 50 ఎత్తిపోతల పథకాలు ఉన్నట్లు జాయింట్ కమిటీ గుర్తించింది. ఇందులో కుడి వైపు 28, ఎడమ వైపు 22 ఉన్నాయి. -
టీబీ బోర్డు సమావేశం వాయిదా
అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర బోర్డు సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నెల 14న సమావేశం నిర్వహిస్తున్నట్లు తొలుత ఉత్తర్వులు వెలువరించారు. అయితే.. హెచ్చెల్సీకి నీటి విడుదలలో అన్యాయం జరుగుతోందనే ఉద్దేశంతో తాము సమావేశానికి హాజరుకాలేమని ఎస్ఈ శేషగిరిరావు లేఖ రాశారు. దీంతో సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని టీబీ బోర్డు అధికారులు తెలిపారు.