ఆగని కర్ణాటక జల దోపిడీ

TB board meeting in Bangalore 28th September - Sakshi

తుంగభద్ర డ్యాం ఎగువన ఇబ్బడిముబ్బడిగా లిఫ్ట్‌లు 

మూడు రాష్ట్రాల ఇంజనీర్ల తనిఖీల్లో బయటపడ్డ కన్నడిగుల జల చౌర్యం 

2 టీఎంసీలకే అనుమతులున్నా 9.38 టీఎంసీల వినియోగం  

నేడు బెంగళూరులో టీబీ బోర్డు సమావేశం 

కర్నూలు సిటీ: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం. దీని నుంచి జల చౌర్యానికి అలవాటు పడిన కర్ణాటక ఇబ్బడిముబ్బడిగా ఎత్తిపోతల పథకాలు, భారీ మోటార్లతో నీటి దోపిడీకి పాల్పడుతోంది. ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టుగా ఉన్నటువంటి తుంగభద్ర (టీబీ) డ్యాం నీటిని కేటాయించిన మేరకు అందించేందుకు బోర్డున్నా కూడా జల దోపిడీని అరికట్టలేకపోతోంది. ప్రాజెక్టు తమ భూభాగంలో ఉందనే ధీమాతో డ్యాం ఎగువన, దిగువన, నది పరీవాహక ప్రాంతాల్లో నుంచి ఇష్టానుసారంగా కర్ణాటక నీటిని దోపిడీ చేస్తోంది.

ఈ దోపిడీపై గతేడాది అక్టోబర్‌ 22న టీబీ బోర్డు సమావేశంలో ఉమ్మడిగా తనిఖీలు చేయాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్లు చేసిన సూచన మేరకు జాయింట్‌ కమిటీ ఏర్పాటుచేశారు. గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2 వరకు జాయింట్‌ కమిటీ తనిఖీలు నిర్వహించింది. ఈ కమిటీ విచారణలో కన్నడిగుల గుట్టురట్టు అయ్యింది. దీంతో కమిటీ ఇచ్చిన నివేదికను ఈ నెల 29న బెంగళూరులో జరుగనున్న టీబీ బోర్డు సమావేశంలో ప్రధాన అజెండాగా ప్రవేశ పెట్టనున్నారు. సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.  
నిర్మాణంలో ఉన్న చిలవరబండి లిఫ్ట్‌  

అక్రమంగా లిఫ్ట్‌లు ఏర్పాటు 
తుంగభద్ర డ్యాం నీటిని దొంగచాటుగా కాజేసేందుకు టీబీ డ్యాం కుడి, ఎడమ వైపున మొత్తం 50 ఎత్తిపోతల పథకాలు ఉన్నట్లు జాయింట్‌ కమిటీ గుర్తించింది. ఇందులో కుడి వైపు 28, ఎడమ వైపు 22 ఉన్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top