breaking news
tax-free
-
‘కృష్ణావతారం’పై సీఎం యోగి సంచలన ప్రకటన
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సనాతన ధర్మం, కృష్ణ తత్వంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'కృష్ణావతారం పార్ట్ 1: ది హార్ట్ (హృదయం)' చిత్రానికి రాష్ట్రవ్యాప్తంగా పన్ను మినహాయింపు (ట్యాక్స్ ఫ్రీ) ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల లోక్ భవన్ ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక ప్రదర్శనను వీక్షించిన అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని వెలువరించారు.ఆధ్యాత్మికతతో మారుమోగిన లోక్ భవన్ఆదివారం రాష్ట్ర కేబినెట్ విస్తరణ అనంతరం ఈ ప్రత్యేక షోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. సినిమా ప్రదర్శన సమయంలో ఆడిటోరియం మొత్తం ‘కృష్ణ-కృష్ణ’, ‘రాధే-రాధే’ నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ అద్భుతమైన చిత్రాన్ని రూపొందించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను సీఎం యోగి ఆదిత్యనాథ్ వేదికపై ప్రత్యేకంగా అభినందించారు.మానవ కోణంలో శ్రీకృష్ణుడి జననంశ్రీకృష్ణుడి జీవితాన్ని ఒక అద్భుతమైన మానవ కోణంలో ఈ సినిమా ఆవిష్కరించిందని సీఎం యోగి కొనియాడారు. ద్వాపర యుగ పరిస్థితులను, సనాతన సంస్కృతిని, భారతీయ సంప్రదాయాలను ఈ చిత్రంలో అత్యంత భారీ స్థాయిలో చూపించారని ప్రశంసించారు. రాధ, రుక్మిణి, సత్యభామల కథలను కూడా ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారని, పిల్లలు, యువతకు మన వారసత్వం తెలిసేలా ప్రతి జిల్లాలో ప్రత్యేక షోలు ప్రదర్శించాలని సమాచార శాఖను ఆయన ఆదేశించారు.గవర్నర్ మనవరాలి సందడిఈ సినిమాలో సత్యభామ పాత్రలో నటించిన నటి సంస్కృతి మరెవరో కాదు.. స్వయానా యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మనవరాలే.. ఈ విషయం గవర్నర్కు ఎంతో గర్వకారణమని సీఎం యోగి పేర్కొన్నారు. హార్దిక్ గజ్జర్ దర్శకత్వంలో సిద్ధార్థ్ గుప్తా, సంస్కృతి, జాకీ ష్రాఫ్, అశుతోష్ రాణా తదితర ఉద్దండులు నటించిన ఈ చిత్రం మే 7న హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. మన సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని గవర్నర్ ఆనందీబెన్ ఆకాంక్షించారు. -
‘దంగల్’ కు పన్ను మినహాయింపు
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి తన విలక్షణతను ప్రూవ్ చేసుకున్న చిత్రం ‘దంగల్’ . విమర్శకులు సైతం పొగడ్తలతో ముంచెత్తడంతో దంగల్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ చిత్రానికి యూపీలో వినోదపు పన్నును మినహాయించిన సంగతి తెలిసిందే. తాజాగా హర్యానా ప్రభుత్వం కూడా ఈ చిత్రానికి ట్యాక్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సినియా ‘బేటీ బచావో- బేటీ పడావో’ కార్యక్రమానికి మరింత శక్తిని ఇచ్చిందని, అందుకే వినోదపు పన్నును మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు హర్యనా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ అన్నారు. కాగా హర్యానాలోని భివానీ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహవీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా దంగల్ తెరకెక్కింది. ఈ చిత్రంలో సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, అపర్శక్తి ఖుర్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది.


