breaking news
Tarot Card Readers
-
‘జైలులో జాతకాలు చెప్పడం నేర్చుకుంటుంది’
న్యూఢిల్లీ : మాజీ గవర్నర్ ఎన్డీ తివారి తనయుడు రోహిత్ హత్య కేసులో అతని భార్య అపూర్వ శుక్లా ప్రస్తుతం తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆస్తి కోసం తానే భర్తను చంపినట్లు అపూర్వ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే జైలులో ఆమె ప్రవర్తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు జైలు సిబ్బంది. చేసిన నేరం పట్ల ఆమె ఏ మాత్రం పశ్చత్తాపం వ్యక్తం చేయడం లేదని తెలిపారు. అంతేకాక ప్రస్తుతం ఆమె జాతకాలు చెప్పడం నేర్చుకుంటుందన్నారు. జైలులో వారానికి రెండు సార్లు మంగళవారం, గురువారం రోజుకు రెండు గంటల పాటు టారోట్ కార్డ్ రీడింగ్(జాతకాల గురించి) క్లాసులు జరుగుతాయని తెలిపారు అధికారులు. అపూర్వ ప్రత్యేక శ్రద్ధతో ఈ కోర్సును నేర్చుకుంటుందన్నారు జైలు అధికారులు. మొదటి వరుసలో కూర్చుని.. ఎంతో ఏకాగ్రతతో పాఠాలు వింటుందని తెలిపారు. అంతేకాక ఈ కోర్సు పట్ల ఆమె ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారని ప్రశంసించారు. గతంలో కోర్టు విచారణ సందర్భంగా ఓ క్లాస్ మిస్సయ్యిందని.. అందుకు ఆమె ఎంతో బాధపడిందని తెలిపారు అధికారులు. -
టారో కార్డు రీడింగ్‌కు పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: చిలుక జోస్యం అందరికీ తెలిసిందే. చిలుక ఎంపిక చేసిన కాగితం ముక్కను చదివి మన జాతకం చెబుతుంటారు. ఆ కాగితం ముక్కలను మనమే ఎంపిక చేసుకుంటే.. వాటిని చదివి మన భవిష్యత్తును చెప్పగలిగేవారు కొందరుంటారు. వారే.. టారో కార్డ్ రీడర్స్. ఈ కార్డ్ రీడింగ్ అనేది 15వ శతాబ్దంలో యూరప్‌లో పుట్టింది. ఇప్పుడిప్పుడే మనదేశంలోనూ ఆదరణ పొందుతోంది. తమ సమస్యలకు పరిష్కార మార్గం కోసం, జీవితంలో సుఖశాంతుల కోసం టారో కార్డ్ రీడర్లను ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. టారో కార్డ్ రీడింగ్ అంటే జ్యోతిష్యం కాదు. జ్యోతిష్యులు పుట్టిన తేది, జన్మ నక్షత్రం, గ్రహగతులు, రాశులను బట్టి భవిష్యత్తును అంచనా వేస్తుంటారు. టారో రీడర్లు మాత్రం క్లయింట్లు ఎంచుకున్న కార్డులను చదివి వారి భూత, వర్తమాన, భవిష్యత్తు గురించి చెబుతుంటారు. ఇందులో 78 కార్డులు ఉంటాయి. ఒక్కో కార్డుకు 30 విభిన్నమైన అర్థాలు ఉంటాయి. 6, 12, 18.. ఇలా నిర్దేశిత సంఖ్యలో కార్డులను ఎంచుకోవాల్సి ఉంటుంది. క్లయింట్లు ఎంపిక చేసుకున్న కార్డులను రీడర్లు చదివి.. అందులోని సందేశాన్ని వివరిస్తారు. క్లయింట్ ఎదుర్కొంటున్న సమస్యను లోతుగా అర్థం చేసుకొన్ని, కార్డుల్లోని సందేశాన్ని ఈ సమస్యకు అన్వయించి, పరిష్కార మార్గం చూపుతారు. దీనిపై దేశ రాజధాని ఢిల్లీతోపాటు మిగతా నగరాల ప్రజలకు కూడా ఆసక్తి చూపుతున్నారు. టారో కార్డు రీడింగ్ తమ సమస్యకు పరిష్కారం చూపుతుందని విశ్వసిస్తున్నారు. మంచి సైకాలజిస్టులు.. టారో కార్డ్ రీడర్లకు సైకాలజీపై మంచి పట్టు ఉంటుంది. మంచి కమ్యూనికేషన్, కౌన్సెలింగ్ స్కిల్స్‌తో క్లయింటు సమస్యను అర్థం చేసుకునే నైపుణ్యం ఉంటుంది. నైతిక విలువలకు కట్టుబడి పనిచేసేవారు ఇందులో ఎక్కువగా కొనసాగుతున్నారు. ఏదో ఆషామాషీగా చెప్పేయడం కాకుండా రకరకాల మనస్తత్వాలు కలిగినవారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే వివరాలను శాస్త్రీయంగా తెలుసుకుంటారు. అందుకు సంబంధించిన పుస్తకాలను తిరగేసి, తమ వద్దకు వచ్చే వారికి సలహాలు, సూచనలు ఇస్తారు. టారో కార్డు రీడింగ్‌పై సదస్సులు.. టారో కార్డు రీడింగ్‌పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. టారో కార్డు అనలిస్టులుగా కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునేవారికి కూడా ఈ సదస్సులు, సమావేశాలు ఎంతగానో ఉపయోగపడుతున్నారు. ప్రజల్లో ఒక్కొక్కరి ఒక్కో రకమైన సమస్య ఉంటుంది. అందుకే ఈ వృత్తి ఉత్సాహంగా ఉంటుంది. విసుగుదల రాదు. క్లయింట్లలో రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఉంటారు. వారిని మెప్పించే నేర్పు ఉండాలి. అందుకే సమస్య పరిష్కారం కోసం దీనిని ఆశ్రయించేవారే కాకుండా కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునేవారు కూడా టారో బాట పడుతున్నారు.