breaking news
Tamil Nadu power Manufacturing
-
PNB SCAM: బ్యాంకులకు మళ్లీ కన్నం.. ఈసారి రూ.2060 కోట్ల మోసం !
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) వరుస దెబ్బలను ఎదుర్కొంటోంది. రూ.2,060 కోట్ల భారీ రుణ ఖాతాను మోసపూరితమైనదిగా గుర్తించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తమిళనాడు పవర్ ఖాతాను నిరర్థక రుణ ఖాతా (ఎన్పీఏ)గా ప్రకటించింది. ఢిల్లీ జోనల్ ఆఫీస్ పరిధిలోని ‘ఎక్స్ట్రా లార్జ్ కార్పొరేట్ బ్రాంచ్’ పరిధిలో ఇది జరిగినట్టు తెలిపింది. ఈ ఖాతాకు సంబంధించి ఆర్బీఐకి రిపోర్ట్ చేసినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఆర్బీఐ నిబంధనలను అనుసరించి ఈ ఖాతాకు రూ.824 కోట్ల కేటాయింపులు చేసినట్టు పేర్కొంది. పీఎన్బీ కంటే ముందే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు.. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తమిళనాడు పవర్ ఖాతాను మోసపూరితమైనదిగా ప్రకటించడం గమనార్హం. రూ.148 కోట్ల రుణాన్ని ఎన్పీఏగా ప్రకటించి ఆర్బీఐకి సమాచారం ఇచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థే (ఎస్పీవీ) ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తమిళనాడు పవర్. తమిళనాడులోని కడలోర్‌లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల అమలుకు దీన్ని ఏర్పాటు చేసింది. మూడు విభాగాలు... నిర్ణీత కాలవ్యవధిలోపు రుణ చెల్లింపులు రాని ఖాతాలను ఎన్పీఏగా గుర్తించి ఆర్బీఐకి తెలియజేయాల్సి ఉంటుంది. ఎస్ఎంఏ–0 విభాగం కింద ఖాతాలను డిఫాల్ట్ కేసుగా పరిణిస్తారు. 30రోజులుగా అసలు, వడ్డీ చెల్లింపులు చేయని ఖాతాలు ఈ విభాగం కిందకు వస్తాయి. బకాయి మొత్తాన్ని చెల్లించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఎంఎస్ఏ–1 విభాగం కింద 31–60 రోజులుగా చెల్లింపులు చేయని (పూర్తిగా/పాక్షికంగా) ఖాతాలను చేరుస్తారు. దివాలా, బ్యాంక్రప్టసీ కోడ్ కింద పరిష్కార చర్యలను బ్యాంకులు చేపడతాయి. ఎస్ఎంఏ–3 కింద 61–90 రోజులుగా చెల్లింపులు చేయని ఖాతాలు వస్తాయి. ఈ ఖాతాలను బ్యాంకులు ఎన్సీఎల్టీ ముందుకు తీసుకెళతాయి. -
తమిళనాడుకు మన ‘నల్ల బంగారం’
- టాన్ జెన్కోతో 10 లక్షల టన్నుల బొగ్గు ఒప్పందం - వచ్చే ఏడాది 30 లక్షల టన్నుల కొనుగోళ్లకు టాన్‌జెన్‌కో సంసిద్ధత సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 4 నెలల కాలంలో సిం గరేణి బొగ్గు గనుల సంస్థ నుంచి 10 లక్షల టన్నుల బొగ్గును కొనుగోలు చేసేందుకు తమిళనాడు విద్యుద్పుత్తి సంస్థ(టాన్ జెన్కో) ముందుకు వచ్చింది. సింగరేణి సంస్థ సీఎండీ ఇ.శ్రీధర్ సమక్షంలో టాన్ జెన్కో సీఈ సత్యశీలన్, సింగరేణి జీఎం బి.కిషన్‌రావు బుధవారం ఇక్కడ సింగరేణి భవన్లో ఒప్పం దపత్రాలపై సంతకాలు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలు చేసేందుకు తమిళనాడు జెన్కో ఉన్నతాధికారులు సింగరేణి యాజమాన్యం తో చర్చలు జరిపారు. ఇప్పటి వరకు తమిళ నాడులోని సిమెంట్, సిరామిక్స్ వంటి చిన్న పరిశ్రమలకు సింగరేణి కొద్ది మొత్తంలో బొగ్గు అమ్ముతున్నప్పటికీ ప్రభుత్వ అధీనంలోని విద్యుత్ రంగానికి భారీ మొత్తంలో బొగ్గును విక్రరుుంచడం ఇదే తొలిసారి. ఈ ఒప్పందం వల్ల రెండు సం స్థలకు ప్రయోజనం చేకూరనుం దని సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సిం గరేణికి ఈ ఏడాది నిర్దిష్టమైన మార్కెట్ లభించడం ఓ శుభ పరి ణామం కాగా, ఈ ఒప్పం దాల వల్ల సగటున తమిళనాడు జెన్ కోకు టన్నుకు రూ.1000 వరకు ఆదా కానుందని పేర్కొంది. ఒప్పందం ప్రకారం మణు గూరు, భూపాలపల్లి గనుల నుం చి తమిళనాడుకు బొగ్గు సరఫరా జరగ నుం ది. ఈ బొగ్గును తమిళనాడులోని మెట్టూర్ 1400 మెగావాట్ల పవర్ ప్లాంటులో విద్యుదు త్పత్తి కోసం వినియోగించనున్నారు. సింగ రేణి బొగ్గు వల్ల తమ సంస్థకు బొగ్గు రవాణా ఖర్చులు తగ్గుతాయని, ధర కూడా తక్కువగా ఉందని టాన్‌జెన్‌కో సీఈ సత్య శీలన్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుదూర ప్రాం తాల్లోని కోల్ ఇండియా కంపెనీల నుంచి, విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుం టున్నామని తెలిపారు. వచ్చేఏడాది 30 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాజాగా టాన్ జెన్కోతో ఒప్పందం పాటు కర్ణాటకలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు 7 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేసేందుకు ఇప్పటికే సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్టీపీసీ, తెలంగాణ జెన్కో కొత్త ప్రాజెక్టులకు సింగరేణి బొగ్గు కేటారుుంపులు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది 70 మిలియన్ టన్నుల బొగ్గు విక్రరుుంచే అవకా శాలున్నా యని అధికారులు అంచనా వేస్తున్నారు. టాన్ జెన్కోతో జరిగిన ఒప్పందంలో సింగరేణి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(కోల్ మూమెంట్) ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.