breaking news
talent show
-
ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..!
పోటీలు అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది యువతే.. అండర్ 14, అండర్ 17.. ఇలా పలు విభాగాల్లో యువతకు పోటీలు నిర్వహిస్తుండడం తెలిసిందే. అయితే మరి వయసు మళ్లిన వారి పరిస్థితి ఏంటి? వారికేమీ ఆటలు ఉండవా? వారిలో ఎలాంటి ప్రతిభా ఉండదా? అంటే ఉంటుందనే చెబుతున్నారు ముంబయికి చెందిన ‘ఖ్యాల్’ నిర్వాహకులు. ఈ విషయం మనలో చాలా మందికి తెలిసినా పెద్దగా పట్టించుకోము.. సరిగ్గా దీని కోసమే ఏర్పాటైన వేదికే ఖ్యాల్. అప్పటి వరకూ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగల బాధ్యతలతో తలమునకలై.. వయసు మళ్లిన తర్వాత తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకే ఖ్యాల్ ఏర్పాటు చేశారు. ఖ్యాల్ అంటే తమలోని సృజనాత్మకతను స్వేచ్ఛగా ప్రదర్శించడానికి, మెరుగుపరచడానికి కల్పించే అవకాశం.. అంటున్నారు నిర్వాహకులు.. వయసు మళ్లిన వారు అంటే చాలా మందికి ఓ చులకన భావం.. వారు ఏమీ చేయలేరు.. సాధించలేరు.. మరి అలాంటి భావాన్ని చెరిపేశారు కొందరు ప్రముఖులు.. సాధించాలనే తపన ఉంటే వయసుతో పనేంటి అను నిరూపించారు. ‘హార్లాండ్ సాండర్స్ 62 సంవత్సరాల వయసులో కేఎఫ్‌సీని ప్రారంభించారు. ఫల్గుణి నాయర్ 49 సంవత్సరాల వయసులో నైకాను స్థాపించారు. హెన్రీ ఫోర్డ్ 45 సంవత్సరాల వయసులో మొదటి ఫోర్డ్ మోటార్ కారును ప్రజలకు పరిచయం చేశారు..’ ఇవన్నీ కథలు కావు విజయాలకు ప్రేరకాలు అంటారు ఖ్యాల్ నిర్వాహకులు హేమాన్షు జైన్, ప్రీతిష్ నెల్లెరి. యువత కోసమేనా కాంటెస్ట్స్?ఏ పోటీ చూసినా అండర్ 25, అండర్ 30 ఇలా యువత, మధ్యవయసు వారికోసమే ఉంటున్నాయి. కానీ సిసలైన జీవితం 50 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది, ఆర్థిక స్థిరత్వం, జ్ఞానం, అభిరుచిని ఆస్వాదించే స్వేచ్ఛ అన్నీ ఉండేది అప్పుడే. వర్గీకరించబడేది వయసు మాత్రమే.. టాలెంట్ కాదు.. అందుకే ఖ్యాల్ 50 అబోవ్ 50ని ప్రారంభించింది. ఇందులో సింగర్ ఆఫ్ ది ఇయర్, చెఫ్ ఆఫ్ ది ఇయర్, మాస్టర్ గార్డెనర్ ఆఫ్ ది ఇయర్, పొయెట్ ఆఫ్ ది ఇయర్, క్రాస్ వర్డ్ చాంపియన్ ఆఫ్ ది ఇయర్... ఇలా ఏ రకమైన టాలెంట్ ఉన్నా సరే పాల్గొనేలా రూపొందించాం. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఈ పోటీ ప్రపంచానికి గుర్తు చేయనుంది.50 విభాగాల్లో 50మంది విజేతలు..వయసు 50 ఏళ్లు దాటిన దగ్గర నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్లోనో, ఆధ్యాతి్మక యాత్రల షెడ్యూల్ ఖరారులోనో బిజీగా ఉండే వారి ఆలోచనల్ని సమూలంగా మార్చడమే తమ ధ్యేయం అంటున్నారు ఈ కాంటెస్ట్స్ నిర్వాహకులు. ఫిఫ్టీ ప్లస్ వయసు వారి కోసం 50 అబోవ్ 50 పేరుతో ఏకంగా 50 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ దీనికి సంబంధించిన ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా గత నెలాఖరున నగరంలోనూ ఆడిషన్స్ నిర్వహించిన సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే..ఇకిగై.. భావనకు అనుగుణంగా..జపనీయుల దీర్ఘకాల, సంతోషకర జీవనానికి దోహదం చేస్తున్న ‘ఇకిగై’ కాన్సెప్ట్‌కు అనుగుణంగా రూపుదిద్దుకుంది. ‘ఉద్యోగ విరమణ తర్వాత జీవితం పూర్తిగా కొత్తగా నిర్మించడం’ దీని లక్ష్యం. గత 2020లో స్థాపించిన మా ఖ్యాల్, సీనియర్ సిటిజన్లకు సబ్‌స్కిప్షన్ ప్రాతిపదికన సేవలను అందిస్తుంది. వారి శారీరక, మానసిక, భావోద్వేగ సామాజిక శ్రేయస్సును పరిరక్షిస్తుంది. మా యాప్‌కు మూడు మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ‘సీనియర్లు వివిధ రకాల కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇష్టపడే ధోరణిని గమనించాం, ప్రోత్సహిస్తున్నాం, అంతిమంగా విభిన్న ఆసక్తులు కలిగిన సమూహాలను సృష్టించాలన్నదే మా తాపత్రయం.. అదే నేటి ఆడిషన్స్‌కు దారితీసింది. ఈవెంట్ జరిగే తీరిది.. 50 అబోవ్ 50 కోసం ఈ స్టార్టప్ ఆన్‌న్‌లైన్ వీడియో ఆడిషన్న్లను కూడా నిర్వహిస్తోంది. మే 1 నుంచి ప్రారంభమయ్యే పోటీల్లో హైదరాబాద్ అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె, లక్నో, జైపూర్, కొచ్చి, ఇండోర్ వంటి 20 నగరాలు పాల్గొంటాయి. ఇందులో భాగంగా పోటీదారులను ఒకచోట చేర్చడానికి కారి్నవాల్ నిర్వహిస్తారు. సరదా నిండిన కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం వ్యక్తిగత ఆడిషన్స్ సైతం ఉంటాయి. వడపోత తర్వాత, ప్రతి విభాగం నుంచి టాప్–10 ఫైనలిస్టులను సంబంధిత కేటగిరీ నిపుణులు షార్ట్‌లిస్ట్ చేస్తారు. చివరకు ప్రతి కేటగిరీ కింద బెస్ట్‌ని ఎంపిక చేయడానికి పబ్లిక్ ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ జ్యూరీ సభ్యుల్లో ప్రముఖ ఇంద్రజాలికుడు నకుల్ షెనాయ్, రచయిత్రి గీతా రామానుజం, విజువల్ ఆర్టిస్ట్ సెల్వప్రకాష్ లక్ష్మణన్, కవి–ఎడిటర్ వినితా అగర్వాల్, కర్ణాటక న్యూమిస్మాటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర మరుధర్ తదితరులు ఉన్నారు. ఖ్యాల్ విజేతలకు మొత్తం కలిపి రూ.1 కోటి నగదు బహుమతిని అందజేస్తారు. గ్రాండ్ ఫినాలే నవంబర్‌లో ముంబైలోని నెస్కో మైదానంలో జరుగుతుంది.నగరంలో ముగిసిన తొలి దశ ఆడిషన్స్.. నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఇటీవలే ఈ పోటీ కోసం ఆడిషన్స్ నిర్వహించారు. పదుల సంఖ్యలో హాజరైన అభ్యర్థులు తమ ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా పరీక్షించారు. వీరిలో ఎంపికైన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (చదవండి: మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..! ఓ ఫ్యాషన్ డిజైనర్ స్టోరీ) -
బ్రిటన్ గాట్ టాలెంట్ పోటీలో రన్నరప్‌గా అసోం చిన్నారి
గువాహటి: అసోంకు చెందిన తొమ్మిదేళ్ల బినితా చెత్రీ ప్రఖ్యాత ‘బ్రిటన్ గాట్ టాలెంట్ (బీజీటీ)’ రియాలిటీ డ్యాన్స్ పోటీల్లో రెండో రన్నరప్‌గా నిలిచింది. కొండప్రాంత కర్బి అంగ్లాంగ్ జిల్లాలోని ఓ కుగ్రామంలో నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ బాలిక ప్రపంచ వేదికపై సత్తా చాటడం విశేషం. ఈమె ప్రతిభను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మెచ్చుకున్నారు. ఆమె ప్రదర్శన బ్రహ్మపుత్ర నుంచి థేమ్స్ నది వరకు అందరినీ మంత్రముగ్ధులను చేసిందని, తమను గర్వపడేలా చేసిందని ప్రశంసలు కురిపించారు. శనివారం జరిగిన ఫైనల్స్‌లో బ్రిటిష్ మెజీíÙయన్ హ్యారీ మౌల్డింగ్ విజేతగా నిలిచాడు. ఎల్ఈడీ డ్యాన్స్ గ్రూప్ రెండో స్థానంలో నిలిచింది. బీజీటీ ఫైనల్స్ చేరిన తొలి భారతీయురాలు బినితాయేనని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. బినితా స్వగ్రామం పేరు టల్బాలిజన్. తండ్రి అమర్ చెత్రీ ఊళ్లో చిన్న కోళ్లఫారం నడుపుతుంటారు. బినితా ప్రిపరేషన్ కోసం కర్బి అంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ రూ.5 లక్షలు సాయంగా అందజేసింది. -
ఈ చిన్నారి పేరు దేశమంతా మారుమోగిపోతోంది!
బినితా చెట్రీ.. వయసు ఎనిమిదేళ్లు. కాని ఇవాళ దేశమంతా పేరు మారుమోగిపోతోంది. అందుకు కారణం ‘బ్రిటన్స్ గాట్ టాలెంట్’ షో (Britain's Got Talent). ప్రపంచవ్యాప్తంగా ఉండే రకరకాల టాలెంట్‌ను ఆహ్వానించి గుర్తింపునిచ్చే ఈ షోలో పాల్గొనాలని ఎందరికో కల. అలాంటి షోలో బినితా తన డ్యాన్స్‌తో అందర్నీ స్టన్ చేసింది. చురుకైన స్టెప్స్‌తో, చిరుతలాంటి మెరుపుతో బినితా చేసిన డ్యాన్స్, హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.బినితా (Binita Chhetry) స్వస్థలం ఈశాన్య రాష్ట్రమైన అస్సామ్. షోలోకి అడుగుపెట్టిన వెంటనే బినితా తనను తాను పరిచయం చేసుకుంటూ ‘నేను భారతదేశం నుంచి వచ్చాను. బ్రిటన్స్ గాట్ టాలెంట్ నా కలల వేదిక’ అని చెప్పింది. ఇక్కడ గెలవడం తన లక్ష్యం అని, తాను పింక్ ప్రిన్సెస్ హౌస్ (pink princess house) కొనాలని అనుకుంటున్నానని చెప్పి అందరి మనసుల్నీ కొల్లగొట్టింది. తన ముద్దు మాటలతో జడ్జీలను సమ్మోహనపరిచింది. అనంతరం ఆ స్టేజీ మీద చేసిన డ్యాన్స్ చూసి ప్రేక్షకులంతా తన్మయంతో చప్పట్లు కొట్టారు.ఇంత చిన్నవయసులో శివంగిలా చేస్తున్న డ్యాన్స్ చూసి జడ్జీలు, ప్రేక్షకులందరూ లేచి మరీ తనకు అభినందనలు తెలిపారు. ఈ వీడియో వైరల్ (Video Viral)గా మారి, తన గురించి దేశమంతా చెప్పుకునేలా చేసింది. నిరంతర సాధన, పట్టుదల, అనుకున్నది సాధించేదాకా ఆగిపోని దీక్షే తన విజయ రహస్యం అంటోంది బినిత. తన వయసులోని ఎంతో మంది చిన్నారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రశంసల వర్షంతన మెస్మరైజింగ్ డ్యాన్స్‌తో అందర్నీ తన వైపు తిప్పుకున్న బినితా చెట్రీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అస్సాం (Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు పలువురు మంత్రులు బినితాను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. బినితా చెట్రీ అనుకున్నది సాధించాలని వారంతా ఆకాంక్షించారు.From Assam to UK: Assam's talent shines at Britain's Got Talent Little Binita Chhetry makes the judges of @BGT go all 'Awww' as she presents a powerful performance and moves to the next round.My best wishes to the little one and hope she is able to buy a pink princess house… pic.twitter.com/G6xk5MEy3M— Himanta Biswa Sarma (@himantabiswa) March 2, 2025 ఎవరీ బినితా చెట్రీ?అస్సాంలోని బోకాజన్లోని అమరాజన్ ప్రాంతానికి చెందిన బినితా చెట్రీ.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో చదువుతోంది. బ్రిటన్స్ గాట్ టాలెంట్ షో కంటే ముందు ఆమె డాన్సీ ఐకాన్ 2 వైల్డ్ఫైర్లోనూ పాల్గొంది. 2024, ఆగస్టులో ఆల్-స్టైల్ డ్యాన్స్ కాంపిటీషన్ (సోలో)లో బినిత మొదటి రన్నరప్‌గానూ నిలిచింది. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బినితకు లక్షకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డాన్స్ వీడియోలకు ఫుల్ క్రేజ్ ఉంది.చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే! -
ఆ టాలెంట్ షోపై పరిణీతి ఆగ్రహం.. ఇదేనట కారణం
Parineeti Chopra Slams Talent Show For Listing Her As A Judge: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఓ టాలెంట్ షోపై మండిపడింది. 'హునర్బాజ్' అనే టాలెట్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది పరిణీతి. ఇటీవల దీనికి సంబంధించిన ఒక పోస్ట్‌ను 'ఫన్ కిడ్స్ ఇండియా' ట్విటర్లో షేర్ చేసింది. అందులో 'యూకేకి చెందిన నలుగురు పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించారు. రేపు మీ ఆడిషన్‌ను నమోదు చేసుకోండి. ఇదే చివరి అవకాశం.. వదులుకోకండి.' అంటూ పరిణీతి చోప్రాను న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా చేర్చి ట్వీట్ చేసింది ఫన్ కిడ్స్ ఇండియా. ఈ పోస్టుపై స్పందించిన పరిణీతి 'షేమ్. నేను ఇక ఈ షోతో భాగస్వామ్యం కాను. దయచేసి నా పేరును తొలగించండి. పిల్లలు, వారి తల్లిదండ్రుల విషయంలో నా పేరును ఇలా వాడుకోవద్దు.' అంటూ ఫన్ కిడ్స్ ఇండియా షేర్ చేసిన ట్వీట్‌ను స్క్రీన్ షాట్స్ తీసి పోస్ట్ చేసింది. అయితే అంతకుముందే ఫన్ కిడ్స్ ఇండియా ఆ ట్వీట్‌ను తొలగించింది. తర్వాత షో నిర్వాహకులు కూడా తమ అభిప్రాయాలను పరిణీతితో పంచుకునే ప్రయత్నం చేశారు. పరిణీతి మెనేజర్‌తో వారు మూడు నెలలుగా టచ్‌లో ఉంటున్నామని తెలిపారు. అదేవిధంగా పరిణీతి షోలో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని, త్వరలోనే ఆమెను కలుసుకునేందుకు ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. Absolute SHAM - I am not associated with this show in any way. Request you to kindly remove my name and not take advantage of kids and their parents in this way. 🙏 pic.twitter.com/HlTzVfuA5P — Parineeti Chopra (@ParineetiChopra) December 18, 2021 -
ఇంటర్నెట్ను షేక్ చేస్తోన్న బీర్‌ఖల్సా ప్రదర్శన
-
ఆశ్చర్యం.. భయం.. ఉత్కంఠత అన్ని ఒక్కసారే!
వాషింగ్టన్ : కొన్ని టీవీ షోల్లో కళ్లకు గంతలు కట్టుకుని టార్గెట్‌ని కొట్టడం.. మనిషి తల మీద ఓ పండు పెట్టి దాన్ని కొట్టడం వంటివి చూస్తూనే ఉంటాం. ఇప్పుడు వీటన్నింటిని తలదన్నే వీడియో ఒకటి ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. దీన్ని చూసిన వాళ్లు భయంతో కూడిన ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. ఇండియాకు చెందిన బీర్‌ఖల్సా గ్రూప్ చేసిన ఈ ప్రదర్శనకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. అమెరికాస్ గాట్ టాలెంట్ అనే షోలో బీర్‌ఖల్సా గ్రూప్ ఈ ప్రదర్శన ఇచ్చారు. ఈ గ్రూప్‌లో జగ్దీప్ సింగ్, కన్వల్జిత్ సింగ్, కరంజిత్ సింగ్ ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. వీరిలో జగ్దీప్ సింగ్ ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు. ప్రస్తుతం ఇతడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలీస్ ఉద్యోగిగా రికార్డు సృష్టించాడు. ఇక ఈ గ్రూప్ చేసిన విన్యాసాలు వర్ణించడానికి మాటలు రావు. ప్రదర్శనలో భాగంగా జగ్దీప్ సింగ్‌ను పడుకోబెట్టి అతని చుట్టూ కొబ్బరి కాయలు.. తల దగ్గర పుచ్చకాయలు పెట్టారు. మరో వ్యక్తి కళ్ల మీద ఉప్పు పోసుకుని.. గంతలు కట్టుకోని.. ఓ సుత్తి తీసుకుని ఏ మాత్రం తడబడకుండా.. మనిషికి తగలకుండా కొబ్బరి కాయలు, పుచ్చ కాయలు పగలకొట్టాడు. వీరు ప్రదర్శన ఇస్తున్నంత సేపు ప్రేక్షకులతో పాటు న్యాయ నిర్ణేతలు కూడా భయపడుతూ.. ఆశ్చర్యపోతూ.. అంతలోనే తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతో ప్రదర్శనను ఆసాంతం తిలకించారు. ప్రదర్శన పూర్తయ్యాక తేరుకోవడానికి అందరికి కాస్తా సమయం పట్టింది. ఆ తర్వాత ప్రేక్షకులతో పాటు జడ్జీలు కూడా లేచి నిల్చుని చప్పట్లతో అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. -
ఈ బుజ్జాయిల పాట వింటే అదరహో!
ప్రతిభాపాటవాల చాటడంలో పిల్లలూ ఏమీ తీసిపోవడం లేదు. అద్భుతంగా ప్రతిభను చూపిస్తూ అబ్బురపరుస్తున్నారు. ఆటలు, పాటలు, విన్యాసాలు ఏ విషయంలోనైనా పిల్లలు కాదు పిడుగులు అనిపించుకుంటున్నారు. ఇద్దరు చైనా బుడతలు తమ అద్భుతగానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. 2015లో చైనా టాలెంట్ షోలో ఇద్దరు చైనా చిన్నారులు అత్యంత క్లిష్టమైన పాటను అమోఘంగా పాడారు. 10 ఏళ్ల జెఫ్రీ లీ, ఏడేళ్ల సెలినా టామ్ అత్యంత క్లిష్టమైన ’యూ రైస్ మి అప్’ పాటను తన్మయత్వంతో ఆలపించారు. వారు పాడుతున్నంతసేపు శ్రోతలు నమ్మలేనట్టుగా విస్మయంలో మునిగిపోయారు. డుయో సీక్రెట్ గార్డెన్ కోసం 2002లో మొదట రికార్డు చేసిన ’యూ రైస్ మి’ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి చెందింది. 2002లో జోష్ గ్రోబన్, 2005లో ఐరిష్ బ్యాండ్ వెస్ట్‌లైఫ్ ఈ పాట ఆలాపించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అత్యంత క్లిష్టమైన పాటగా పేరొందిన ఈ గానాన్ని ఆ తర్వాత ఎంతోమంది గాయనీగాయకులు రికార్డు చేశారు. అలాంటి కష్టతరమైన పాటను వేదికపై అలవోకగా తన్మయత్వంతో పాడుతూ చైనా బుడతలు అదరహో అనిపించుకున్నారు -
ఈ బుడతల పాట వింటే అదరహో అంటారు!


