బ్రిటన్‌ గాట్‌ టాలెంట్‌ పోటీలో రన్నరప్‌గా అసోం చిన్నారి  | Assam 9-year-old Binita Chetry bags third place on Britain Got Talent | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ గాట్‌ టాలెంట్‌ పోటీలో రన్నరప్‌గా అసోం చిన్నారి 

Jun 2 2025 6:37 AM | Updated on Jun 2 2025 6:37 AM

Assam 9-year-old Binita Chetry bags third place on Britain Got Talent

గువాహటి: అసోంకు చెందిన తొమ్మిదేళ్ల బినితా చెత్రీ ప్రఖ్యాత ‘బ్రిటన్‌ గాట్‌ టాలెంట్‌ (బీజీటీ)’ రియాలిటీ డ్యాన్స్‌ పోటీల్లో రెండో రన్నరప్‌గా నిలిచింది. కొండప్రాంత కర్బి అంగ్‌లాంగ్‌ జిల్లాలోని ఓ కుగ్రామంలో నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ బాలిక ప్రపంచ వేదికపై సత్తా చాటడం విశేషం. ఈమె ప్రతిభను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మెచ్చుకున్నారు. 

ఆమె ప్రదర్శన బ్రహ్మపుత్ర నుంచి థేమ్స్‌ నది వరకు అందరినీ మంత్రముగ్ధులను చేసిందని, తమను గర్వపడేలా చేసిందని ప్రశంసలు కురిపించారు. శనివారం జరిగిన ఫైనల్స్‌లో బ్రిటిష్‌ మెజీíÙయన్‌ హ్యారీ మౌల్డింగ్‌ విజేతగా నిలిచాడు. ఎల్‌ఈడీ డ్యాన్స్‌ గ్రూప్‌ రెండో స్థానంలో నిలిచింది. బీజీటీ ఫైనల్స్‌ చేరిన తొలి భారతీయురాలు బినితాయేనని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. బినితా స్వగ్రామం పేరు టల్బాలిజన్‌. తండ్రి అమర్‌ చెత్రీ ఊళ్లో చిన్న కోళ్లఫారం నడుపుతుంటారు. బినితా ప్రిపరేషన్‌ కోసం కర్బి అంగ్‌లాంగ్‌ అటానమస్‌ కౌన్సిల్‌ రూ.5 లక్షలు సాయంగా అందజేసింది.

Advertisement
 
Advertisement
Advertisement