breaking news
Tagline
-
ఈపీఎఫ్ఓ కాంటెస్ట్: ట్యాగ్ చెప్పు.. క్యాష్ పట్టు!
భారత ప్రభుత్వ కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (EPFO), MyGov సహకారంతో, EPFO కోసం ఒక ట్యాగ్‌లైన్ కాంటెస్ట్ ప్రారంభించింది. సంస్థ ఆశయాలు, విధులకు అద్దం పట్టేలా (ఈపీఎఫ్ఓకు సూటయ్యే విధంగా) ఓ మంచి ట్యాగ్‌లైన్ అందించాలని ప్రజలకు సూచించింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఈ కాంటెస్ట్ 2025 అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరుగుతుంది.వచ్చిన మొత్తం ట్యాగ్లైన్లలో మూడు ఉత్తమమైన వాటిని ఎంపిక చేయడం జరుగుతుంది. విజేతలకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం కూడా అందించడం జరుగుతుంది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగే ఈపీఎఫ్ఓ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరు కావడానికి కూడా వారికి ఆహ్వానం లభిస్తుంది.నగదు బహుమతిమొదటి బహుమతి: రూ. 21,000రెండవ బహుమతి: రూ. 11,000మూడవ బహుమతి: రూ. 5,100తప్పకుండా పాటించాల్సిన షరతులు➤ఈ పోటీలో పాల్గొనేవారు భారతీయ పౌరులై ఉండాలి. ➤ట్యాగ్‌లైన్ హిందీలోనే ఉండాలి.➤ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే.. అంటే ఒక ట్యాగ్‌లైన్ మాత్రమే ఇవ్వాలి. ➤ఈ ట్యాగ్‌లైన్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సామాజిక భద్రత, ఆర్థిక సాధికారత, దార్శనికతకు అద్దం పట్టేలా ఉండాలి.➤ఏఐ కంటెంట్ ఉపయోగించకూడదు.Be the voice of trust & security!Join the EPFO Tagline Contest & craft a line that echoes financial safety & social empowerment.👉 https://t.co/86rKW27zrS #EPFO #FinancialSecurity #MyGovContest@LabourMinistry pic.twitter.com/4en8gQljTt— MyGovIndia (@mygovindia) October 3, 2025 -
ఘన్ను భాయ్ వినోదం
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఘన్ను భాయ్’. ‘ఇస్మార్ట్ కా బాప్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా ద్వారా ఆదిత్య గంగసాని హీరోగా పరిచయమవుతున్నారు. ప్రణయ్ మైకల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘ఘన్ను భాయ్’. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
‘ఇది మీ ఆకాశం’.. బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కొత్త మంత్రం
న్యూఢిల్లీ: ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ .. తమ ట్యాగ్‌లైన్, ఎయిర్‌క్రాఫ్ట్ లివెరీ (రంగులు, గ్రాఫిక్‌లు మొదలైనవి)ని బుధవారం ఆవిష్కరించింది. నారింజ, ఊదా రంగులు, ’ఉదయించే అ’ చిహ్నంతో వీటిని రూపొందించింది. ఉదయించే సూర్యుడి స్నేహపూర్వక అనుభూతిని, సునాయాసంగా ఎగరగలిగే పక్షి సామర్థ్యాలను, విమాన రెక్కల విశ్వసనీయతను చిహ్నం ప్రతిబింబిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ’ఇది మీ ఆకాశం’ పేరిట రూపొందించిన ట్యాగ్‌లైన్.. సామాజిక–ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుం డా అందరికీ విమానయానాన్ని అందుబాటులోకి తేవాలన్న తమ బ్రాండ్ ఆకాంక్షకు స్ఫూర్తిగా ఉంటుందని పేర్కొంది. Unveiling ‘The Rising A’ of Akasa Air Inspired by elements of the sky, The Rising A symbolises the warmth of the sun, the effortless flight of a bird, and the dependability of an aircraft wing. Always moving upwards. Always inspiring to rise. pic.twitter.com/vzMDT9gEmv — Akasa Air (@AkasaAir) December 22, 2021 -
వ్యాక్సిన్ వేసుకున్నారా? ఇలా చేస్తే 5 వేలు మీ సొంతం!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ వ్యాక్సినేషన్ క్యాంపైన్ నిర్వహిస్తోంది. 18 ఏళ్లు నిండిన వాళ్లకి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు భారత ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఇంట్లో ఉండే 5000 రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. అసలు ఏం చేయాలి.. సెలబ్రిటీలు వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు తీసిన వాళ్ల ఫోటోను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ ప్రజల్లో వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం మనం కూడా ఇలానే వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు ఫోటో తీసుకోని ప్రభుత్వం తెలిపిన వెబ్సైట్లో మన ఫోటోను షేర్ చేయాలి. మన ఫోటోతో పాటు ట్యాగ్ లైన్ కూడా రాసి పంపిస్తే చాలు. ఆ ట్యాగ్ కూడా వ్యాక్సిన్ ప్రయోజనాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం సంబంధించి ప్రజలను ఇన్స్పైర్ చేసేలా ఉండాలి. ఇలా వచ్చిన ఫోటోలలో ప్రతీ నెల 10 మందిని ప్రభుత్వం ఎంపిక చేసి వారికి అక్షరాల ఐదు వేల రూపాయలు క్యాష్ ప్రైజ్‌ను అందివ్వనున్నారు. ఎలా చేయాలి.. మీరు ముందుగా myGov.in పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి ట్యాబ్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసించుకోవాలి. అనంతరం మీ వివరాలని అందులో పేర్కొనాల్సి ఉంటుంది. తర్వాత మీరు వ్యాక్సిన్ వేసుకునేటప్పటి ఫోటోతో పాటు టాగ్ లైన్‌ని జత చేసి పంపితే చాలు. చదవండి: వైరల్: ఓం కరోనా ఫట్,ఫట్,ఫట్ స్వాహా!.. Recently took the #COVIDVaccine? Here's your chance to inspire millions to get #vaccinated too! Share your vaccination picture with an interesting tagline & stand a chance to win ₹5,000! Visit: https://t.co/rD28chyxrV @PMOIndia @MoHFW_India @PIB_India @MIB_India pic.twitter.com/DHoB3PKCwn— MyGovIndia (@mygovindia) May 19, 2021 -
మనోభావాలు దెబ్బతిన్నాయ్..!
రియో డి జనీరో: బ్రెజిల్.. సెక్సువల్ టూరిజంకు పెట్టింది పేరు.. ఫిఫా ప్రపంచకప్‌కు ఆ దేశం ఆతిథ్యమిస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి బ్రెజిల్‌పైనే ఉంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌కు లక్షల్లో అభిమానులు రానుండటంతో సాకర్ క్రేజ్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అడిడాస్ సంస్థ ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆరంభంలో రెండు టీ షర్టులను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే టీ షర్టులపై ముద్రించిన చిత్రాలు, ట్యాగ్లైన్లు వివాదాస్పదమయ్యాయి. ‘లుక్ ఇన్ టు స్కోర్ బ్రెజిల్’, ‘ఐ లవ్ బ్రెజిల్’ ఈ టీ షర్టుల ట్యాగ్‌లైన్ ద్వందార్థాలు వచ్చేలా ఉన్నాయి. దీనిపై బ్రెజిల్లో వ్యతిరేకత వ్యక్తమయింది. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ బ్రెజిల్ ప్రభుత్వం ఈ రెండు టీ షర్టులను ఉపసంహరించుకోవాలని అడిడాస్‌కు సూచించింది. దీంతో చేసేది లేక బ్రెజిల్లో ఈ టీషర్టుల అమ్మకం చేపట్టకుండానే అడిడాస్ వీటిని ఉపసంహరించుకుంది. మా పొట్ట కొడుతున్నారు సాకర్ ప్రపంచకప్ చూసేందుకు లక్షల్లో అభిమానులు వస్తారని.. నెల రోజుల పాటు తమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలు చందాన సాగుతుందని బ్రెజిల్ సెక్స్ వర్కర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి విటులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా ఇంగ్లిష్ కూడా నేర్చుకుంటున్నారు. ఇక ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని కండోమ్ కంపెనీలైతే తమ ఉత్పత్తులను అమాంతం పెంచేశాయి. వీళ్లందరి ఆశలపై నీళ్లు చల్లుతూ బ్రెజిల్ ప్రభుత్వం సెక్స్‌వర్కర్లపై ఉక్కుపాదం మోపుతోంది. సెక్సువల్ టూరిజానికి పెట్టింది పేరన్న అపప్రదను వీలైనంత వరకు తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మంది సెక్స్ వర్కర్లను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిజానికి బ్రెజిల్లో వ్యభిచారం చట్టబద్ధమే. అయితే ప్రపంచకప్ సమయంలో వీరిని అదుపులోకి తీసుకోవడం ద్వారా క్రైమ్ రేట్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు వ్యభిచారానికి పాల్పడుతున్న బాలికలను అదుపులో ఉంచవచ్చన్నది వీరి భావన. బ్రెజిల్లో ఇటీవలి కాలంలో బాలికలు కూడా వ్యభిచార వృత్తిలోకి దిగడం ఎక్కువైపోతోంది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యతో అక్కడి సెక్స్‌వర్కర్లలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వారు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చర్యలకు నిరసనగా ఆందోళనలకు దిగుతున్నారు. మొత్తానికి బ్రెజిల్ ప్రభుత్వం చేపట్టిన చర్య మంచిదే అయినా సెక్స్‌వర్కర్లు మాత్రం తమ పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
హైదరాబాద్... ‘హాట్’ గురూ!
భారత్‌లో బ్యాడ్మింటన్ అడ్డా హైదరాబాద్... తొలిసారి అట్టహాసంగా నిర్వహించిన లీగ్‌లోనూ సత్తా చాటింది. అంచనాలను నిలబెట్టుకుంటూ మొదటి ఐబీఎల్‌లో విజేతగా అవతరించింది. టీమ్ ఐకన్ ప్లేయర్‌గా సైనా నెహ్వాల్ అజేయ రికార్డుతో ముందుండి నడిపించగా... సహచరులు సరైన విధంగా స్పందించడంతో హాట్‌షాట్స్‌కు గెలుపు దక్కింది. ‘స్ట్రైక్ హార్’్డ అనే తమ టీమ్ ట్యాగ్‌లైన్‌ను మరిపిస్తూ లీగ్‌పై ఈ జట్టు తమదైన ముద్ర వేసింది. మొత్తానికి తొలి ఐబీఎల్ అభిమానుల నుంచి అనూహ్య ఆదరణ దక్కించుకోవడంతో పాటు భారత్‌లో లీగ్ భవిష్యత్తుకు కూడా భరోసా కల్పించింది. ముంబై: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో తొలి విజేతగా పీవీపీ హైదరాబాద్ హాట్‌షాట్స్ నిలిచింది. శనివారం ఇక్కడ జరిగిన ఫైనల్ పోరులో హాట్‌షాట్స్ 3-1తేడాతో అవధ్ వారియర్స్‌ను చిత్తు చేసింది. పురుషుల తొలి సింగిల్స్‌లో శ్రీకాంత్ నెగ్గి వారియర్స్‌కు శుభారంభం ఇచ్చాడు. అయితే ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో సింధుపై సైనా సునాయాసంగా గెలవగా... పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ జోడిదే పైచేయి అయింది. కీలకమైన రెండో పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ అనూహ్యంగా చెలరేగి గురుసాయిదత్‌ను ఓడించడంతో టైటిల్ హాట్‌షాట్స్ వశమైంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన యువ క్రీడాకారిణి పీవీ సింధు ఐకన్‌గా ఉన్న అవధ్ వారియర్స్ రన్నరప్ స్థానంతో సంతృప్తి పడింది. చెలరేగిన శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో తొలి మ్యాచ్ నెగ్గి శ్రీకాంత్ వారియర్స్‌కు శుభారంభాన్ని ఇచ్చాడు. అతను 21-12, 21-20తో హైదరాబాద్ ప్లేయర్ టనోంగ్సక్ను ఓడించాడు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడని ప్రపంచ 19వ ర్యాంకర్ టనోంగ్‌సక్ ఈ మ్యాచ్‌లో తడబడ్డాడు. మొదట్లో శ్రీకాంత్ 1-4తో వెనుకబడినా తేరుకొని ఒక్కసారిగా విజృంభించాడు. ఒక దశలో వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18-10తో ముందంజ వేసిన శ్రీకాంత్ దానిని నిలబెట్టుకుంటూ గేమ్ నెగ్గాడు. రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. ఒక దశలో 5-12తో వెనుకబడిన టనోంగ్‌సక్ 18-18కి తీసుకు వచ్చాడు. అయితే 19-20తో గేమ్ కోల్పోయే దశలో శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. తిరుగులేని సైనా ప్రపంచ నాలుగో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఐబీఎల్‌లో తన ఐకన్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. ఆడిన ఏడు మ్యాచుల్లోనూ ఆమె గెలవడం విశేషం. లీగ్ దశలో అవధ్ క్రీడాకారిణి సింధును ఓడించిన సైనా... ఈసారి కూడా పైచేయి ప్రదర్శిస్తూ 21-15, 21-7తో పీవీ సింధును చిత్తు చేసింది. తొలి పాయింట్ నుంచే జోరు ప్రదర్శించిన సైనా 7-3తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. తొలి బ్రేక్ అనంతరం సింధు కాస్త పోరాట పటిమ ప్రదర్శించింది. వరుస స్మాష్‌లతో పాయింట్లు నెగ్గి కోలుకునే ప్రయత్నం చేసింది. అయితే సైనా చక్కటి డ్రాప్ షాట్లతో ఆధిక్యాన్ని 14-9కి పెంచుకుంది. అనవసర తప్పిదాలతో హాట్‌షాట్ ప్లేయర్ కొన్ని పాయింట్లు కోల్పోయినా... చివరకు గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ అయితే పూర్తిగా ఏకపక్షంగా సాగింది. సైనా ఆట ముందు సింధు చేతులెత్తేసింది. ఆరంభంలో 7-1తో భారీ ఆధిక్యం కనబరిచిన నెహ్వాల్ ఆ తర్వాత దానిని 13-4కు పెంచుకుంది. చివర్లో అద్భుతమైన స్మాష్, డ్రాప్ షాట్‌తో వరుసగా రెండు పాయింట్లు సాధించి సైనా 35 నిమిషాల్లో మ్యాచ్ ముగించింది. జయరామ్ సంచలనం పురుషుల డబుల్స్‌లో హాట్‌షాట్స్ జోడి వి షెమ్ గో-లిమ్ కిమ్ వా 21-14, 13-21, 11-4 స్కోరుతో అవధ్ జంట మార్కిస్ కిడో-మథియాస్ బోపై విజయం సాధించింది. దీంతో హాట్‌షాట్స్ 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత రెండో పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ అద్భుత విజయంతో హాట్‌షాట్స్‌కు టైటిల్ అందించాడు. తొలి గేమ్‌లో ఓడిపోయినా అజయ్ ఆ తర్వాత పట్టుదలతో పోరాడి 10-21, 21-17, 11-7 తేడాతో గురుసాయిదత్‌పై విజయం సాధించాడు. ఓ దశలో గురుసాయి జోరుతో మ్యాచ్ కీలక ఐదో మిక్స్డ్ డబుల్స్‌కు వెళ్లేలా కనిపించినా... అజయ్ జయరామ్ అనూహ్యంగా పుంజుకుని హైదరాబాద్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.


