
భారత ప్రభుత్వ కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (EPFO), MyGov సహకారంతో, EPFO కోసం ఒక ట్యాగ్‌లైన్ కాంటెస్ట్ ప్రారంభించింది. సంస్థ ఆశయాలు, విధులకు అద్దం పట్టేలా (ఈపీఎఫ్ఓకు సూటయ్యే విధంగా) ఓ మంచి ట్యాగ్‌లైన్ అందించాలని ప్రజలకు సూచించింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఈ కాంటెస్ట్ 2025 అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరుగుతుంది.
వచ్చిన మొత్తం ట్యాగ్‌లైన్‌లలో మూడు ఉత్తమమైన వాటిని ఎంపిక చేయడం జరుగుతుంది. విజేతలకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం కూడా అందించడం జరుగుతుంది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగే ఈపీఎఫ్‌ఓ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరు కావడానికి కూడా వారికి ఆహ్వానం లభిస్తుంది.
నగదు బహుమతి
మొదటి బహుమతి: రూ. 21,000
రెండవ బహుమతి: రూ. 11,000
మూడవ బహుమతి: రూ. 5,100
తప్పకుండా పాటించాల్సిన షరతులు
➤ఈ పోటీలో పాల్గొనేవారు భారతీయ పౌరులై ఉండాలి.
➤ట్యాగ్‌లైన్ హిందీలోనే ఉండాలి.
➤ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే.. అంటే ఒక ట్యాగ్‌లైన్ మాత్రమే ఇవ్వాలి.
➤ఈ ట్యాగ్‌లైన్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సామాజిక భద్రత, ఆర్థిక సాధికారత, దార్శనికతకు అద్దం పట్టేలా ఉండాలి.
➤ఏఐ కంటెంట్ ఉపయోగించకూడదు.
Be the voice of trust & security!
Join the EPFO Tagline Contest & craft a line that echoes financial safety & social empowerment.
👉 https://t.co/86rKW27zrS #EPFO #FinancialSecurity #MyGovContest@LabourMinistry pic.twitter.com/4en8gQljTt— MyGovIndia (@mygovindia) October 3, 2025