breaking news
T20 Global League
-
నైట్‌రైడర్స్‌కు ఆడనున్న క్రిస్‌గేల్
కేప్‌టౌన్ : విధ్వంసకర ఆటగాడు, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్‌గేల్ నైట్‌రైడర్స్ తరఫున ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఐపీఎల్ లో ప్రస్తుతం గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ కదా.. మరి నైట్‌రైడర్స్‌కు ఎందుకు ఆడుతున్నాడు.. జట్టు మారనున్నాడా అని డౌట్ పడుతున్నారు కదూ.. ఆ వివరాలపై ఓ లుక్కేయండి. వాస్తవానికి విండీస్ క్రికెటర్ గేల్ ప్రాతినిధ్యం వహించనున్నది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కాదు.. కేప్‌టౌన్ నైట్‌రైడర్స్ జట్టుకు. దక్షిణాఫ్రికా క్రికెట్ అసోసియేషన్ ఈ ఏడాది ట్వంటీ20 అంతర్జాతీయ టోర్నీ నిర్వహించనుంది. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కేప్‌టౌన్ వేదికగా కేప్‌టౌన్ నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. స్టార్ క్రికెటర్లు జేపీ డుమిని, క్రిస్‌గేల్ ను నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. మరోవైపు ప్రిటోరియా మావరిక్స్ లో ఏబీ డివిలియర్స్, డ్వేన్ బ్రావో ఉన్నారు. నవంబర్ 3న ప్రారంభపు మ్యాచ్‌లో ప్రిటోరియా మావరిక్స్తో గేల్ జట్టు కేప్‌టౌన్ నైట్ రైడర్స్ తలపడనుంది. డిసెంబర్ 16న టోర్నీ ముగుస్తుంది. -
సఫారీ టి20 లీగ్‌కు శ్రీకారం
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ తరహా ‘టి20 గ్లోబల్ లీగ్’కు రంగం సిద్ధమైంది. గురువారం ఈ టోర్నీకి సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. విశేష ప్రాచుర్యం పొందిన ఐపీఎల్‌లాగే తమ టి20 లీగ్ కూడా విజయవంతమవుతుందని దక్షిణాఫ్రికా బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లొర్గాత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 19న ఎనిమిది ఫ్రాంచైజీ యజమానుల వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. ఇందులో భారత ఆటగాళ్లు కూడా పాల్గొనాలని ఆయన ఆశిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే అక్టోబర్‌లో ఈ టోర్నీ మొదలవుతుంది.