breaking news
t news
-
సాక్షి, టీ న్యూస్‌ను అనుమతించొద్దు
మహానాడు నిర్వాహకులకు మీడియా కమిటీ చైర్మన్ ముద్దుకృష్ణ సూచన సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో జరగనున్న మహానాడు కార్యక్రమ కవరేజీ విషయంలో ‘సాక్షి’ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రవేశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సూచించింది. ఈ నెల 27నుంచి మూడు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమాల వివరాలు ‘సాక్షి’కి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మహానాడు నిర్వహణ కోసం టీడీపీ ఏర్పాటు చేసిన మీడియా కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈ మేరకు ప్రాంగణ, వేదిక కమిటీ నిర్వాహకులకు ప్రత్యేకంగా సూచనలు చేశారు. అంతేకాకుండా మహానాడుకు వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యే మీడియా ప్రతినిధుల కోసం చేయాల్సిన ఏర్పాట్లను నిర్దేశిస్తూ రూపొందించిన మార్గదర్శకాల్లో సాక్షి విషయాన్ని ప్రస్తావించారు. ఈ సూచనల పత్రం చివరన సాక్షి టీవీ, పత్రికతోపాటు టీ-న్యూస్ ప్రతినిధులను మహానాడుకు అనుమతించకూడదని పేర్కొన్నారు. -
టీ న్యూస్‌కు ఏపీ నోటీసులు పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి
గవర్నర్‌కు జర్నలిస్టు సంఘాల నేతల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: టీ న్యూస్ చానల్‌కు ఏపీ పోలీసులు అర్ధరాత్రి వేళ నోటీసులిచ్చి పత్రికా స్వేచ్ఛపై దాడి చేశారని వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు, పాత్రికేయులు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. న్యూస్ చానళ్లకు, టీవీ ప్రసారాలకు కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టం వర్తించదని, కేబుల్ ఆపరేటర్స్‌కు సంబంధించిన ఈ చట్టంపై పక్కరాష్ట్రం పోలీసులు నోటీసులు జారీ చేయడం చట్టాలను ఉల్లంఘించడమేనని గవర్నర్‌కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి, జై తెలంగాణ సీఈవో క్రాంతికిరణ్, వివిధ పాత్రికేయ సంఘాల నేతలు కె.విరాహత్ అలీ, బి.బసవపున్నయ్య, పల్లె రవికుమార్, ఎస్.వినయ్‌కుమార్ తదితరులు గవర్నర్‌ను కలిశారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ‘ఆడియో వెర్షన్’ను ప్రసారం చేసినందుకు వైజాగ్ ఏసీపీ రమణ టీ న్యూస్ కార్యాలయంలోకి చొరబడి నోటీసులు జారీ చే శారని వివరించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం అల్లం నారాయణ, శేఖర్‌రెడ్డి, ఆర్. దిలీప్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను అడ్డుకోవడం ద్వారా నిజాలను దాచలేరన్నారు. తనకు చుట్టుకున్న ఉచ్చును హైదరాబాద్‌కు చుట్టాలని బాబు చూస్తున్నారన్నారు. -
బీజేపి అధికారంలోకి వచ్చాక తెలంగాణ..?
-
పది జిల్లాలతో తెలంగాణ కావాలి
-
రాష్ట్రాన్ని విభజిస్తే సమ్మెకు దిగుతాం: ఏపీ ఎన్జీవోస్