breaking news
syed modi grand prix badminton
-
ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు..
Syed Modi International 300 Tournament: సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈవ్జెనియా కొసెత్స్కయా రిటైర్డ్‌హర్ట్ కావడంతో సింధుకు బై లభించి ఫైనల్‌కు చేరుకుంది. కాగా తొలి సెట్‌ను సింధు సొంతం చేసుకుంది. అంతకముందు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో థాయిలాండ్‌కు చెందిన ఆరవ సీడ్ సుపనిద కతేథింగ్పై 11-21,21-12,21-17 తేడాతో ఓడించిన సింధు సెమీస్‌కు చేరింది. ఇక ఫైనల్లో పీవీ సింధు.. మరో భారత క్రీడాకారిణి మాలవిక భన్సోద్తో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్ఎస్ ప్రణోయ్ క్వార్టర్ ఫైనల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్‌కు చెందిన ఆర్నాడ్ మెర్కెల్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-19,21-16 తేడాతో ప్రణోయ్ ఓటమి పాలయ్యాడు. కేవలం 59 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియడం విశేషం. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణ ప్రసాద్ జోడీ ఇషాన్ భట్నాగర్–సాయి ప్రతీక్ (భారత్) జంటను ఓడించి సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ ద్వయం రష్యాకు చెందిన అనస్తాసియా అక్చురినా-ఓల్గా మొరోజోవా ద్వయంపై 24-22 21-10 తేడాతో గెలిచి సెమీస్‌లో అడుగపెట్టారు. -
పివి సింధు తొలిసారి..
లక్నో:సయ్యద్ మోడి గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పివి సింధు 21-13, 21-14 తేడాతో ఇండోనేసియాకు చెందిన గ్రెగోరియా మరిస్కపై విజయం సాధించి టైటిల్‌ను సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో సింధు అలవోకగా గెలుపొంది తొలిసారి ఈ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఏ దశలోనూ సింధును నిలువరించలేకపోయిన గ్రెగోరియా రన్నరప్ గా సరిపెట్టుకుంది.ఇది పివి సింధుకు తొలి సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ కావడం విశేషం. ఇక పురుషుల సింగిల్స్ లో భారత ఆటగాడు సమీర్ వర్మ 21-19,21-16 తేడాతో మన దేశానికే చెందిన సాయి ప్రణీత్ పై విజయం సాధించి టైటిల్ ను సాధించాడు.