svamigaud
-
అనర్హతపై కోర్టుకెళ్తాం
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సభ్యులుగా తమను అనర్హులను చేస్తూ చైర్మన్ స్వామిగౌడ్ జారీ చేసిన ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతిరెడ్డి, యాదవరెడ్డిలు వెల్లడించారు. స్వామిగౌడ్ నిర్ణయం అనంతరం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ తమపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యయుతం కాదని, ఇది చీకటి రోజని పేర్కొన్నారు. గిరిజన హక్కుల గురించి మాట్లాడినందుకే... నన్ను డిస్క్వాలిఫై చేసినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు. గాంధీతో పోల్చినందుకు నాకు అనర్హత గిఫ్ట్ ఇచ్చారు. సీఎం ఆఫీస్ డైరెక్షన్లోనే స్వామిగౌడ్ మాపై నిర్ణయం తీసుకున్నారు. నేను గవర్నర్ కోటాలో ఎన్నికయ్యా. ఏకపక్షంగా నన్ను అనర్హుడిగా ప్రకటించారు. ఫారూఖ్ హుస్సేన్ కూడా గవర్నర్ కోటాలోనే వచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోలేదు కానీ నా గురించి బులెటిన్ ఇచ్చారు. టీఆర్ఎస్ 88 స్థానాలు గెలిచినా సీఎం సెంచరీ కావాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. ప్రజలు పాలిం చాలని అధికారం ఇస్తే కేసీఆర్ ప్రతిపక్ష నాయకులను లేకుండా చేస్తున్నారు. గిరిజనుల హక్కుల గురించి నేను మాట్లాడినందుకు నన్ను డిస్క్వాలిఫై చేశారు. కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తా. కాంగ్రెస్ పక్షం టీఆర్ఎస్లో విలీనమైన తర్వాత మేము కాంగ్రెస్ ఎమ్మెల్సీలం ఎలా అవుతామో వారికే తెలియాలి. – రాములు నాయక్ చైర్మన్ అధికారాలు తొలగించాలి... మమ్మల్ని అనర్హులను చేసినట్లు మీడియా ద్వారానే తెలిసింది. చట్టాన్ని అవహేళన చేస్తూ మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. కాంగ్రెస్‌పక్షం టీఆర్ఎస్లో విలీనమైనప్పుడు మేము పార్టీ మారినట్లు ఎలా అవుతుంది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలి. చైర్మన్లకు ఉన్న అధికారాలు తొలగించి ఒక కమిటీకి అప్పగించాలి. – యాదవరెడ్డి ఏ పార్టీ గుర్తుపై గెలవకున్నా అనర్హతా? మండలి చైర్మన్ నిర్ణయం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే. నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఏ పార్టీ గుర్తుపైనా గెలవలేదు. గవర్నర్ కోటాలో ఎన్నిక కాలేదు. నాపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లో విలీనమైనట్లు గెజిట్ విడుదల చేశారు. అలాంటప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది? ఏ ప్రాతిపదికన నాపై అనర్హత వేటు వేస్తారు? కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. పెద్దల సభలోనే న్యాయం జరగనప్పుడు ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఈ అంశంపె కోర్టుకు వెళ్తా. – భూపతిరెడ్డి -
ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
-
ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి ఎన్నికైన అధికార టీఆర్ఎస్కు చెందిన పది మంది ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణం స్వీకారం చేయించారు. బాలసాని లక్ష్మీనారాయణ(ఖమ్మం), కొండా మురళీధర్‌రావు (వరంగల్), భాను ప్రసాద్‌రావు(కరీంనగర్), నారదాసు లక్ష్మణ్ రావు (కరీంనగర్-2), పురాణం సతీష్ (ఆదిలాబాద్), డాక్టర్ భూపతి రెడ్డి (నిజామాబాద్), భూపాల్‌రెడ్డి(మెదక్), పట్నం నరేందర్‌రెడ్డి(రంగారెడ్డి), శంభీపూర్ రాజు(రంగారెడ్డి -2), కసిరెడ్డి నారాయణరెడ్డి(మహబూబ్‌నగర్)లు ప్రమాణం చేశారు. మండలి దర్బారు హాలులో గురువారం ఏర్పాటైన ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. -
గుడిసెలు లేని రాష్ట్రమే లక్ష్యం
ఆదిలాబాద్ టౌన్/ఆదిలాబాద్ అర్బన్ : ఏ ఒక్కరూ గుడిసెల్లో నివసించకుండా అందరికీ పక్కా గృహాలు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేయాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఇప్పటికీ జిల్లాలో 92వేల మంది గుడిసెల్లో జీవిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని తెలిపారు. సోమవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సరసభ్య సమావేశం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ‘మన జిల్లా-మన ప్రణాళిక’పై చర్చించారు. ముఖ్య అతిథులుగా శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తోపాటు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అమలు కోసం ప్రభుత్వం మన ఊరు-మన ప్రణాళిక, మన జిల్లా-మన ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లల ఆరోగ్య పరిస్థితులు బాగా లేకుంటే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చైల్డ్ మొబైల్ కేర్ వ్యాన్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. జిల్లాను పర్యాటక ప్రాంతంగా మార్చుకుంటే రెండో కాశ్మీర్‌గా రూపొందుతుందని తెలిపారు. ఉచిత నిర్బంధ విద్యను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కొమురంభీం పోరాట స్మృతిని గుర్తు చేసుకునేందుకు భవనం ఏర్పాటు కోసం ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకోవాలని, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులతో స్నేహభావంతో మెలగాలని తెలిపారు. ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీలు గొడం నగేష్, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరయ్యారు. జిల్లాతో పాటు ఆయా నియోజకవర్గాల సమస్యలను సమావేశంలో గళమెత్తారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి అందించాలని మంత్రికి, జెడ్పీ చైర్ పర్సన్‌కు విన్నవించారు. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: స్వామిగౌడ్
సాక్షి,సిటీబ్యూరో: కొత్త ప్రభుత్వంలో అందరం ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని తెలంగాణ శాసనమండలి అధ్యక్షుడు స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. రవీంద్రభారతిలో శుక్రవారం సత్కళా భారతి హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘జయ జయహే తెలంగాణ’ సంగీత నత్యరూపకం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జయజయహే నృత్యరూపకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని సూచించారు. 60 ఏళ్ల తెలంగాణ పోరాట ఘట్టాలను ఒక గంటలో చూపించడం మహాద్భుతమన్నారు. నృత్య రూపకానికి దర్శకత్వం వహించిన డాక్టర్ కోట్ల హనుమంతరావు, సంగీతం సమకూర్చిన డీఎస్వీ శాస్త్రి, రచన చేసిన డాక్టర్ వడ్డేపల్లి కష్ణలు అభినందనీయులన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణ మాట్లాడుతూ నృత్యరూపక కళాకారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ స్వీయ రాజకీయ చిత్తం కోసం పోరాడి...చివరికి సాధించుకున్నదని చెప్పారు. రాజకీయాలు మాట్లాడేవారు తెలంగాణ పోరాటం విముక్తి కోసం జరిగిన పోరాటంగా గుర్తించడం లేదన్నారు. గురుకుల భూములను ప్రభుత్వం తీసుకోవాలనుకుంటోందన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ జయ జయహే తెలంగాణ నృత్యరూపకం, తెలంగాణ జనపద గేయాలు భేషుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. అనంతరం నృత్య రూపకంలో పాల్గొన్న కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్కళా భారతి అధ్యక్షుడు జి.సత్యనారాయణ, ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ ఘట్టాలను గుర్తుచేసిన రూపకం జయ జయహే తెలంగాణ సంగీత నృత్య రూపకం 60 ఏళ్ల తెలంగాణ పోరాటంలోని కీలక ఘట్టాలను ఒక గంటలో కళ్ల ముందుంచింది. దీన్ని తిలకించేందుకు వచ్చిన ప్రజలు, నేతలు ఉత్కంఠగా సన్నివేశాలను తిలకించారు. రవీంద్రభారతి ప్రాంగణంలో ఉన్న యావన్మంది రూపకాన్ని రచించిన డాక్టర్ వడ్డేపల్లి కష్ణ, దర్శకత్వం వ హించిన డాక్టర్ అనితారావు, డాక్టర్ కోట్ల హనుమంతరావు, సంగీతం సమకూర్చిన డీఎస్వీ శాస్త్రిలను ప్రశంసించారు.