ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం | MLC sworn in hyderabad | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

Jan 7 2016 6:13 PM | Updated on Sep 3 2017 3:16 PM

స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి ఎన్నికైన అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన పది మంది ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణం స్వీకారం చేయించారు.

స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి ఎన్నికైన అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన పది మంది ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణం స్వీకారం చేయించారు. బాలసాని లక్ష్మీనారాయణ(ఖమ్మం), కొండా మురళీధర్‌రావు (వరంగల్), భాను ప్రసాద్‌రావు(కరీంనగర్), నారదాసు లక్ష్మణ్ రావు (కరీంనగర్-2), పురాణం సతీష్ (ఆదిలాబాద్), డాక్టర్ భూపతి రెడ్డి (నిజామాబాద్), భూపాల్‌రెడ్డి(మెదక్), పట్నం నరేందర్‌రెడ్డి(రంగారెడ్డి), శంభీపూర్ రాజు(రంగారెడ్డి -2), కసిరెడ్డి నారాయణరెడ్డి(మహబూబ్‌నగర్)లు ప్రమాణం చేశారు. మండలి దర్బారు హాలులో గురువారం ఏర్పాటైన ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నేతలు హాజరయ్యారు.

 

Advertisement
 
Advertisement
Advertisement