breaking news
suryapet murder
-
సూర్యాపేటలో పరువు హత్య? మాట్లాడుకుందాం రమ్మని పిలిచి..
సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని మినీ ట్యాంక్ బండ్ సద్దల చెరువుపై కట్ట మైసమ్మ గుడి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని చందనబోయిన దిలీప్(19)గా గుర్తించారు. ఈ ఘటనను పరువు హత్యగా అనుమానిస్తున్నారు. తాళ్లగడ్డకు చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన దిలీప్ కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఈ ప్రేమ వ్యవహారం యువతి సోదరుడికి నచ్చలేదు. దీంతో అతనిపై పగ పెంచుకున్నాడు. ఈక్రమంలోనే మాట్లాడుకుందాం రమ్మని సద్దల చెరువు వద్దకు దిలీప్‌ను పిలిచాడు. చెరువు వద్దకు వెళ్లిన దిలీప్‌పై యువతి సోదురుడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. బీరు సీసాలతో పదే పదే పొడిచాడు. దీంతో దిలీప్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చదవండి: దారుణం.. ఆలస్యంగా వచ్చాడని ఓలా డ్రైవర్‌ను చితకబాదిన గ్యాంగ్ -
సూర్యాపేటలో భార్యపై భర్త దారుణం
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దే పట్టపగలు హత్య జరిగింది. సబీనా బేగం(30) అనే మహిళను ఆమె భర్తే అత్యంత దారుణంగా హత్య చేశాడు. నలుగురు చూస్తుండగా నడి రోడ్డు మీద ఆమె భర్త ధరావత్ శ్రీనివాస్ గొంతు కోసి పరారయ్యాడు. దీంతో సబీనా బేగం అక్కడికక్కడే చనిపోయింది. వీరి ఇద్దరికీ 8 నెలల కిందటే వివాహమైంది. సబీనా బేగంకు గతంలో ఓ వివాహమై విడాకులు తీసుకోగా.. ధరావత్ శ్రీను కూడా గతంలో వివాహమై విడాకులు తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ సునీతా మోహన్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.