సూర్యాపేటలో భార్యపై భర్త దారుణం | husband attack on his wife in suryapet | Sakshi
Sakshi News home page

సూర్యాపేటలో భార్యపై భర్త దారుణం

Jun 28 2017 3:42 PM | Updated on Sep 5 2017 2:42 PM

సూర్యాపేటలో భార్యపై భర్త దారుణం

సూర్యాపేటలో భార్యపై భర్త దారుణం

సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దే పట్టపగలు హత్య జరిగింది.

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దే పట్టపగలు హత్య జరిగింది. సబీనా బేగం(30) అనే మహిళను ఆమె భర్తే అత్యంత దారుణంగా హత్య చేశాడు. నలుగురు చూస్తుండగా నడి రోడ్డు మీద ఆమె భర్త ధరావత్‌ శ్రీనివాస్‌ గొంతు కోసి పరారయ్యాడు.

దీంతో సబీనా బేగం అక్కడికక్కడే చనిపోయింది. వీరి ఇద్దరికీ 8 నెలల కిందటే వివాహమైంది. సబీనా బేగంకు గతంలో ఓ వివాహమై విడాకులు తీసుకోగా.. ధరావత్‌ శ్రీను కూడా గతంలో వివాహమై విడాకులు తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ సునీతా మోహన్‌ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement