breaking news
superheart
-
‘సూపర్ హార్ట్’లో నటించట్లేదు: హిమాన్షు
సాక్షి, హైదరాబాద్: సూపర్ హార్ట్ షార్ట్ ఫిల్మ్‌లో తాను నటించటం లేదని సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు స్పష్టం చేశారు. ఆ కార్యక్రమ నిర్వాహకులు చేస్తున్న ప్రచారాన్ని ఖండించాడు. యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్‌లో హిమాన్షు సూపర్ హీరోగా నటిస్తున్నాడని నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నటించేందుకు అవకాశం వచ్చిన మాట నిజమే కానీ, తాను మాత్రం నటించట్లేదని హిమాన్షు తెలిపాడు. ఈ విషయాన్ని హిమాన్షు సోమవారం ‘సాక్షి’తో ఫోన్లో తెలిపాడు. ప్రస్తుతం చదువు, పరీక్షలపైనే దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశాడు. -
హిమాన్షు.. ది హీరో!
♦ సూపర్ హీరోగా సీఎం మనవడు ♦ షార్ట్ ఫిల్మ్‌లో నటించనున్న హిమాన్షురావు ♦ ప్రసాద్ ల్యాబ్స్‌లో లాంఛనంగా చిత్ర నిర్మాణం ప్రారంభం ♦ అనారోగ్యంతో కార్యక్రమానికి హాజరుకాని హిమాన్షు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కె.తారకరామారావు తనయుడు హిమాన్షు ‘సూపర్ హీరో’గా కనిపించబోతున్నాడు. యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘సూపర్ హార్ట్’ షార్ట్ ఫిల్మ్‌లో హిమాన్షు లిటిల్ హీరో పాత్ర పోషించనున్నాడు. సాంఘిక దురాచారాలను రూపుమాపడం, సామాజిక బాధ్యతలను తెలియజెప్పడం ఇతివృత్తంగా ఆరు నుంచి పది నిమిషాల నిడివితో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కనుంది. ఏసియన్ స్ట్రాంగ్ మ్యాన్‌గా పేరున్న మనోజ్ చోప్రా ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండగా సూపర్ హీరో పాత్రల్లో ఒకరిగా హిమాన్షుకు అవకాశం లభించింది. వివిధ దేశాలకు చెందిన మరో ఆరుగురు సూపర్ హీరోలు ఇందులో నటించనున్నారు. బాలకార్మికులు, పిల్లల అక్రమ రవాణా, అవినీతి, లంచగొండితనం, మద్యపానం తదితర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఫైట్లు చేసే అద్భుతమైన సూపర్ హీరో స్టంట్లు ఇందులో ఉంటాయి. యున్డబ్ల్యూటీవో షార్ట్ ఫిల్మ్ ఉత్సవంలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం ఈ చిత్ర నిర్మాణాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారితోపాటు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్, మనోజ్ చోప్రా పాల్గొన్నారు. స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో ప్రారంభోత్సవానికి హిమాన్షు హాజరు కాలేకపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. మార్చి 22 నుంచి జరిగే చిత్ర నిర్మాణంలో హిమాన్షు పాల్గొననున్నాడు.