Sunil Lahri
-
రాముడిగా రణ్బీర్ సెట్ కాలేదు.. బాలీవుడ్ నటుడు కీలక వ్యాఖ్యలు!
దర్శకుడు నితీశ్ కుమార్ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమాపై నటుడు సునీల్ లహ్రీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాముడిగా పాత్రకి రణ్బీర్ కపూర్ అంతగా సెట్ అవ్వలేదన్నాడు. రాముడి పాత్రకు ఉండాల్సిన మృదు స్వభావం రణ్బీర్లో కనిపించలేదన్నాడు.తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘రామాయణ’టీజర్ చూశాను. అందులో నేను ఆశించిన స్థాయిలో భావోద్వేగాలు కనిపంచలేదు. రాముడిగా రణ్బీర్ చూడడానికి బాగానే ఉన్నాడు. కానీ అతనిలో సున్నితం, అమాయకత్వం కనిపించడం లేదు. ఆయన కాస్త కఠినంగా కనిపిస్తున్నారు. తన నటనతో అయినా ఈ పాత్రకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాను’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ..‘రణ్బీర్ రాముడి పాత్ర కాకుండా లక్ష్మణుడు లేదా భరతుడి పాత్రలు పోషిస్తే బాగా సెట్ అయ్యేదని అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది మనసులను గెలుచుకున్న ‘రామాయణం’ సీరియల్లో లక్ష్మణుడు పాత్రని సునీల్ లహ్రీ పోషించాడు. ‘రామాయణ’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంస్థ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై రూ. 4000 భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ దీపావళికి విడుదల కానుంది. -
Ayodhya Ram Mandir: మరలా ఆ ముగ్గురి దర్శనం
రామానంద సాగర్ ‘రామాయణ్’ సీరియల్ రామాయణ గాధను ఇంటింటికీ తెచ్చింది. 1987లో ప్రసారమైన ఈ సీరియల్ ఆ రోజుల్లో ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన సీరియల్. రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లహరీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం పొందారు. వీరు ముగ్గురూ మళ్లీ కనిపిస్తే? అదే ఆలోచన వచ్చింది అభిషేక్ ఠాకూర్ అనే నిర్మాతకు. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా ‘హమారే రామ్ ఆయేహై’ అనే పాటను సోను నిగమ్ గొంతులో రికార్డు చేయించి, అయోధ్య రామమందిర ప్రాంగణంలో, సరయూ నది ఒడ్డున చిత్రీకరించి విడుదల చేశాడు. ఆ పాటలో అరుణ్ గోవిల్, దీపిక, సునీల్ లహరీ... అయోధ్య ప్రాంగణంలో తిరుగాడటం... సాక్షాత్తు ఆ సీతారామ లక్ష్మణులు తిరిగిన భావనను భక్తులకు కలిగించింది. ‘హమారే రామ్ ఆయేహై’ పాట ఇప్పటికే కోటి వ్యూస్ దాటిపోయింది. ఇంకా ఎన్ని కోట్ల వ్యూస్ వస్తాయో చెప్పలేము. అరుణ్ గోవిల్, దీపికలు ఇప్పటికీ ఎక్కడ కనిపించినా పాద నమస్కారాలు చేసే ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు రామమందిర ప్రతిష్ఠాపన తర్వాత వారి కీర్తి మరింతగా విరాజిల్లనుంది. -
అయ్యో.. నా రాముడికి ఎలాంటి పరిస్థితి? మనసు బరువెక్కింది
ఆధ్యాత్మిక పాత్రలను వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా రక్తి కట్టించినవాళ్లున్నారు. వెండితెర కంటే అద్భుతంగా సీరియల్స్ ద్వారా జనాలకు చేరువైన కథలున్నాయి. అలా ఎన్నో భక్తి ప్రధాన సీరియల్స్ ప్రేక్షకులను మైమరపింపజేశాయి. అందులో రామాయణ్ సీరియల్ ఒకటి. ఈ సీరియల్లో రాముడు, లక్ష్మణుడు, సీతగా నటించిన ముగ్గురికీ అయోధ్య రామాలయ ప్రారంభం కోసం ఆహ్వానం అందింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే అయోధ్యను వీరు సందర్శించారు. రాములవారికి ఎలాంటి పరిస్థితి? శ్రీరాముని ఆలయాన్ని చూసి తన్మయత్వానికి లోనయ్యారు. రామాయణ్ సీరియల్లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లహ్రి అయితే తనను తాను మైమరిచిపోయాడు. తాజాగా అతడు తన మనసులోని మాటలను మీడియాతో పంచుకున్నాడు. సునీల్ లహ్రి మాట్లాడుతూ.. 'అయోధ్యకు వెళ్లినప్పుడు నేను భావోద్వేగానికి లోనయ్యాను. ఇక్కడే కదా రాములవారు పుట్టిపెరిగింది. కానీ ఆయనకు ఎలాంటి పరిస్థితి వచ్చింది. టెంట్ కింద విగ్రహాన్ని ఉంచారు. వారి త్యాగం ఊరికే పోలేదు అది చూసి నాకు ఎంతో బాధేసింది. మూడు దశాబ్దాల తర్వాత తిరిగి అదే ప్రదేశంలో ఆయనకు గుడి కట్టినందుకు మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. 500 ఏళ్లుగా దీని కోసం పోరాడాం. ఎంతోమంది తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయలేదు. వారి త్యాగం ఊరికే పోలేదు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు (జనవరి 22) భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రియుడితో ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఫిబ్రవరిలోనే పెళ్లి!


