దర్శకుడు నితీశ్ కుమార్ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమాపై నటుడు సునీల్ లహ్రీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాముడిగా పాత్రకి రణ్‌బీర్ కపూర్ అంతగా సెట్ అవ్వలేదన్నాడు. రాముడి పాత్రకు ఉండాల్సిన మృదు స్వభావం రణ్‌బీర్‌లో కనిపించలేదన్నాడు.
తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘రామాయణ’టీజర్ చూశాను. అందులో నేను ఆశించిన స్థాయిలో భావోద్వేగాలు కనిపంచలేదు. రాముడిగా రణ్‌బీర్ చూడడానికి బాగానే ఉన్నాడు. కానీ అతనిలో సున్నితం, అమాయకత్వం కనిపించడం లేదు. ఆయన కాస్త కఠినంగా కనిపిస్తున్నారు. తన నటనతో అయినా ఈ పాత్రకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాను’ అన్నారు.
ఇంకా మాట్లాడుతూ..‘రణ్‌బీర్ రాముడి పాత్ర కాకుండా లక్ష్మణుడు లేదా భరతుడి పాత్రలు పోషిస్తే బాగా సెట్ అయ్యేదని అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది మనసులను గెలుచుకున్న ‘రామాయణం’ సీరియల్‌లో లక్ష్మణుడు పాత్రని సునీల్ లహ్రీ పోషించాడు.
‘రామాయణ’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్‌ఈజీ సంస్థ, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై రూ. 4000 భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ దీపావళికి విడుదల కానుంది.


