breaking news
sugar available
-
చక్కెర కేజీ రూ.140!
పండుగ సీజన్లో చక్కెర ధరల మంట ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. భారత్‌లోనూ కిలో పంచదార రూ.62.57కు చేరి.. గత నెలతో పోలిస్తే 27 శాతం అధికంగా ఉంది. ఇదే సమయంలో పొరుగున నేపాల్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దసరా, తిహార్ పండుగలు సమీపిస్తుండటంతో డిమాండ్ పెరగడం, దిగుమతి వ్యయాలు అధికం కావడంతో కిలో పంచదార ధర ఏకంగా రూ.140కు చేరింది.కాఠ్మాండులోని సిగల్ ప్రాంతంలో పంచదార ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. రెండు వారాల క్రితం ఇదే పంచదార రూ.115కే లభించింది. ఇటు భక్తపూర్‌లోని గట్టాఘర్లో కిలో ధర రూ.130గా ఉంది. ఇలా ఏరియాలను బట్టి.. కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు వ్యాపారులు పెంచేస్తున్నారు. నేపాల్ రిటైల్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవిత్ర బజ్రాచార్య మాట్లాడుతూ.. హోల్‌సేల్ వ్యాపారులు నెల రోజుల్లో కిలో పంచదార ధరను రూ.125 వరకు పెంచారని తెలిపారు. దిగుమతి ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ధరల పెరుగుదలకు రిటైలర్లే కారణమనే వాదనను ఆయన ఖండించారు.సర్కారీ దుకాణాల్లో ఎంతంటే..మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ సాల్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (STC) దుకాణాల్లో మాత్రం కిలో పంచదార రూ.105కే విక్రయిస్తున్నారు. అయితే సరఫరాలో అంతరాయం కారణంగా ఒక్కో వినియోగదారుడికి విక్రయించే పరిమితిని ఆరు కిలోల నుంచి రెండు కిలోలకు తగ్గించారు. ప్రభుత్వ దుకాణాలు, బహిరంగ మార్కెట్ ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం చర్చనీయాంశంగా మారింది. పండుగల వేళ పంచదారకు డిమాండ్ పెరుగుతుందని తెలిసినా కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో పంచదార అందుబాటులో ఉన్నప్పటికీ అధిక ధరకు విక్రయించడం వినియోగదారులకు అన్యాయమని వ్యాపార సంఘాల ప్రతినిధులు అంటున్నారు.25 వేల టన్నుల దిగుమతికి అనుమతిధరలను అదుపులోకి తెచ్చేందుకు నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాల్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్ 25 వేల టన్నుల పంచదారను కేవలం ఒక శాతం కస్టమ్స్ సుంకంతో దిగుమతి చేసుకునేందుకు కేబినెట్ అనుమతించింది. ఈ సరుకు చేరే వరకు దేశీయ చక్కెర కర్మాగారాల నుంచి సుమారు 15 వేల టన్నుల పంచదారను ఎస్టీసీ, ఫుడ్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.అదే సమయంలో భారత్ నుంచి పంచదార దిగుమతి చేసుకునేందుకు STC చర్యలు ప్రారంభించింది. భారత్ సరఫరాకు సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలో నేపాల్‌లో ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏటా 2.5 లక్షల టన్నుల అవసరంనేపాల్లో ఏడాదికి సుమారు 2.5 లక్షల టన్నుల పంచదార అవసరం కాగా.. దేశీయంగా గరిష్ఠంగా 1.9 లక్షల టన్నుల వరకు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం దేశీయ చెరకు క్రషింగ్ సీజన్ ముగిసింది. తదుపరి సీజన్ డిసెంబరులో ప్రారంభం కానుంది. దీంతో అప్పటివరకు దిగుమతులపైనే నేపాల్ ఎక్కువగా ఆధారపడాల్సి ఉంది. ఇప్పటికే ఎస్టీసీ దేశీయ ఉత్పత్తిదారుల నుంచి సుమారు 600 టన్నుల పంచదార కొనుగోలు చేసింది. రవాణా మార్గాల్లో అంతరాయాల కారణంగా గతంలో సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో పండుగల డిమాండ్ పెరగకముందే తగినంత నిల్వలు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.భారత్ సరఫరాపైనే ఆశలుమరోవైపు నేపాల్ పంచదార అవసరాల్లో భారత్ కీలకంగా మారింది. దేశీయ ఉత్పత్తి అవసరాలకు సరిపోకపోవడంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే సరఫరాపైనే నేపాల్ మార్కెట్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే 2,500 టన్నుల పంచదార నేపాల్‌కు చేరే ప్రక్రియలో ఉండగా.. మరో 2,500 టన్నుల దిగుమతికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత్‌లో ఉత్పత్తి, దేశీయ డిమాండ్, ఎగుమతి విధానాలు ఎలా ఉంటాయన్నదానిపై కూడా నేపాల్ పంచదార ధరలు ఆధారపడనున్నాయి. భారత్‌పైనా ధరల ఒత్తిడిమరోవైపు భారత్‌లోనూ పంచదార రంగం కీలక దశలో ఉంది. దేశీయ ఉత్పత్తి, ఎగుమతులు, పండుగల సీజన్లో పెరిగే డిమాండ్ నేపథ్యంలో సరఫరా–ధరలపై మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేపాల్ భారత్ నుంచి దిగుమతులపై ఆధారపడటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో సరఫరా పరిస్థితి, ఎగుమతి విధానాలు నేపాల్‌లో పంచదార ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పండుగల డిమాండ్ నేపథ్యంలో రెండు దేశాల్లోనూ పంచదార ధరల పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: ‘అదొక పనికిరానిది..’ ఇరాన్‌కు అమెరికా కౌంటర్ -
స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ, సాక్షి: వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమైన కేంద్ర కేబినెట్ తాజాగా పలు నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయం, టెలికం, విద్యుత్ రంగాలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించింది. కొద్ది రోజులుగా రైతుల ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతుల సబ్సిడీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా ఐదు కోట్లమంది రైతులు, ఐదు లక్షల కార్మికులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. సొమ్మును రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నట్లు తెలియజేశారు. గత రెండు, మూడేళ్లుగా చక్కెర ఉత్పత్తి మిగులుకు చేరుకున్నందున ధరలు దిగివచ్చినట్లు తెలియజేశారు. ఈ సీజన్(2020-21 అక్టోబర్- సెప్టెంబర్)లో రూ. 3,600 కోట్ల సబ్సిడీలను ప్రతిపాదించినట్లు తెలియజేశారు. (4 నెలల్లో 4 బిలియన్ డాలర్ల దానం) స్పెక్ట్రమ్ వేలం 2016 తదుపరి స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. 700 ఎంహెచ్‌జెడ్ మొదలు, 800, 900, 2100, 2300, 2500 ఎంహెజెడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల స్పెక్ట్రమ్ వేలానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేశారు. 20ఏళ్ల గడువుతో వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 2,251కుపైగా ఎంహెచ్‌జెడ్ రేడియో తరంగాలను విక్రయానికి ఉంచనున్నట్లు తెలియజేశారు. తద్వారా రూ. 3.92 లక్షల కోట్లకుపైగా లభించవచ్చని అంచనా వేశారు. 2021 మార్చిలో వేలాన్ని చేపట్టే వీలున్నట్లు వెల్లడించారు. వేలం విజేతలు ఒకేసారి లేదా విడతల వారీగా చెల్లింపులు చేపట్టవచ్చని తెలియజేశారు. 5జీ ఇలా టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) 5జీ సర్వీసులకు 300 ఎంహెచ్‌జెడ్‌ను ఎంపిక చేసింది. అయితే రక్షణ శాఖ 125 ఎంహెచ్‌జెడ్‌ను వినియోగించుకోనుంది. దీంతో 175 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్ మాత్రమే అందుబాటులో ఉండవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. దేశవ్యాప్త ప్రాతిపదికన ట్రాయ్ 3300-3600 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌లో ఒక్కో ఎంహెచ్‌జెడ్‌కుగాను రూ. 492 కోట్లను బేస్ ధరగా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో 100 ఎంహెచ్‌జెడ్ 5జీ వేవ్స్‌కుగాను రూ. 50,000 కోట్లు లభించవచ్చని అంచనా. -
గవి చెట్టు నుంచి రాలుతున్న చక్కెర
డి.హీరేహాళ్ (రాయదుర్గం) : మండల కేంద్రమైన డి.హీరేహాళ్‌లోని ఎస్సీ కాలనీలో ఒక గవి చెట్టు నుంచి పంచదార రాలుతుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరి, వింతను ఆశ్చర్యంగా చూశారు. శుక్రవారం చెట్టు కింద పడిన తెల్లటి పదార్థాన్ని పరిశీలించారు. చెట్టు నుంచి పంచదార రాలుతున్నట్లు ఆనోటా ఈ నోటా తెలియడంతో డి.హీరేహాళ్‌లోని హిర్దేహాళ్ గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, చెట్టు వద్ద రాలిన చెక్కరను రుచి చూస్తున్నారు. జన విజ్ఞాన వేదిక నాయకులు కెంచె లక్ష్మీనారాయణ కూడా అక్కడకు వచ్చి చెట్టు వద్ద రాలిన పంచదార లాంటి మిశ్రమాన్ని పరిశీలించారు. ఆ మిశ్రమాన్ని వేడినీళ్లలో వేసి, పాకాన్ని కూడా పట్టారు. చక్కెర వాసన వాస్తోంది. నోటిలో వేసుకున్నప్పుడు తీయదనంతో పాటు జిగురు లాంటి పదార్థంలా ఉందని ఆయన తెలిపారు.


