Suddenly checks
-
మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్!
ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయి, స్క్రీన్‌పై వింతైన మెసేజ్ కనిపించే అవకాశం ఉంది. భయాందోళన చెందకండి. ఇది ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు మనల్ని అప్రమత్తం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన అత్యాధునిక ‘సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్’ అయి ఉండవచ్చు. అది ఈ వ్యవస్థలో భాగంగా వస్తున్న టెస్టింగ్ సందేశం మాత్రమే.అసలేం ఏం జరుగుతోంది?నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) సహకారంతో దేశవ్యాప్తంగా విపత్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీన్ని ‘సాచెట్’ (SACHET) అని పిలుస్తారు. ఈ వ్యవస్థ పనితీరును, మొబైల్ నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రభుత్వం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షలను నిర్వహిస్తోంది. అందుకే, మీరు అందుకున్న ఆ ఫ్లాష్ ఎస్ఎంఎస్ ఒక డ్రిల్ మాత్రమే.సందేశం వస్తే ఏం చేయాలి?మీరు ఆ సందేశాన్ని చూసినప్పుడు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి మీరు బదులివ్వాల్సిన లేదా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన పని లేదు. ఇవి కేవలం టెస్టింగ్ మేసేజ్‌లు మాత్రమే. ఒకవేళ మీరు ఈ అలర్ట్‌లను నియంత్రించాలనుకుంటే మీ ఫోన్ సెట్టింగ్స్‌లోని ‘Safety & Emergency’ లేదా ‘Wireless Emergency Alerts’ విభాగంలోకి వెళ్లి మార్చుకునే అవకాశం ఉంటుంది.ఈ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ అనేది సీడాట్ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) సిఫార్సు చేసిన కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ (సీఏపీ) ఆధారంగా ఇది పనిచేస్తుంది. భూకంపాలు, సునామీలు, వరదలు, మెరుపులు వంటి ప్రకృతి వైపరీత్యాలే కాకుండా గ్యాస్ లీకేజీలు లేదా రసాయన ప్రమాదాల వంటి మానవ నిర్మిత అత్యవసర పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది. విపత్తు సంభవించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే ఈ సందేశాలు పంపిస్తారు. తద్వారా అనవసర గందరగోళం తగ్గుతుంది.భవిష్యత్తు ప్రణాళికప్రస్తుతం జరుగుతున్నవి ప్రాథమిక పరీక్షలు మాత్రమే. ఈ పరీక్షల తర్వాత భవిష్యత్తులో ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇది టెస్ట్ ఛానెల్ సెట్టింగులతో సంబంధం లేకుండా అన్ని రకాల మొబైల్ ఫోన్లలోనూ, అన్ని భారతీయ భాషల్లోనూ హెచ్చరికలను పంపగలదు. అంటే, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు దేశంలోని ప్రతి పౌరుడికి ముందస్తు సమాచారం చేరవేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కాబట్టి, తదుపరిసారి మీ ఫోన్ సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్‌తో మోగితే అది మీ భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న ఏర్పాటు అని గుర్తుంచుకోండి. అప్రమత్తంగా ఉండండి.ఇదీ చదవండి: మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన -
నిర్బంధ కేంద్రాల్లో భారతీయులు
వాషింగ్టన్/హూస్టన్: ఇటీవల అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి నిర్బంధానికి గురైన వారిలో వంద మంది వరకు భారతీయులు కూడా ఉన్నారు. న్యూ మెక్సికో రాష్ట్రంలోని నిర్బంధ కేంద్రంలో 40 నుంచి 45 మంది, ఓరెగాన్ రాష్ట్రంలోని కేంద్రంలో మరో 52 మంది భారతీయులు ఉన్నారనీ, ఆ రెండు నిర్బంధ కేంద్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 52 మందిలో అత్యధికులు సిక్కులు, క్రైస్తవులేనని అధికారులు చెప్పారు. ‘ఓరెగాన్‌లోని నిర్బంధ కేంద్రాన్ని ఇప్పటికే మా అధికారి సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. న్యూ మెక్సికోలోని కేంద్రానికి కూడా మరో అధికారి వెళ్తారు’ అని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడి జైళ్లలో మగ్గుతున్న భారతీయుల్లో అత్యధికులు సిక్కులే ఉంటున్నారు. 2013–17 మధ్యలో దాదాపు 27 వేల మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ నిర్బంధానికి గురవ్వగా, చాలామంది ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు. నిర్బంధ కేంద్రం సందర్శించిన మెలానియా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ శుక్రవారం టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ కేంద్రంలో హొండురాస్, గ్వాటెమాలా, ఎల్‌సాల్వడార్ దేశాలకు చెందిన 55 మంది చిన్నారులు ఉండగా వారితో మెలానియా నేరుగా మాట్లాడారు. అక్కడి సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వాధికారులతో మాట్లాడుతూ.. పిల్లలను తమ తల్లిదండ్రుల వద్దకు వీలైనంత తొందరగా చేర్చడానికి తన నుంచి ఎలాంటి సాయం కావాలో చెబితే చేస్తానని ఆమె హామీనిచ్చారు. అయితే నిర్బంధ కేంద్రానికి బయల్దేరే ముందు మెలానియా ధరించిన వస్త్రాలపై ‘ఐ రియల్లీ డోంట్ కేర్. డూ యూ?’ (నేను ఏ మాత్రం లెక్కచేయను. మీరు చేస్తారా?) అని రాసి ఉండటం వివాదాస్పదమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య ధరించిన వస్త్రాలపై స్పందిస్తూ ‘ఆమె వస్త్రాలపై రాసిన వ్యాఖ్యలు నకిలీ వార్తల మీడియాను ఉద్దేశించినవి’ అని ట్వీట్ చేశారు. -
తిరుమలలో అర్థరాత్రి తనిఖీలు
తిరుమలలో శుక్రవారం అర్థరాత్రి టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వి. దేవేం ద్రరెడ్డి అకస్మాత్తుగా తనిఖీలు చేశారు. రెవెన్యూ, పంచాయతీ బృందంతో కలిసి శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి 11.45 గంటల వరకు ప్రధాన దుకాణ సము దాయం, రావిచెట్టు, కల్యాణకట్ట, ఆస్థాన మండపం తదితర ప్రాంతాల్లోని దుకాణాలను తనిఖీలు చేశారు. ఆక్రమణలను తొలగించారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు సాగిస్తున్న పలు దుకాణదారులను ఆయన తీవ్రంగా మందలించారు. నిబంధనలు పాటించకపోతే సరుకులను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని గుర్తు చేశారు. తరచూ ఆక్రమణలు చేసే దుకాణదారులపై కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇకపై తరచూ పగలే కాకుండా రాత్రి వేళ్లల్లోనూ అన్ని విభాగాలతో కూడిన టాస్క్‌ఫోర్స్ దుకాణాలను తనిఖీ చేస్తుందని గుర్తు చేశారు. భక్తులకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యాపారాలు సాగించవద్దని, టీటీడీ నిబంధనలను పాటించాలని సూచన చేశారు.


