breaking news
street kids
-
Railway Children India వీళ్లు పిల్లల్ని రక్షిస్తారు
తల్లిదండ్రుల మీద కోపంతోనో, చదువుకోవడం నచ్చకో, ఇతరేతర కారణాలతో చిన్నపిల్లలు ఇల్లు వదిలి పారితుంటారు. మరికొందరు ప్రయాణాల సందర్భాల్లో తల్లిదండ్రుల నుంచి తప్పిపోతుంటారు. అటువంటివారు ఎక్కడెక్కడో తిరిగి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. వారిలో కొందరు తిరిగి సొంతవారిని చేరుకుంటే, చాలామంది అక్కడే జీవిస్తుంటారు. సొంతవారిని చేరుకోలేక దూరమయ్యేవారు కొందరైతే, అసాంఘిక శక్తుల చేతిలో పడి బాలకార్మికులుగా, బిచ్చగాళ్లుగా మారేవారు చాలామంది ఉంటారు. మరి వారికి ఎవరు రక్షణ కల్పిస్తారు? అలాంటి వారి కోసం ఓ సంస్థ ఉందని మీకు తెలుసా? అదే ‘రైల్వే చిల్డ్రన్’. ‘రైల్వే చిల్డ్రన్ ఇండియా’ (railway children india) అనేది 2013లో ప్రారంభించిన ఎన్జీవో. ’ఏ బిడ్డ కూడా వీధుల్లో నివసించాల్సిన అవసరం లేని ప్రపంచాన్ని సృష్టించడం’ అనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించారు. భారతదేశంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక పిల్లవాడు రైల్వే స్టేషన్ కు ఒంటరిగా వస్తున్నాడని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటువంటివారు దోపిడీదారుల బారిన పడి అక్రమ రవాణాకు గురవుతున్నట్లు గుర్తించిన కొందరు ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 50 వేల మంది రైల్వే సిబ్బందికి శిక్షణ ఇచ్చింది.ఇప్పటివరకు సుమారు 15 లక్షల మంది పిల్లలను రక్షించింది. వారంతా ఇంట్లో సురక్షితంగా ఉన్నారు. చదువుకుంటూ తమ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు. ముందుగా వీరు రోడ్ల మీద, స్టేషన్ ప్లాట్‌ఫాంల మీద ఒంటరిగా ఉన్న చిన్నారుల్ని గుర్తిస్తారు. వారితో మాట్లాడతారు. వారి కుటుంబసభ్యుల వివరాలు సేకరిస్తారు. వారు వచ్చేలోగా పిల్లలకు తిండి, బట్టలు అందిస్తారు. వారు ఉండేందుకు ఏర్పాట్లు చేస్తారు. తల్లిదండ్రులు వచ్చాక వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పిల్లల్ని అప్పగిస్తారు. ఇలా నిత్యం వందలాది మంది చిన్నారుల్ని రక్షిస్తున్నారు. స్టేషన్ లో తప్పిపోయిన పిల్లలెవరైనా వీరిని సంప్రదిస్తే వారు వివరాలు వెతికి పిల్లల్ని తమ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తారు. దీంతోపాటు నిరుపేద చిన్నారులకు చదువు చెప్పడం, వారి హక్కుల కోసం పోరాడటం, వారి ఆరోగ్య కోసం పాటుపడటం చేస్తుంటారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న సభ్యుల ద్వారా వారు సేవలందిస్తున్నారు. ప్రజల నుంచి విరాళాలు సేకరించి సంస్థను నడుపుతున్నారు. వారి వల్ల ఎంతోమంది చిన్నారులు చెడ్డవారి నుంచి తప్పించుకొని అమ్మానాన్నల్ని చేరుకున్నారు. -
లిటిల్ స్టార్స్ ఇన్ ఫైవ్‌స్టార్
ఒక వ్యక్తి కొంత మంది పిల్లలను ఫైవ్‌స్టార్ హోటల్‌కు తీసుకువెళ్లి వారికి ఇష్టమైన పదార్థాలు తినిపించిన వీడియో వైరల్ అయింది. ఆ పిల్లలకు ఈయన తండ్రి కాదు. కనీసం దూరపుచుట్టం కాదు. వీరు వీధిబాలలు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో 39 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. కవల్చాబ్ర అనే వ్యక్తి కారు ట్రాఫిక్ జామ్‌లో నిలిచిపోయినప్పుడు కొందరు పిల్లలు కారు అద్దాలను తుడవడం మొదలు పెట్టారు. వారిని చూడగానే చాబ్రకు ‘అయ్యో!’ అనిపించింది. వెంటనే పిల్లలను కారులో కూర్చోబెట్టుకొని ఫైస్టార్ హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఈ వైరల్ వీడియో ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తోంది. -
'వీధి బాలలకూ ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు'
చెన్నై: దేశవ్యాప్తంగా వీధి బాలలకు కూడా ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని కేంద్ర శిశు, మహిళా శాఖ మంత్రి మేనకా గాంధీ మంగళవారం తెలిపారు. చెన్నైలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బాలల భద్రత , రక్షణ కోసం కేంద్రం అమలుచేస్తోన్న కార్యక్రమాలను ప్రస్తావించారు. ‘మనుషుల అక్రమ రవాణా బిల్లు-2016’ ముసాయిదాపై పౌర సంఘాలతో ఆమె సంప్రదింపులు జరిపారు.


