breaking news
Street dog attack
-
వీధి కుక్కలు రాసిన మరణ శాసనం
జైపూర్ : ‘తల్లి మీరిక్కడే ఆడుకోండి. నేను బజారుకెళ్లి వస్తానంటూ ఓ తాత తన మనువరాలికి జాగ్రత్త చెప్పి వెళ్లాడు. కానీ ఆ చూపే తన మనువరాలిని చూసే చివరి చూపవుతుందనుకోలేదు.’ ఇంతకి ఏం జరిగిందంటే..రాజస్థాన్(rajastan)లోని అల్వార్ జిల్లాలో ఇక్రానా తన తాత, ఐదుగురు స్నేహితులతో కలిసి పొలానికి వెళ్లింది. పొలం పనిచేసిన అంనతరం తాత స్థానికంగా ఉండే మార్కెట్‌కు వెళ్లాడు. వెళ్లే సమయంలో మనువరాలికి జాగ్రత్త చెప్పి వెళ్లాడు.తాత మాట విన్న ఆ మనువరాలు తన స్నేహితులతో పొలంలోనే ఆడుకుని సాయంత్రం ఇంటికి బయలు దేరింది. మార్గం మధ్యంలో 7-8 వీధి కుక్కలు (street dogs) ఇక్రానా,ఆమె స్నేహితులపై దాడి చేశాయి. కుక్కుల దాడితో భయాందోళనకు గురైన చిన్నారులు బిగ్గరుగా కేకలు వేశారు. చిన్నారుల కేకల విన్న పక్కనే పొలం పనులు చేస్తున్న రైతులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పిల్లల్ని కుక్కల దాడి నుంచి కాపాడారు. అత్యవసర చికిత్స నిమిత్తం ట్రాక్టర్లో తరలించారు.అయితే, ఆ వీధి కుక్కల్లోని ఓ కుక్క మాత్రం ఇక్రానాను వదిలి పెట్టలేదు. వెంటపడి మరీ కరిచింది. ట్రాక్టర్లో తరలిస్తున్నా ఇంకా కరించేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకే కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారుల్ని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఈ దుర్ఘటనలో ఇక్రానా మరణించింది. ఇక్రానాపై దాడి చేసిన కుక్క గతంలో ఇతర జంతువులపై దాడి చేసిందని, అందువల్లే బాలిక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 👉చదవండి : వృద్ధురాలిపై వీధి కుక్కల దాడి, వైరల్ వీడియో -
చిన్నారిపై వీధి కుక్కల దాడి
అగనంపూడి: గ్రామ సింహాలు చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన విశాఖలో జరిగింది. జీవీఎంసీ 85వ వార్డు ఫార్మాసిటీ నిర్వాసిత కాలనీ పానకాలయ్యపేట బోనంగికి చెందిన సిద్ధనాతి నూక అప్పారావు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి అప్పారావు భార్య లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటుండగా, అప్పారావు పనిమీద బయటకు వెళ్లాడు.రోడ్డు మీద ఆడుకుంటున్న వీరి కుమార్తె యక్షిత (3)పై రెండు వీధి కుక్కలు దాడి చేయగా శరీరం వెనుక భాగం, మెడ, తలపై కూడా తీవ్రంగా గాట్లు పడ్డాయి. స్థానికులు కుక్కలను తరిమికొట్టి పాపను రక్షించి కేజీహెచ్‌కు తరలించారు. ప్రాణాపాయ స్థితి తప్పినట్లు వైద్యులు చెప్పారు. -
చిన్న పిల్లోడు...20 కుక్కలు ఒకేసారి..!
-
పిల్లల ప్రాణాలు పోతున్నాయ్.. హైకోర్టు సీరియస్
హైదరాబాద్, సాక్షి: వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారని, ఉదాసీనంగా వ్యవహరించే అధికారుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హెచ్చిరించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (PIL) బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బాగ్ అంబర్‌పేటలో ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయాడు. అయితే ఈ ఉదంతాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. జీహెచ్ఎంసీ పరిధిలో తరచూ వీధి కుక్కల దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విక్రమాదిత్య అనే న్యాయవాది హైకోర్టులో పిల్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఇవాళ వీధి కుక్కల నియంత్రణ చర్యలపై నివేదిక ఇచ్చింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో కుక్కల నియంత్రలకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తన కౌంటర్లో పేర్కొంది. అయితే.. ప్రభుత్వం దృష్టిసారించాల్సిన ఖరీదైన కాలనీలపై కాదని.. మురికివాడలపై అని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు ప్రభుత్వం చూపించిన లెక్కలపైనా స్పందిస్తూ.. తమకు గణాంకాలు అక్కర్లేదని.. చర్యలు తీసుకుంటే చాలని సూచించింది. అయితే ఇందుకు సంబంధించిన రూల్స్ రూపొందించామని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేయగా.. .. రూల్స్ ఎప్పుడూ ఉంటాయని, కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారని సీజే బెంచ్ వ్యాఖ్యానించింది. ఉదాసీనంగా వ్యవహరించే అధికారుల్ని వదిలిపెట్టమని హెచ్చరించిన ధర్మాసనం.. ఈ వ్యవహారాన్ని ఓ కేసుగా కాకుండా మానవీయ కోణంలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అభిపప్రాయపడింది. వీధి కుక్కల నియంత్రణకు నిపుణుల కమిటీని వారంలోగా ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జులై 18వ తేదీకి వాయిదా వేసింది. -
అంబర్‌పేట ఘటన.. పోలీస్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై స్థానిక పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. మూడు రోజుల పాటు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే అంబర్‌పేట పోలీసులు శుక్రవారం కేసు వైపు అడుగేశారు. సీఆర్పీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే.. కేసులో ఎవరినీ నిందితులుగా చేర్చలేదు. మరోవైపు ఈ ఉదంతాన్ని మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకున్న కోర్టు.. గురువారం విచారణ సందర్భంగా జీహెచ్ఎంసీ తీరుపై ఆగ్రహం వెల్లగక్కింది. -
ఆ వీడియో ఇలాంటి టైంలో షేర్ చేస్తారా?.. యంగ్ డైరెక్టర్‌పై నెటిజన్ ఫైర్!
హైదరాబాద్‌లో బాలుడిని వీధికుక్కలు చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నగరంలోని అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరూ అయ్యోపాపం అనకుండా ఉండలేరు. అలాగే ఈ ఘటనపై టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ క్రమంలోనే ఆ వీడియోను తన ట్విటర్లో షేర్ చేశాడు. ఇది చూసిన ఓ నెటిజన్ యంగ్ డైరెక్టర్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్దం మెుదలైంది. ఆ వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంపై ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. డైరెక్టర్ సాయి రాజేశ్ సైతం ఆ నెటిజన్‌కు గట్టి కౌంటరే ఇచ్చాడు. ఓ జర్నలిస్టు షేర్ చేసిన ఈ వీడియోను పంచుకున్నారు సాయిరాజేష్. దీంతో ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి వీడియోలను ఎలా షేర్ చేస్తారు. నువ్వు అసలు మనిషివేనా. చాలా సున్నితమైన ప్రజలు కూడా ఉంటారు. ఇలాంటి వీడియోలు షేర్ చెయ్యడం తప్పు.' అని ఆ నెటిజన్ ఫైర్ అయ్యాడు. డైరెక్టర్ రాజేశ్‌కు కోపం తెప్పించింది. నువ్వు సెన్సిటివ్ అయితే సమాజంలో కనిపించకుండా ఇంట్లో కూర్చో అంటూ ఘాటుగా స్పందించాడు. అయితే కొందరేమో సాయిరాజేశ్‌ను సమర్థిస్తుంటే.. మరికొందరు ఆ నెటిజన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా.. డైరెక్టర్ సాయి కొబ్బరి మట్ట, కలర్ ఫోటో, హృదయకాలేయం లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘బేబి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. For people who cannot see such things please unselect this setting instead of making noise pic.twitter.com/7bLoSaArrc — Atom (@Gautam54938900) February 21, 2023 -
బాలుడి ప్రాణానికి బాధ్యులు ఎవరు..?
-
వీధి కుక్క కాటు ఏ విధంగా ప్రమాదకరం..?
-
విశ్వనగరానికి వీధికుక్కల బెడద.. మూడు రెట్లు పెరిగిన ఘటనలు
రాష్ట్రంలో వీధి కుక్కలు పేట్రేగిపోతున్నాయి. కాలనీలు, బస్తీల్లో స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. కొన్నిచోట్ల క్రూర మృగాల్లా రెచి్చపోతూ పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌లోనూ వీటి బెడద తప్పడం లేదు. సోమవారం బాగ్ అంబర్‌పేటలో కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ నాలుగేళ్ల బాలుడు మరణించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో కూడా ఇద్దరు చిన్నారులపై కూడా కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. 2022లో నవంబర్ నాటికే 80,281 కుక్కకాట్లు రాష్ట్రంలో కుక్కకాటు కేసులు ఏడాది కాలంలోనే గణనీయంగా పెరిగాయి. నాలుగేళ్ల క్రితం భారీగా ఉన్న కేసులు.. మరుసటి రెండేళ్లు తగ్గగా.. తర్వాత నాలుగో ఏడాది మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2021లో 24,124 కుక్క కాట్లు సంభవించగా, 2022లో నవంబర్ నాటికే ఏకంగా 80,281 మందిని కుక్కలు కరిచినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నివేదిక వెల్లడించింది. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా మూడురెట్లకు పైగా కుక్కకాట్లు జరిగాయి. దేశంలో కుక్కకాట్లలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 2019లో 1.67 లక్షల కాట్లు, 2020లో 66,782 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సమస్య తీవ్రం హైదరాబాద్‌లోని ఐపీఎంకు కుక్క కాట్లకు గురై చికిత్స కోసం వస్తున్నవారు నెలకు 2,000– 2,500కు పైగా ఉంటుండగా, నిజామాబాద్, కరీంనగర్ వంటి నగరాల్లో నెలకు 400 వరకు కుక్కకాటు కేసులు నమోదు కావడం.. వాటి బెడద ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఇక హైదరాబాద్‌తో పాటు జీహెచ్ఎంసీని ఆనుకొని ఉన్న జవహర్‌నగర్, బడంగ్‌పేట, బండ్లగూడ, మీర్‌పేట, జిల్లెలగూడ, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేటల్లో వీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. జవహర్‌నగర్‌లో డంపింగ్ స్టేషన్ కుక్కలకు ప్రత్యేక ఆవాస కేంద్రంగా తయారైంది. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్లలో వెటర్నరీ విభాగాలున్నా, అవి నామమాత్రంగా కొనసాగుతున్నాయి. వీధి కుక్కలు పెరిగిపోవడానికి, నగరాల్లో ఏటా వేల సంఖ్యలో కుక్కకాటు కేసులు నమోదవడానికి ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో అధికార యంత్రాంగాల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, గ్రేటర్ వరంగల్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లలో వీధికుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు తక్కువేనన్న విమర్శలూ ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో ఈ ఏడాది కుక్కల సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలను కూడా నిలిపివేసినట్లు సమాచారం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లా కేంద్రాలలో జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసిన మునిసిపల్ శాఖ స్టెరిలైజేషన్ (సంతాన నియంత్రణ) చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక కుక్క, దాని పిల్లలు..పిల్లల పిల్లలు! ఒక కుక్క దాని పిల్లలు కలిపి ఏడాది కాలంలో దాదాపు 42 కుక్క పిల్లలను పెడతాయి. వాటి పిల్లలు.. పిల్లల పిల్లలు ఇలా మొత్తం ఏడేళ్ల కాలంలో దాదాపు 4 వేల కుక్కలు పుడతాయని అంచనా. ఇలా కుక్కల సంతతి అభివృద్ధి చెందుతున్నా వాటిని తగ్గించే కార్యక్రమాలు అంత చురుగ్గా సాగడం లేదు. దీంతో వీధికుక్కల సంఖ్య తగ్గడం లేదు. స్టెరిలైజేషన్తోనే నియంత్రణ.. వీధి కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ ఒక్కటే మార్గం. అంటే కుక్కల పునరుత్పత్తి ప్రక్రియను నియంత్రించేలా శస్త్రచికిత్సలు చేయడం. మొత్తం కుక్కల్లో ఆడకుక్కలన్నింటికీ ఒకేసారి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు జరిగితేనే కుక్కల సంతతి తగ్గుతుంది. ఏటా వేలాది కుక్కలకు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు ఆయా కార్పొరేషన్ల వెటర్నరీ విభాగాల అధికారులు చెపుతున్న మాటలన్నీ డొల్ల మాటలేనని కుక్కల సంఖ్య పెరిగిపోతున్న తీరు స్పష్టం చేస్తోంది. ఒక్క వరంగల్ కార్పొరేషన్లోనే సుమారు 60 వేలకు పైగా వీధికుక్కలు ఉన్నట్లు అధికారులు లెక్కలేశారు. ఇక్కడ కుక్కల సంతాన నియంత్రణ కోసం ఓ ప్రైవేటు ఎన్జీవోకు శస్త్ర చికిత్సల బాధ్యత అప్పగించారు. ఒక కుక్కకు స్టెరిలైజేషన్ చేస్తే కార్పొరేషన్ రూ.750 చెల్లిస్తోంది. ప్రతిరోజు 20 కుక్కల వరకు పట్టుకొని ఆపరేషన్లు చేస్తున్నట్లు ఎన్జీవో సంస్థ చెపుతున్నప్పటికీ, వేలల్లో ఉన్న కుక్కల సంతతి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు 20 నుంచి 30 కుక్క కాటు కేసులు ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, రామగుండంలలో కార్పొరేషన్ అధికారులే కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ చేపట్టినా, అవి ఎంతోకాలం సాగలేదు. కరీంనగర్లో స్టెరిలైజేషన్ పేరుతో కుక్కలను చంపుతున్నట్లు ఓ స్వచ్చంద సంస్థ పేర్కొనడంతో ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు. రామగుండం పూర్తిగా కోల్‌బెల్ట్ ఏరియా కావడం, ఓపెన్ నాలాలు ఎక్కువగా ఉండడంతో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. కొత్తవారు ఎవరు కనిపించినా పిక్కలు పీకేసే పరిస్థితి ఈ కాలరీస్‌లో ఉంది. కరీంనగర్, నిజామాబాద్ నగరాల్లో ప్రతి నెల 400 వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. ఖమ్మంలో 2021లో కుక్కల స్టెరిలైజేషన్ కార్యక్రమం ప్రారంభించిన కార్పొరేషన్ అధికారులు సుమారు 2,500 కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. కానీ తర్వాత ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా వీధికుక్కల గుంపులే కనిపిస్తున్నాయి. 29,789 కుక్కలకు స్టెరిలైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వీధికుక్కల సంతతిని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పురపాలక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 20 జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాల్లో 29,789 కుక్కలకు సంతతి నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపింది. నగరాలు, మునిసిపాలిటీలలో ప్రజలకు ఇబ్బందిగా మారిన కుక్కలతో పాటు కోతులను కూడా ఈ సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు తెలిపింది. కుక్కలకు ఆహారం దొరక్కే..: మేయర్ విజయలక్ష్మి గ్రేటర్ నగరంలో 2022 జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 20 మధ్యకాలంలో 5,70,729 కుక్కలుండగా 4,01,089 కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేసినట్లు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి చెప్పారు. అంబర్‌పేట ఘటనలో కుక్కలకు ప్రతిరోజూ ఆహారం వేసే వారు రెండురోజులుగా వేయనందునే ఆకలికి తట్టుకోలేక బాలునిపై దాడి చేసి ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతిరోజూ కుక్కలకు మాంసం వేసే దుకాణాలు వారు దుకాణాలు మూసేసినా అలాగే వ్యవహరిస్తాయని చెప్పారు. ఇదొక ప్రమాదం మాత్రమేనంటూ.. బాలుడు మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నగరంలో మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆహారం కోసం నగరాలకు.. గతంలో వీధి కుక్కలు గ్రామాల్లో ఎక్కువగా ఉండేవి. అయితే నగరాల్లో వాటికి ఆహారం ఎక్కువ మొత్తంలో లభ్యమవుతుండడంతో వాటి సంఖ్య భారీగా పెరిగింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి వదిలేయకుండా.. వీధికుక్కల సమస్యపై కార్పొరేషన్లకు ప్రజలు ఫోన్లు చేసినప్పుడు స్పందించి ఆయా బస్తీలు, కాలనీల్లోని కుక్కలను తీసుకెళ్లి స్టెరిలైజేషన్ చేసి దూరంగా వదిలేస్తే ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చని ప్రజలు అంటున్నారు. ఆడకుక్కలన్నిటికీ ఆపరేషన్లు చేయాలి హైదరాబాద్‌లో కుక్కల సంఖ్య తగ్గించేందుకు ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) కార్యక్రమాలు నిబంధనల కనుగుణంగా జరగడం లేవని, అవినీతి జరుగుతోందని జంతు ప్రేమికురాలు, సంబంధిత అంశాలపై అవగాహన ఉన్న డాక్టర్ శశికళ తెలిపారు. జైపూర్, గోవాల్లో ఈ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని చెప్పారు. ఆడ కుక్కలన్నింటికీ ఆపరేషన్లు చేయడంతో పాటు మగవాటికి సంతానోత్పత్తి వయసు వచ్చే సమయంలోనే (8–12 నెలల మధ్య) సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేస్తున్నారన్నారు. వీటితో పాటు ‘మిషన్ ర్యాబిస్’పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తారని, కుక్కల బారిన పడకుండా ఎలా వ్యవహరించాలి, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. అసోంలోనూ కొన్ని సంస్థలు ఇలా పనిచేస్తున్నాయని వివరించారు. మాయమైన ‘మాఇంటి నేస్తం’.. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ లోపం వల్ల, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల కుక్కల సంచారం పెరుగుతోంది. వీటి సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా దాదాపు ఐదేళ్ల క్రితం వీధికుక్కలను పెంచుకునే పథకం ‘మా ఇంటి నేస్తం’ప్రారంభించారు. అప్పట్లో 3 వేల వీధికుక్కల్ని ఆసక్తి ఉన్నవారికి దత్తత ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆ పథకం కనుమరుగైంది. అది కొనసాగినా వీధికుక్కల సంఖ్య తగ్గి ఉండేదనే అభిప్రాయాలున్నాయి. హైదరాబాద్ నగరంలో కుక్కలను కట్టడి చేయాలని దాదాపు 8 నెలల క్రితం హైకోర్టు ఆదేశించినప్పటికీ చర్యల్లేక పోవడం విచారకరం. హైదరాబాద్ ఐపీఎంలో 2022 జనవరి నుంచి 2023 జనవరి వరకు నమోదైన కుక్కకాటు కేసులు నెల కేసులు 2022 జనవరి 2,286 ఫిబ్రవరి 2,260 మార్చి 2,652 ఏప్రిల్ 2,540 మే 2,569 జూన్ 2,335 జూలై 2,201 ఆగస్టు 2,272 సెపె్టంబర్ 2,177 అక్టోబర్ 2,474 నవంబర్ 2,539 డిసెంబర్ 2,554 2023 జనవరి 2,580 ––––––––––––––––––––– హైదరాబాద్‌లో గతంలో... – 2016 ఫిబ్రవరి 12న కుషాయిగూడలో కుక్కలు దాడి చేయడంతో 8 ఏళ్ల బాలిక మృతి. – 2020లో అమీర్‌పేటలో ఒకేరోజు 50 మంది కుక్కకాట్ల బారిన పడ్డారు. – 2020 ఆగస్టులో లంగర్‌హౌస్‌లో నలుగురు చిన్నారులకు గాయాలు – 2022 డిసెంబర్ 12న పీర్జాదిగూడలో చిన్నారికి తీవ్రగాయాలు. – 2021 జనవరి 30న బహదూర్‌పురాలో 8 ఏళ్ల బాలుడు మృతి. – 2017లో 14 మంది, 2018లో 9 మంది కుక్కకాట్ల వల్ల మరణించారు. ఇలా ఏటా కుక్కకాట్ల వల్ల మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. –––––––––––––––– ప్రతిసారీ 4–8 పిల్లలు – కుక్కల జీవిత కాలం 8–12 సంవత్సరాలు. – 8 నెలల వయసు నిండేటప్పటికి సంతానోత్పత్తి సామర్ధ్యం వస్తుంది. – కుక్కల గర్భధారణ సమయం 60–62 రోజులు – ఒక్కో కుక్క సంవత్సరానికి రెండు పర్యాయాలు సంతానోత్పత్తి చేస్తుంది. – సంతానోత్పత్తి జరిపిన ప్రతిసారీ 4–8 పిల్లలు పెడుతుంది. ––––––––––––––––––––– పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం: కేటీఆర్ అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడు మరణించడం బాధాకరమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. వీధికుక్కల దాడిలో గాయపడి మరణించిన బాలుడి కుటుంబానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కలు, కోతుల సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీనిపై జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులతో ఈ నెల 23 న ఉదయం 11.00 గంటలకు మాసాబ్‌ట్యాంక్‌లోని తమ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు సుజాతనగర్: కుక్కల దాడిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్, బేతంపూడి గ్రామాల్లో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. సుజాతనగర్‌లోని సుందరయ్యనగర్‌కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఫజీమా మంగళవారం స్థానిక అంగన్వాడీ సెంటర్ నుంచి ఇంటికి వస్తుండగా.. ఒక్కసారిగా వచి్చన కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఫజీమా చేతికి గాయాలు కాగా.. స్థానికులు కుక్కలను తరిమేశారు. బేతంపూడిలో ఇంటి వద్ద ఆడుకుంటున్న యశ్వంత్ అనే బాలుడిపై అకస్మాత్తుగా వచి్చన వీధి కుక్కలు దాడి చేసి గొంతుపై కరిచాయి. కుక్కల నుంచి బాలుడిని విడిపించేందుకు వెళ్లిన గ్రామస్తుడు బానోత్ లాలుపై కూడా దాడి చేయగా స్థానికులు వాటిని తరిమేశారు. అసలేం జరిగింది.. హైదరాబాద్‌లో తండ్రితో కలిసి అతను పనిచేసే చోటుకు వెళ్లిన బాలుడు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించడం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన గంగాధర్ జీవనోపాధి కోసం నగరానికి వచ్చి భార్యాపిల్లలతో కలిసి బాగ్‌అంబర్‌పేటలో నివాసముంటున్నాడు. ఛే నంబర్లోని కార్ల సరీ్వసింగ్ సెంటర్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 19న తన కుమారుడు ప్రదీప్ (4), కుమార్తెతో కలిసి కారు సరీ్వసింగ్ సెంటర్‌కు వెళ్లాడు. పిల్లల్ని ఆడుకొమ్మనిచెప్పి విధుల్లో నిమగ్నమయ్యాడు. ప్రదీప్ అక్కడ ఆటవిడుపుగా ఒంటరిగా తిరుగుతున్న సమయంలో కుక్కల గుంపు ఒకటి అకస్మాత్తుగా దాడి చేసింది. బాలుని అక్క గమనించి కేకలు వేయడంతో గంగాధర్‌తో పాటు ఇతర సెక్యూరిటీ గార్డులు వచ్చి కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ ప్రదీప్‌ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు చెప్పారు. -
హైదరాబాద్ అంబర్ పేటలో విషాదం
-
దొంగ అనుకుని బాలుడిపై ఫామ్‌హౌస్ యజమాని దారుణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. దొంగ అని భావించి 16 ఏళ్ల బాలుడిని ఓ ఫామ్‌హౌస్ యజమాని కర్రతో చితకబాదాడు. అనంతరం ఆ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఎంత అరిచినా సాయం చేసేవారు లేక తీవ్ర గాయాలతో కొన్ని గంటలపాటు నరకయాతన అనుభవించిన బాధితుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ డ్రైవర్ కుమారుడైన సందీప్ మహతో(16) బుధవారం ఉదయం 11 గంటలకు తన ఇద్దరు స్నేహితులతో కలిసి కపాషెరా సరిహద్దు ప్రాంతంలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు వారిని దొంగలుగా భావించి, యజమాని ప్రకృత్ సాంధూను అప్రమత్తం చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న యజమాని సాంధూ బాలుడు సందీప్‌ను బంధించాడు. మిగతా ఇద్దరు స్నేహితులు భయంతో పారిపోయారు. సందీప్‌ను ఫామ్‌హౌస్ యజమాని కర్రతో చితకబాదాడు. దీంతో బాలుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి తప్పించుకున్న బాలుడు కొంతదూరంలో రోడ్డుపై పడిపోయాడు. ఎంత అరిచినా ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇంతలో వీధి శునకాలు అతడిపై దాడి చేశాయి. కొన్ని గంటల తర్వాత సందీప్ మరణించాడు. సాయంత్రం 4.30 గంటలకు ఓ వాహనదారుడు పోలీసులకు సమాచారం అందించాడు. సందీప్ మృతికి కారణమైన ఫామ్‌హౌస్ ఓనర్ ప్రకృత్ సాంధూ(35)తోపాటు రోహిత్(20), అతడి తండ్రి బినోద్ ఠాకూర్(62)ను అదుపులోకి తీసుకొని, హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
నరకయాతన
- వీధి కుక్కదాడిలో బాలుడికి తీవ్ర గాయాలు - తలపై చర్మం తెగి విలవిల - ఆర్థిక ఇబ్బందులతో ఆస్పత్రికి కాలినడకన - చూపరులను కలచివేసిన ఘటన హైదరాబాద్: ఉదయాన్నే వీధిలో నడుచుకుంటూ వెళుతున్న ఓ బాలునిపై వీధికుక్క దాడిచేసింది. తలపై పది అంగుళాల మేర చర్మాన్ని కొరికేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మాసబ్‌ట్యాంక్ చాచానగర్ పార్క్ సమీపంలో నివాసముంటున్న నాగరాజు కుమారుడు శివ(9) ఆదివారం ఉదయం 7 గంటలకు వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వీధి కుక్క బాలునిపై దాడిచేసి తల కుడి చెవిపైభాగంలో కరిచింది. దీంతో పది అంగుళాల మేర మాంసం ముద్దతోపాటు చర్మం లేచిపోయి పుర్రె ఎముక బయటకు వచ్చింది. అదే విధంగా ఎడమ చెవి భాగంలో భుజాలు, చేతులపై కరిచి గాయపర్చింది. అది గమనించిన బాటసారులు కుక్కను కొట్టి తరిమేశారు. తీవ్ర గాయాలతో రక్తం ఓడుతున్న బాలున్ని తల్లిదండ్రులు చికిత్సల కోసం ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. బాలుని తలపై ఉన్న కుక్కకాటు గాయాలను శుభ్రం చేసిన వైద్యులు 15 వాయిల్స్ రిగ్ ఇంజెక్షన్లు ఇచ్చారు. తలపై గాయాలు తీవ్రంగా ఉండడంతో తదుపరి చికిత్సల కోసం బాలున్ని ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. ఆర్ధిక భారంతో కాలినడకన వచ్చిన బాధితులు కుటుంబ సభ్యులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో కుక్క దాడిలో గాయపడిన బాలున్ని మాసబ్ ట్యాంక్ నుంచి కాలి నడకన ఫీవర్ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. తిరిగి ఉస్మానియా ఆస్పత్రికి కూడా నడిచి వెళుతుండగా... గమనించిన ఓ వ్యక్తి సహృదయంతో ఆటో చార్జీలకు డబ్బులు ఇచ్చారు.