breaking news
stops updates
-
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు గుడ్‌బై
శాన్ ఫ్రాన్సిస్కో: ఒకప్పుడు వెబ్ బ్రౌజర్‌కు పర్యాయపదంగా నిల్చిన మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (ఐఈ) పూర్తిగా కనుమరుగు కానుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కి సాంకేతిక సహకారాన్ని మైక్రోసాఫ్ట్ నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో నెటిజన్లు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో తమ అనుభవాలను ట్విటర్లో (సానుకూలంగాను, ప్రతికూలంగాను) పంచుకున్నారు. అయితే, ఇది ఎకాయెకిన చోటు చేసుకున్న పరిణామం కాదు. 2022 జూన్ 15 నుంచి ఐఈని నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ గతేడాదే ప్రకటించింది. 2015 లో ప్రవేశపెట్టిన కొత్త ఎడ్జ్ బ్రౌజర్‌ను వినియోగించుకోవచ్చని సూచించింది. ‘ఐఈతో పోలిస్తే ఎడ్జ్ మరింత వేగవంతమైన, సురక్షితమైన, ఆధునిక బ్రౌజర్‘ అని 2021 మేలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఎంటర్ప్రైజ్ జనరల్ మేనేజర్ షాన్ లిండర్సే ఒక బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. -
ఆ ఫోన్ల యూజర్లకు వాట్సాప్ షాక్
మీరు ఇంకా పాత సాఫ్ట్ వేర్ వెర్షన్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారా?. అయితే, ఈ ఏడాది తర్వాత ఆ ఫోన్లలో వాట్సాప్ మెసేంజర్ అప్ డేట్స్ రావు. భారత్ లో స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్న 95శాతం మంది వాట్సాప్ ను కూడా వినియోగిస్తుండటం గమనార్హం. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్లను విడుదల చేసే వాట్సాప్.. పాత స్మార్ట్ ఫోన్ వెర్షన్లకు అప్ డేట్స్ ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వాట్సాప్ ఓ ప్రకటన విడుదల చేసింది. కొన్ని సింబియన్, బీబీఓఎస్(బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టం), విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ల పాత వెర్షన్లలో డిసెంబర్ 31 తర్వాత వాట్సాప్ అప్ డేట్స్ ను నిలిపివేయనున్నట్లు చెప్పింది. 2017 నుంచి మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల హవా పెరుగుతుందనే ఊహాగానాల నడుమ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా పాత సాఫ్ట్ వేర్ వెర్షన్లు కలిగిన ఫోన్లలో వాట్సాప్(అప్ డేట్స్ ఆగిపోయిన)ను వినియోగించడం వల్ల సైబర్ దాడులు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. థర్డ్ పార్టీ డెవలపర్స్ అందించే అప్లికేషన్లను వినియోగించడం ద్వారా కూడా ఫోన్లలో వైరస్ చొరబడే అవకాశం ఉంటుందని చెప్పింది. అప్ డేట్స్ నిలిపివేసే సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫాంలు బ్లాక్ బెర్రీ(బ్లాక్ బెర్రీ 10 వరకూ) నోకియా ఎస్40 నోకియా సింబియన్ ఎస్60 ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2 విండోస్ ఫోన్ 7.1 ఐఫోన్ 3జీఎస్/ఐఓఎస్ 6