breaking news
sterilisation surgery
-
డాగ్ స్టెరిలైజేషన్‌లో అవినీతిపై పబ్లిక్ హియరింగ్ : ‘కుక్క’ను చూసి అధికారులు షాక్
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ప్రజా వినతుల కార్యక్రమంలో ఈ విచిత్ర నిరసన వైరల్‌గా మారింది.ఖాండ్వా మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రతిపక్ష నాయకుడు,కాంగ్రెస్‌నేత దీపక్ "ముల్లు" రాథోడ్, నగరంలో వీధికుక్కల సమస్యను మరియు స్టెరిలైజేషన్ (కుక్కల సంతానోత్పత్తి నిరోధక ప్రక్రియ) పథకంలో జరిగిన అవినీతిని నిరసిస్తూ ఒక వ్యక్తికి కుక్క మాస్క్ తొడిగించి ప్రజా విచారణ (Public Hearing) సభకు తీసుకువచ్చారు.రాథోడ్ మొదట మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు, కానీ వారు దీనికి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. నగరంలో వీధి కుక్కల సమస్యను ఎత్తిచూపేందుకు ఆయన ఈ వినూత్న నిరసన పద్ధతిని ఎంచుకున్నారు. ఆ 'కుక్క'కు వంధ్యీకరణ శస్త్రచికిత్స జరిగిందని, అయినప్పటికీ అది ఆరు కుక్కపిల్లలకు తండ్రి అయిందని చెబుతూ, అసలు వంధ్యీకరణ కార్యక్రమం జరిగిందా లేదా అని ఆయన ప్రశ్నించారు.ఈ విషయంపై విచారణ జరగాలని ఆయన కోరారు. ఒకవేళ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకపోతే, తన పేరుతో అవినీతికి పాల్పడినందుకు మున్సిపల్ కార్పొరేషన్‌పై ఆ 'కుక్క' పరువు నష్టం దావా వేస్తుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో మొదట ఆశ్యర్యపోయినా, తరువాత 'కుక్క' వేషంలో మనిషి వచ్చాడని తెలుసుకుని నవ్వుకున్నారు.ఇదీ చదవండి : 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం📺WATCH | Man dressed as dog appeared at a public hearing in Madhya Pradesh's Khandwa to protest the growing stray dog population and the problems caused by them pic.twitter.com/aLxizQDwa5— The Tatva (@thetatvaindia) August 19, 2026కుక్క ముసుగులో ఉన్న వ్యక్తితో కలిసి బహిరంగ విచారణకు వచ్చినపుడు. ప్రవేశద్వారం వద్ద ఉన్న పోలీసు అధికారి మొదట వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే, హాలులో ఉన్న అధికారులు వారిని లోపలికి అనుమతించాల్సిందిగా పోలీసులకు సూచించారు. గత 4 ఏళ్లలో వీధి కుక్కల స్టెరిలైజేషన్ (కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్) కోసం మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు రూ.40 లక్షల బడ్జెట్ ఖర్చు చేసింది. అయినా జిల్లాలో కుక్కల సంఖ్య తగ్గకపోగా, కుక్క కాటు కేసులు 13,225 కి పైగా పెరిగాయని ఆరోపించారు. ఆయన చేసిన ఫిర్యాదుపై అధికారులు స్పందించారు. ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని అదనపు కలెక్టర్ కాశీరామ్ బడోలే దీపక్ రాథోడ్‌కు హామీ హామీ వచ్చారు. విచారణ సమయంలో ముసుగు ధరించిన వ్యక్తి కుర్చీలోనే కూర్చుని ఉండటం విశేషం.ఇదీ చదవండి: ఫొటో తెచ్చిన తంటా..షాకైన వధువు, పెళ్లి క్యాన్సిల్ -
మ్యాగీ జేసినంత ఈజీగా డాక్టర్ ఆపరేషన్లు
రాయిపూర్: ఓ వైద్యుడు ఉద్యమం మాదిరి శస్త్ర చికిత్సలు చేశాడు. భారీ ఎత్తున ఆపరేషన్లు చేయడం కలకలం రేపింది. నిర్విరామంగా ఏడు గంటలపాటు 101 మందికి కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమీ) శస్త్ర చికిత్సలు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా ఆ వైద్యుడు ఆపరేషన్లు చేశాడు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. చదవండి: ఆస్పత్రి బాత్రూమ్లో ప్రసవించిన అత్యాచార బాధితురాలు సుర్గుజా జిల్లా నర్మదాపూర్ ఆరోగ్య కేంద్రంలో ఆగస్టు 27వ తేదీన మెగా స్టెరిలైజేషన్ క్యాంప్ నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఒక వైద్యుడు రోజుకు 30 కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయాలి. కానీ ఈ క్యాంప్‌లో ఏకంగా 101 ఆపరేషన్లు చేశారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రభుత్వ సర్జన్ శస్త్ర చికిత్సలు నిర్వహించాడు. ఈ శస్త్ర చికిత్సలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహిళల ఆరోగ్యం చూడకుండా ఇష్టమొచ్చిన తీరునా శస్త్ర చికిత్సలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విమర్శలు రావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించారు. ఆగస్టు 29న ఆ జిల్లా వైద్యాధికారి పీఎస్ సిసోడియా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సర్జికల్ స్పెషలిస్ట్ జిబ్నస్ ఎక్కా, మరో వైద్యుడు డాక్టర్ ఆర్ఎస్ సింగ్‌లకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటుచేశారు. దీనిపై వైద్యులు కమిటీకి ఓ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. ఆ రోజు శిబిరానికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చారని కమిటీకి తెలిపినట్లు సమాచారం. దూర ప్రాంతాల నుంచి మహిళలు వచ్చారని, వారు మళ్లీ అంత దూరం నుంచి రాలేకపోతామని వాపోయారని, అందుకే శస్త్ర చికిత్సలు చేసినట్లు తెలుస్తోంది. మహిళల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యులు వివరణ ఇచ్చారు. అయితే శస్త్ర చికిత్స చేయించుకున్న మహిళలంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి: సీక్రెట్ యాప్‌తో భార్య ఫోన్ ట్యాపింగ్.. ఆమెపై నీడలా భర్త -
బెడ్స్ లేవు .. నేలపైనే
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరాల నిర్వహణ తీరుపై నిరసనలు వెల్లువెత్తుతూండగానే ఉత్తర ప్రదేశ్ చందౌలిలో మరో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన మహిళలను నేలపైనే పడుకోమని చెప్పడం సంచలనం సృష్టించింది. చందౌలి జిల్లా నియమతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల శిబిరంలో ఆపరేషన్ చేయించుకున్న సుమారు 27 మంది మహిళలు బెడ్స్ లేని కారణంగా బాత్రూం పక్కనే ఉన్న నేలపై పడుకోవాల్సిన దుస్థితిని కల్పించారు. దీంతో ఆ మహిళల కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. తమ దయనీయ పరిస్థితిపై ఫిర్యాదు చేసిన తమను అధికారులు దుర్భాషలాడారని బంధువులు ఆరోపిస్తున్నారు.


